TG-SET 2024 Admit Card: నేడు తెలంగాణ TG-SET 2024 అడ్మిట్ కార్డులు విడుదల కానున్నాయి. TG-SET 2024 పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను అధికారులు సోమవారం విడుదల చేయనున్నారు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తెలంగాణ సెట్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోగలరని అధికారులు చెప్పడం జరిగింది. అభ్యర్థులు తెలంగాణ సెట్ అధికారిక వెబ్సైట్ ను సంప్రదించగలరు.
Link: http://telanganaset.org/
తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ TG-SET 2024 పరీక్షల షెడ్యూల్లో పలుమార్పులు చేయడం జరిగింది ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 28 29 30 31 వ తేదీల్లో పరీక్షలు జరగాల్సి ఉంది కానీ యు జి సి నెట్ పరీక్షల వలన TG-SET 2024 పరీక్షల తేదీలను అధికారులు మార్చడం జరిగింది కొత్త తేదీలను ఇటీవల ప్రకటించారు కొత్త షెడ్యూల్ ప్రకారము దరఖాస్తుల ఎడిట్ కు ఆగస్టు 23 24వ తేదీ వరకు అధికారులు అవకాశం కల్పించారు సెప్టెంబర్ రెండవ తేదీ నుంచి అంటే నేటి నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి కొత్త తేదీల ప్రకారం సెప్టెంబర్ 10 11 12 13 వ తేదీల్లో TG-SET 2024 పరీక్షలు జరగనున్నాయి.TG-SET 2024 Admit Card
తెలంగాణ సెట్ 2024 పరీక్షలు మొత్తం రెండు పేపర్లలో ఉంటుంది పేపర్ 1 లో 50 ప్రశ్నలకు వంద మార్కులు ఉంటాయి పేపర్ 2 లో 100 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి సిబిటి విధానంలో పరీక్ష జరగనుంది మూడు గంటల పాటు పరీక్ష సమయం ఉంటుంది ప్రతి సరైన సమాధానానికి రెండు మార్కులు ఉంటాయి నెగటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది పేపర్ 1 లో బోధన పరిశోధన పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి పేపర్ 2 లో అభ్యర్థులు ఎంపిక చేసుకున్న సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు
పేపర్ వన్ అందరికీ కామన్ గా ఉంటుంది జనరల్ పేపర్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆస్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు పేపర్ 2 అనేది అభ్యర్థి పూర్తిచేసిన సబ్జెక్టు పై రాసుకోవాలి ఇందులో ఎకనామిక్స్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ హెల్త్ సైన్స్ లైఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ మేనేజ్మెంట్ హిందీ సోషియాలజీ తెలుగు ఉర్దూ లైబ్రరీ అండ్ హిస్టరీ జాగ్రఫీ కెమికల్ సైన్స్ కామర్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ మ్యాథమెటిక్స్ ఫిజికల్ సైన్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫిలాసఫీ పొలిటికల్ సైన్స్ సైకాలజీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సంస్కృతం సోషల్ వర్క్ వంటి సబ్జెక్టులు ఉంటాయి.