Allu Arjun Pushpa 2 షూటింగ్ లో గొడవ: అల్లు అర్జున్ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరో లలో ఒకడు .మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ గారి దర్శకత్వంలో పుష్ప 2 షూటింగ్ జరుగుతుంది ప్రస్తుతం పుష్ప 2 మూవీ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో వేసిన సెట్లో చిత్రీకరణ జరుగుతుంది వాస్తవానికి పుష్ప 2 మూవీ ఆగస్టు 15 తేదీన విడుదల కావాల్సిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులతో ఉన్న విభేదాలు వల్ల మరియు మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్ గొడవల వల్ల డిసెంబర్ 6 తారీకు కు నిర్మాతలు వాయిదా వేశారు . ఆ సమయంలో విడుదల చేసి ఉంటే చాలా నష్టం జరిగేది అనే భావనలో నిర్మాతలు ఉన్నారు . అలాగే ప్రస్తుతం జానీ మాస్టర్ గొడవలు తెలుగు సినిమా పరిశ్రమలో ప్రకంపనాలు రేపుతున్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమే.
గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టాలి అనుకుంటున్న సుకుమార్:
అయితే అసలు విషయానికి వస్తే Allu Arjun Pushpa 2 మూవీ లోకేషన్ లో అసలు గొడవ ఏమిటంటే. జానీ మాస్టర్ మరియు తన అసిస్టెంట్ మధ్య గొడవ పుష్ప 2 లొకేషన్ లోనే జరిగిందని జానీ మాస్టర్ భార్య మీడియాకు తెలియజేయడం జరిగింది . అయితే జానీ మాస్టర్ ను మరియు తన అసిస్టెంట్ను పిలిచి రాజీ కుదరచాలని ఒక స్టార్ హీరో ప్రయత్నించారు అని అయితే అది కుదరలేదు అని తెలిసింది. దానితోపాటు తాజాగా మరో విషయం బయటకు వచ్చింది దర్శకుడు సుకుమార్ కూడా జానీ మాస్టర్ మరియు జానీ మాస్టర్ బాధితురాలని పిలిచి మాట్లాడాలని రాజి కుదరచాలని సుకుమార్ గారు చూశాడని జానీ మాస్టర్ భార్య మీడియాతో తెలియజేసింది. అది కూడా కుదరలేదని తెలిసింది.
Allu Arjun Pushpa 2 కోసం జానీ మాస్టర్ బాధితురాలు ఒక పాటకు కొరియోగ్రఫీ కంపోజ్ చేయగా ఆ సమయంలో జానీ మాస్టర్ పుష్ప 2 సెట్ కు వెళ్లి గొడవ చేయడం జరిగింది దీంతో షూటింగ్ ఆగిపోయింది ఈ సమయంలోనే దర్శకుడు సుకుమార్ కలగజేసుకొని సర్ది చెప్పడానికి ప్రయత్నించారు ఆ సమయంలో గొడవ సర్దుమనింది అని అందరూ అనుకున్నారు.
అయితే జానీ పాస్టర్ గారు ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. అయితే జానీ మాస్టర్ భార్య సుమలత బాధితురాలు గురించి చెబుతూ బాధితురాలు తన వయసు తక్కువగా చెబుతుందని తను మైనర్ బాలిక కాదని మరియు తను తన భర్తని రెండో పెళ్లి ఎందుకు చేసుకోమంటాను అని జానీ మాస్టర్ భార్య మీడియాతో చెబుతుంది అలాగే బాధితురాలి తల్లిదండ్రులు ఎవరైనా బయటకు ఎందుకు రావటం లేదు అని జానీ మాస్టర్ భార్య ప్రశ్నించడం జరిగింది.
చూడాలి జానీ మాస్టర్ గొడవ ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో. ప్రస్తుతానికి జానే మాస్టర్ రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.