allu arjun atlee dubai meeting film : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు బాక్స్ ఆఫీస్ వద్ద భారి కలెక్షన్స్ ని తీసుకువచ్చింది దీంతో ఇండియాలోనే హైయెస్ట్ గ్రాస్ వసూలు చేసిన చిత్రంగా రెండవ స్థానంలో పుష్పా 2 ఉంది. ఈ మూవీతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు అల్లు అర్జున్ ఈ క్రమంలోనే తన నెక్స్ట్ మూవీ కొరకు చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి అయితే తన తర్వాత చిత్రం త్రివిక్రమ్ తో చేయాల్సి ఉండగా అది కాస్త లేట్ అవుతుందని దానికంటే ముందు తమిళ్ డైరెక్టర్ అట్లీతో మూవీ తీయాలని అనుకుంటున్నారుట అని టాప్ నడుస్తుంది.
ప్రస్తుత అల్లు అర్జున్ దుబాయ్ లో ఉండగా అట్లీ కూడా అక్కడే ఉన్నారని వీరిద్దరి మధ్య స్టొరీ డిస్కషన్ నడుస్తున్నాయని టాక్ వినిపిస్తోంది ఈ సినిమా కథను పక్కాగా సిద్ధం చేసేందుకు ఇద్దరు ఈ మూవీ కోసం ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది అట్లీ తన మార్క్ స్టైల్ లో హై ఎనర్జీ యాక్షన్ ఎమోషనల్ డ్రామా తో ఈ కథ ఉండబోతుందని తెలుస్తుంది.
allu arjun atlee dubai meeting film ఈ ప్రాజెక్టు అల్లు అర్జున్ కెరీర్ లో మరో మైలురాయిగా ఉండే అవకాశం ఉంది. అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఒక వార్త నడుస్తోంది ఈ మూవీ కోసం అల్లు అర్జున్ 175 కోట్లు మూవీకి రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని సినివర్గాల్లో చర్చ నడుస్తోంది. సన్ పిక్చర్స్ ఆయన ఒప్పందం కుదుర్చుకున్నట్లు భావిస్తున్నారు అయితే దీనిపై మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉండగా అక్టోబర్ నుంచి ఈ మూవీ షూటింగ్ ప్రారంభించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.
అల్లు అర్జున్ మూవీ లో డ్యూయల్ రోల్లో ఉండబోతున్నారని అనుకుంటున్నారు.
అంతేకాకుండా ఒక పాత్ర నెగటివ్ షెడ్స్ తో మరో పాత్ర హీరోగా ఉండబోతున్నట్లు టాక్ నడుస్తుంది. మరోవైపు స్టోరీ సిట్టింగ్స్ కోసం అల్లు అర్జున్ చాలా రోజులపాటు దుబాయ్ లో ఉంటున్నట్టుగా చెప్తున్నారు ఈ మూవీకి అన్ని ఓకే అయితే అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా మూవీ గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.