పవన్ కళ్యాణ్ పై అల్లు అర్జున్ మామ సంచలన కామెంట్

Written by 24newsway.com

Published on:

పవన్ కళ్యాణ్ పై అల్లు అర్జున్ మామ సంచలన కామెంట్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అల్లు అర్జున్ మామ సంచలన కామెంట్ చేయడం జరిగింది.. మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్ మధ్య గత కొంతకాలంగా గొడవలు నడుస్తూనే ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే మెగా ఫ్యామిలీకి మరియు అల్లు అర్జున్ కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తుంది దీనికి కారణం అందరికీ తెలిసిందే ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ గారు వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలబడడం జరిగింది వైసిపి అభ్యర్థికి ప్రచారం చేయకపోయినా ఇన్ డైరెక్ట్ గా ప్రచారం చేసినట్టుగానే అల్లు అర్జున్ గారు ప్రవర్తించడం జరిగింది మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలిస్తే ఒక్క అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించడం జరిగింది నంద్యాల వైసిపి అభ్యర్థి తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కి అల్లు అర్జున్ గారు మద్దతు ప్రకటించడం జరిగింది. మరియు అక్కడికి వెళ్లి మరి అల్లు అర్జున్ గారు వైసీపీ అభ్యర్థికి ప్రచారంలో కూడా పాల్గొనడం జరిగింది.

ఈ ఘటన తర్వాత మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్టుగా మారిపోయిన పరిస్థితి ఇప్పుడు కనిపిస్తూ ఉంది దీని తర్వాత అల్లు అర్జున్ ఉద్దేశించి మెగా బ్రదర్ నాగబాబు గారు ట్విట్టర్ వేదిక గా విమర్శలు కూడా చేయడం జరిగింది. దానికి బన్నీ అభిమానులు ఓ రేంజ్ లో ఫైర్ అవడం చక చక జరిగిపోయాయి అల్లు అర్జున్ అభిమానుల దెబ్బకు నాగబాబు గారు ట్విట్టర్ అకౌంట్ ని కూడా డిలీట్ చేయడం జరిగింది ఇక ఈ ఎన్నికల్లో కూటమి విజయం సాధించడం అల్లు అర్జున్ మద్దతు ప్రకటించిన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఓడిపోవడంతో మెగా అభిమానులకు అల్లు అర్జున్ ఒక్కసారిగా టార్గెట్ అవ్వడం జరిగింది.

దీంతో మెగా అల్లు ఫ్యామిలీ ల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి పైకి అంత బాగానే ఉందని చెబుతున్నా గాని లోపట మాత్రం పెద్ద యుద్ధమే జరుగుతుందని అభిమానులు అనుకుంటున్నారు. రెండు ఫ్యామిలీల మధ్య గొడవలు గట్టిగానే జరుగుతున్నట్లు కనిపిస్తుంది మెగా ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ నుండి అల్లు అర్జున్ గారిని ఎస్జిట్ అయ్యాడని వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది ఇది చాలాదన్నట్టు పవన్ కళ్యాణ్ గారు ఇటీవల అల్లు అర్జున్ గురించి షాకింగ్ కామెంట్ కూడా చేయడం జరిగింది. 40 ఏళ్ల క్రితం హీరోలు అడవులను కాపాడేవారు కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు దీనికి పూర్తిగా విరుద్ధంగా మారాయని ఆయన అభిప్రాయపడ్డారు ఇప్పుడున్న హీరోలు అడవులను నరికి స్మగ్లింగ్ చేస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సంచల కామెంట్ చేయడం జరిగింది. నేను ఇండస్ట్రీకి చెందిన వాడిని పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు ఇలాంటి సినిమాలో చేయడానికి తాను చాలా ఇబ్బంది పడతానని పవన్ కళ్యాణ్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ వాక్యాలు మన అల్లు అర్జున్ ఉద్దేశించి చేశారని మెజారిటీ అభిమానులు అభిప్రాయబడుతున్నారు ఈ వ్యాఖ్యలతో మెగా అల్లు వివాదం మరింత ముదిరిందని చెప్పవచ్చు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి తండ్రి స్పందించడం జరిగింది.

పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ మీద చేసిన కామెంట్ల కి అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి గారు స్పందించారు చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది ఆ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడుతూ పుష్ప చిత్రం పై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. అల్లు అర్జున్ ఒక నటుడిగా పుష్ప చిత్రంలో నటించారు అల్లు అర్జున్ రియల్ లైఫ్ లో ఎలాంటి తప్పు చేయలేదు కదా అని మాట్లాడుతూ అల్లు అర్జున్ నిజంగా ఎర్రచందన స్మార్ట్ లింక్ వ్యాపారం చేస్తే అది తప్పు గాని ఒక సినిమాలో నటుడిగా తనకొచ్చిన పాత్ర లో నటిస్తే తప్పేముంది దయచేసి పవన్ కళ్యాణ్ గారు తన వ్యాఖ్యలను పెద్ద మనసుతో వెనక్కి తీసుకోవాలి లేదా తాను చేసిన కామెంట్స్ అల్లు అర్జున్ ని ఉద్దేశించి కాదు అని చెప్పాలి పుష్ప చిత్రంలో నటనకు అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు కూడా వచ్చింది అంటే పవన్ కళ్యాణ్ ఎన్డీఏ ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా తప్పుపడుతున్నారా అంటూ చంద్రశేఖర్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించడం జరిగింది. ఈ వివాదంలో నెమ్మదిగా ఇరువు వర్గాల కుటుంబ సభ్యులు కూడా ఎంటర్ అయినట్టు కనిపిస్తూ ఉంది ఇంకా ఈ మెగా అల్లు అర్జున్ ఫ్యామిలీల మధ్య వివాదం ఇంకా ఏ స్థాయికి వెళుతుందో ఇప్పుడే చెప్పలేం.

Read More>>

Leave a Comment