చిరు Vishwambhara కు Akhanda 2 గట్టి పోటీ ఇస్తుందని సినీ వర్గాలు ఇప్పటి నుంచే మాట్లాడుకుంటున్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా ఉన్న చిరంజీవి బాలకృష్ణ చాలాసార్లు తమ సినిమాలతో పోటీ పడడం జరిగింది. కొన్నిసార్లు చిరంజీవి గారు విజయం సాధిస్తే కొన్నిసార్లు బాలయ్య బాబు గారు విజయం సాధించడం జరిగింది. తర్వాత చిరంజీవి గారు రాజకీయాలకు వెళ్లడం వలన బాలయ్యకు చిరంజీవికి మధ్య పోటీ ఆగిపోయింది. అయితే చిరంజీవి గారు మళ్లీ సినిమాలకు రీఎంట్రీ ఇచ్చిన తర్వాత చిరంజీవి గారు బాలయ్య బాబుతో పోటీ పడబోతున్నారు.
అసలు విషయానికి వస్తే Akhanda 2 టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఇండస్ట్రీలో ఒక వార్త హల్ చల్ చేస్తుంది. చిరంజీవి గారు నటించిన Vishwambhara టీజర్ కొంతకాలం క్రితం విడుదలై నెగిటివ్ రివ్యూలను ఎదుర్కొంది. అయితే బాలయ్య బాబు గారు రీసెంట్ గా నటిస్తున్న అఖండ 2 టీజర్ రిలీజ్ అయి పాజిటివ్ టాకును సొంతం చేసుకొని యూట్యూబ్ లో కొన్ని మిలియన్ వ్యూస్ ని సాధించడం జరిగింది. ఇది చూసిన సినీ ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలు చిరంజీవి గారి నటించిన విశ్వంబర సినిమాకి బాలయ్య బాబు గారి నటిస్తున్న అఖండ టు గట్టి పోటీ ఇస్తుందని చెబుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే విశ్వంభరా మూవీ కన్నా Akhanda 2 మూవీ కోసమే ప్రేక్షకులు ఎక్కువగా ఎదురు చూడటం జరుగుతుంది.
ఎందుచేతనంటే చిరంజీవి గారు నటించిన సినిమాలు వరుసగా ప్లాప్ అవుతున్నాయి. కానీ బాలకృష్ణ గారు మాత్రం గత రెండు మూడు సంవత్సరాల నుంచి వరుస పెట్టి బ్లాక్ బస్టర్లను తన ఖాతాలో వేసుకోవడం జరుగుతుంది. బాలయ్య బాబు గారు గత రెండు మూడు సంవత్సరాల నుంచి తన సినిమాలలో ఒక్కడి కూడా పరాజయం కాలేదు. వరుస విజయాలను సాధించడం జరుగుతుంది. కానీ చిరంజీవి గారు మాత్రం రీసెంట్ గా నటించిన ఆచార్య మరియు బోల శంకర్ సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి. అలాగే చిరంజీవి గారు నటించిన Vishwambhara శీనన్న యొక్క టీజర్ కూడా అంతంత మాత్రమే ఉన్నది. ఆ టీజర్ రిలీజ్ అయినప్పుడు ఇతర హీరోల ఫ్యాన్స్ మాత్రమే కాకుండా చిరంజీవి ఫ్యాన్స్ కూడా చాలా నిరుత్సాహ పడడం జరిగింది. అలాగే విశ్వంభరా టీజర్ మీద చాలా నెగిటివ్ ట్రోలింగ్ కూడా వచ్చాయి. అందుకని అందరూ అఖండ టు కి ఎక్కువగా చూడడానికి ఇష్టపడుతున్నారు.
అలాగని చిరంజీవి గారి స్టామినా తగ్గిందని కాదు. తెలుగు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది లెజెండ్ హీరో అని కూడా చిరంజీవి గారికి ఉన్న బిరుదు. కానీ చాలా రోజుల తర్వాత చిరంజీవి గారు బాలకృష్ణ గారు పోటీకి వస్తే చూడాలని కొంతమంది ఫ్యాన్స్ కూడా కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అప్పుడెప్పుడో పది పదిహేను సంవత్సరాల క్రితం పోటీపడ్డారు చిరంజీవి బాలకృష్ణ గారు. ఇప్పుడు అదే పోటీ మళ్ళీ వస్తే ఇండస్ట్రీలో కూడా చాలామంది సంతోషిస్తారు. అలాగే తెలుగు ఇండస్ట్రీ కూడా బాక్స్ ఆఫీస్ రికార్డులకి కళకళలాడడం జరుగుతుంది. చూడాలి ఈసారి చిరంజీవి గారు బాలకృష్ణ గారు తమ మూవీస్ తో పోటీపడి రెండు సినిమాలు భారీ విజయాలను సాధించాలి. ఈసారి చిరు బాలయ్య పోటీ పడితే ఏ హీరో విజయం సాధిస్తారో చూడాలి.