Allu Arjun పుష్ప- 2 మూవీ సక్సెస్ మీట్

Written by 24 News Way

Published on:

 Allu Arjun పుష్ప-2 మూవీ సక్సెస్ మీట్: పుష్ప- 2 మూవీ సక్సెస్ క్రెడిట్ అంతా కూడా సుకుమార్ ది అని అల్లు అర్జున్ అన్నారు.  
పుష్ప-2 మూవీ తెలుగు ఇండస్ట్రీని గర్వించేలా చేశారు సుకుమార్ గారు. పుష్ప-2 థాంక్స్ మీట్ లో సుకుమార్ గురించి 
అల్లు అర్జున్ చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి.
హీరోలు కెమెరామెన్లు కొరియోగ్రాఫర్లు మూవీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి హిట్ ఇచ్చేది డైరెక్టర్ ఒక్కడే అని అల్లు అర్జున్
అన్నాడు. అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 థాంక్స్ మీట్ శనివారం హైదరాబాదులో జరిగింది.

ఈవెంట్లో పుష్ప-2 సక్సెస్ పై Allu Arjun ఆసక్తికర కామెంట్ చేశారు. ఈవెంట్ లో మాట్లాడుతూ ఆయన చాలాసార్లు ఎమోషనల్ అయ్యారు. ఈ థాంక్స్ మీట్ లో మాట్లాడుతూ ఈ మూవీలో నేను చేసిన యాక్టింగ్ పై చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. నాకు వచ్చిన కాంప్లిమెంట్స్ అన్నీ కూడా సుకుమార్ వల్లే నాకు వచ్చాయి. ఈ విషయంలో సుకుమార్ కి థాంక్స్ చెప్పడం తక్కువ అవుతుంది ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా థాంక్స్ చెప్పవలసింది సుకుమార్ కు మాత్రమే అన్ని బన్నీ చెప్పుకొచ్చారు.

సినిమాల్లో ఫైట్స్ గాని పాటలు ఏది మంచిగా రావాలన్నా ఆర్టిస్టులది టెక్నీషియన్లు గొప్పతనం కాదు గాని కేవలం డైరెక్టర్ గొప్పతనం. సుకుమార్ లాంటి గొప్ప డైరెక్టర్ గైడెన్స్ నాకు దొరకడం అదృష్టం. సుకుమార్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఈ మూవీ తో మా అందరిని గెలిపించడమే కాకుండా తెలుగు ఇండస్ట్రీని  గర్వపడేలా చేశారు మన దర్శకుడు సుకుమార్.  ఏదైనా సీన్ చెప్తుంటే నాకు పిచ్చెక్కిపోతూ ఉండేది. ఆయన చెప్పేటప్పుడు నేను చాలా ఎంజాయ్ చేశాను అయన గొప్ప జీనియస్ డైరెక్టర్.

పుష్ప-2 కోసం ఐదు సంవత్సరాలు జర్నీ చేశా షూటింగ్ అయిపోయింది అనగానే. టెన్షన్ మొత్తం పోయినట్లు అనిపించి. ఈ ఐదు సంవత్సరాలు కూడా డైరెక్టర్ ఏం చెప్తే అదే చేశాం. ఈ మూవీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి ప్రతిఫలం దక్కితే చాలు అనుకున్న ఆ ప్రతిఫలం దొరికింది దీనికి కారణం దర్శకుడు సుకుమార్.

రవిశంకర్ నవీన్ ఎర్నేని రవిశంకర్ లేకపోతే మూవీ లేదు మా అందరిని నమ్మి ఈ మూవీ చేసినందుకు కృతజ్ఞతలు. ఐదేళ్లు మమ్మల్ని ఎంతో జాగ్రత్త చూసుకున్నారు.మిలియన్ వివ్స్ సాంగ్స్ ఎలా చేస్తారని అనుకునేవాన్ని దేవిశ్రీ ప్రసాద్ నాకు బిలియన్ వివ్స్ సాంగ్స్ ఇచ్చారు.

అల్లు అర్జున్ మాట్లాడుతున్న టైము లో సుకుమార్ ఎమోషనల్ అయ్యాడు. Allu Arjun మాట్లాడుతున్న సమయంలోనే సుకుమార్ స్టేజ్ పైకి వెళ్లి అల్లు అర్జున్ ని కౌగిలించుకున్నారు. సుకుమార్ కు అల్లు అర్జున్ తో పాటు టీం మొత్తం స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చింది.

Read More>>

🔴Related Post