Johnny Master బాధితురాలికి Allu Arjun సపోర్ట్ : లీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు అయింది, ఈ కేసు తెలుగు ఇండస్ట్రీ లో ప్రకంపనాలు సృష్టిస్తుంది. జానీ మాస్టర్ తన దగ్గర పనిచేసే అసిస్టెంట్ పై అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు అందింది. గత కొంతకాలంగా జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని అసిస్టెంట్ డాన్స్ మాస్టర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు సెక్షన్ 376 ,506, ,23 కింద జానీ మాస్టర్ పై పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది.
Johnny Master పై కేసు నమోదు కావడంతో ఆయన్ను జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. టాలీవుడ్ ఇండస్ట్రీ సైతం జానీ మాస్టర్ ఇష్యూ పై చాలా సీరియస్ గానే రియాక్ట్ అయింది. అత్యాచార ఆరోపణలతో ఫిలిం ఛాంబర్ సైతం జానీ మాస్టర్ పై చర్యలు తీసుకుంది. జానీ మాస్టర్ ను డ్యాన్స్ అసోసియేషన్ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది నిజం నిర్ధారణ జరిగే వరకూ ఈ నిషేధం అమల్లో ఉంటుందని ఫిలిం ఛాంబర్ ఒక నోట్ విడుదల చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా నటి ఝాన్సీ మాట్లాడుతూ జానీ మాస్టర్ వివాదంలో బాధితురాలి కి టాలీవుడ్ పెద్ద హీరో అండగా నిలిచారని చెప్పడం జరిగింది.
తాను చేయబోయే కొత్త సినిమా లో ఆమెకు కొరియోగ్రాఫర్ గా అవకాశం కల్పిస్తానని ఆ హీరో ఆమె కు మాట ఇచ్చాడని యాక్టర్ ఝాన్సీ చెప్పుకొచ్చింది దీంతో ఆ టాలీవుడ్ పెద్ద హీరో ఎవరో అన్న చర్చ ఇప్పుడు మొదలైంది మెజార్టీ నేటిజన్స్ మాత్రం ఆ హీరో Allu Arjun అని అభిప్రాయపడుతున్నారు. అలాగే గీత ఆర్ట్స్ అన్ని సినిమాలకు తనకు పని అందిస్తానని జానీ మాస్టర్ కేసులో బాధితురాలికి Allu Arjun గారు హామీ ఇచ్చారు అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారుతుంది. దీనిపై నేటిజన్స్ రకరకాలు గా స్పందిస్తున్నారు మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చేవరకు మనందరం వేచి చూడాల్సిందే.
ఈమధ్య టాలీవుడ్ సినిమాలు అన్ని ఇండియా వ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలా మంచి పేరు తెచ్చుకుంటున్నాయి . కానీ కొంతకాలంగా టాలీవుడ్ లో ఏదో ఒక వివాదం ద్వారా టాలీవుడ్ పేరు ప్రతిష్ట మంట కలిసి పోతుంది. కొందరి దర్శకులు హీరోల వల్ల టాలీవుడ్ ఎంత పేరు తెచ్చుకుంటుందో మనం చూస్తూనే ఉన్నాము కానీ కొంతమంది ఎదవల వల్ల టాలీవుడ్ పేరు ప్రతిష్ట మీద ప్రభావం చూపుతుంది ఇలాంటి వన్నీ ఇప్పటినుంచైనా తగ్గు మొహం పట్టాలని టాలీవుడ్ పెద్దలను అందరు కోరుకుంటున్నారు .ఇటువంటి విషయాలు మళ్లీ మళ్లీ జరగకుండా చూసుకునే బాధ్యత టాలీవుడ్ పెద్దల మీద ఉంది అని టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి.