నెట్ ఫిక్స్ లో ఏడు దేశాల్లో Allu Arjun పుష్ప -2 దే టాప్ ఐకాన్ స్టార్ Allu Arjun – క్రియేటివ్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన పుష్ప 2 ఏ రేంజ్లో ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో టాప్ 3లో చోటు దక్కించుకుంది. తాజాగా ఓటీటీలోనూ థియేటర్కి మించి కుమ్మేస్తున్నాడు.
ఇందులో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్గా నటించారు. దాదాపు రూ.450 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పుష్ప 2ని నిర్మించింది. ఫాహద్ ఫాజిల్, సునీల్, జగపతి బాబు , అనసూయ భరద్వాజ్, తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో హైప్ నేపథ్యంలో పుష్ప 2 థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయి. భారతీయ చిత్ర పరిశ్రమలోనే తొలిసారిగా రూ.1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి మరో హీరోకు సాధ్యం కానీ రికార్డు సృష్టించాడు ఐకాన్ స్టార్ Allu Arjun. గతేడాది డిసెంబర్ 5న మొదలైంది అసలు సిసలు తుఫాన్. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11 వేల థియేటర్లలో గ్రాండ్ రిలీజైన పుష్ప 2 తొలి రోజే రికార్డ్ ఓపెనింగ్స్ సాధించి 1000 కోట్ల క్లబ్లో చేరింది.
ఇటీవలే అర్ధ శత దినోత్సవం జరుపుకున్న పుష్ప 2 .. ఇప్పటి వరకు రూ.1800 కోట్లకు గ్రాస్ ను రాబట్టింది . డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లకు రూ.250 కోట్లకుపైగా లాభాలను తెచ్చి పెట్టింది. పుష్ప 2ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఓటీటీ ఫ్యాన్స్ ఎదురుచూశారు. పుష్ప 2 డిజిటల్ రైట్స్ ని ఓటీటీ దిగ్గజం నెట్ ఎక్కువ ధరకు సొంతం చేసుకుంది. జనవరి రెండో వారంలో ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందని అంతా అనుకున్నారు. కానీ థియేటర్లో మంచి ఆక్యూపెన్సీ, రీ లోడెడ్ వెర్షను కూడా ప్రేక్షకుల ఆదరణ బాగుండటం, తదితర కారణాల వల్ల పుష్ప 2 ఓటీటీ స్ట్రీమింగ్ ఆలస్యమైంది.
ఈ సస్పెన్స్కు తెరదించుతూ.. జనవరి 30 నుంచి 20 నిమిషాల ఎక్స్టెండెడ్ వర్షన్తో కలిపి తెలుగు, తమిళ, కన్నడ, భాషల్లో స్ట్రీమింగ్లోకి తీసుకొచ్చింది నెట్రిక్స్. కేవలం 24 గంటల వ్యవధిలోనే పుష్ప 2 ది రూల్. నెట్క్లిఫ్లెక్స్ ఇండియా సోషల్ మీడియా ఖాతాల బయోలలో దిస్ పేజ్ అండర్ పుష్ప రూల్ అంటూ రాసుకొచ్చింది.తాజాగా పుష్ప 2 ఓటీటీలలో రికార్డు అందుకుంది. భారత్ లో నెంబర్ వన్గా ఉన్న ఈ సినిమా ఏకంగా 21 దేశాల్లో టాప్ 2లో ట్రెండ్ అవుతోంది. ఇందులో పాకిస్తాన్ కూడా ఉండటం విశేషం. మొత్తంగా నెట్ ఫ్లిక్స్ గ్లోబల్ ట్రెండింగ్లో టాప్ 10 లిస్ట్లో పుష్ప 2 ఏడో స్థానంలో కొనసాగుతోంది. మొత్తంగా Allu Arjun ఈ సినిమాలో చెప్పినట్లు పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్ అన్న మాట నిజమైంది. నాలుగు రోజులకే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో పుష్ప-2 ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి