పవన్ కళ్యాణ్ కి కౌంటర్ ఇచ్చిన అల్లు అర్జున్: మెగా ఫ్యామిలీ మధ్య వివాదం రోజు రోజుకి పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. ఇరు వర్గాల నుంచి ఏదో సందర్భంలో కౌంటర్ ఇచ్చుకుంటూనే ఉన్నారు. ఒకప్పుడు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గురించి అభిమానులు అడగగానే చెప్పను బ్రదర్ అని సమాధానం ఇవ్వడం జరిగింది అప్పటినుంచి మెగా ఫ్యామిలీ మరియు అల్లు ఫ్యామిలీ మధ్య వివాదాలు సమసాగుతూనే ఉన్నాయి. రీసెంట్గా జరిగిన ఏపీ ఎన్నికల సందర్భంగా ఈ వివాదాలు బహిరంగంగానే మారాయి.
అల్లు అర్జున్ అప్పట్లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు పవన్ పేరు ప్రస్తావించకుండా కొన్నాళ్లపాటు పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం కూడా గురి కావడం జరిగింది అల్లు అర్జున్ సరైనోడు బ్లాక్ బస్టర్ ఈవెంట్లో బన్నీ పవన్ కళ్యాణ్ గారి గురించి చేసిన ఓ కామెంట్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారానే లేపింది మెగా హీరోలకు సంబంధించిన ఏ సినీ ఫంక్షన్ జరిగినా కూడా పవన్ ఫ్యాన్స్ పవర్ స్టార్ పవన్ స్టార్ అని అరవడం ఆ ఫంక్షన్ లో సీరియస్ గా మాట్లాడుతున్న వారిని డిస్టర్బ్ చేయడం లాంటివి చేయడం కొత్తవి కాదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తీరు చూసిన విసిగిపోయిన వారిలో చిరంజీవితో పాటు నాగబాబు కూడా ఉన్నారు ఓ ఫంక్షన్ లో అయితే నాగబాబు ఏకంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. బన్నీ కూడా ఇలాగే ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అనడం బన్నీకి కూడా చాలా కోపం తెప్పించింది తాను సినిమా గురించి సీరియస్ గా మాట్లాడుతుంటే మధ్యలో పవర్ స్టార్ గురించి చెప్పాలని కొందరు ఫాన్స్ గోల చేయడంతో నేను చెప్పను బ్రదర్ అంటూ అల్లు అర్జున్ అసహనం వ్యక్తం చేశాడు. ఆ మాటలతో పవన్ కళ్యాణ్ అభిమానులకు అల్లు అర్జున్ శత్రువుగా మారాడు కొంతమంది అల్లు అర్జున్ కు విజయాలు రావడం వల్ల తలకు పొగరెక్కిందని అని మండిపడితే మరికొందరు పవన్ కళ్యాణ్ పేరు నిజంగానే చెప్పాల్సిన అవసరం లేదని అర్జున్ మనసులో ఉన్న మాటని కొంతమంది ఫేస్బుక్ ద్వారా తెలియజేయడం జరిగింది అప్పుడు ఈ వార్త చాలా ప్రభంజనాన్ని సృష్టించింది. అప్పట్లో ఫేస్బుక్ లో చెప్పను బ్రదర్ అనే ఆ స్టాక్ తో పోస్ట్లు చాలా వైరల్ గా మారాయి.
అసలు విషయానికొస్తే మొన్న జరిగిన ఏపీ ఎన్నికల సందర్భంగా మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్కి అసలు పడటం లేదని బహిరంగనే తెలిసింది. అప్పటినుంచి మేఘాలు ఫ్యామిలీల మధ్య కోల్డ్ వర్క్ స్టార్ట్ అయిందని తెలుస్తుంది ఎన్నికల ముందు వరకు సైలెంట్ గా అంతర్గతంగా మెగా హల్లు ఫ్యామిలీ గొడవలు ఉండేవి వాటిని ఎప్పుడు బహిర్గతం కాలేదు. పోయిన ఎన్నికల్లో అల్లు అర్జున్ తన ఫ్రెండు వైసీపీ పార్టీ వాళ్లకి సపోర్ట్ చేయడం వల్ల మెగా అల్లు ఫ్యామిలీ మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి . మెగా ఫ్యామిలీల్లో హీరోలు అల్లు అర్జున్ అల్లు అర్జున్ ఫ్యామిలీ హీరోలకు కౌంటర్ ఇవ్వడం తరచూ జరుగుతుంది. ఎలా పవన్ కళ్యాణ్ గారు సినిమా హీరోల గురించి మాట్లాడుతూ ఒకప్పుడు సినిమా హీరోలు మంచిని ప్రోత్సహించే వారిని ఇప్పుడున్న హీరోలు మోడలింగ్ గురించి సినిమాలు తీసి యువతను చెడగొడుతున్నారని ఇన్ డైరెక్ట్ గా అల్లు అర్జున్కి కౌంటర్ ఇవ్వడం జరిగింది. అప్పుడు అల్లు అర్జున్ సైలెంట్ గానే ఉన్నారు
రీసెంట్ గా అల్లు అర్జున్ గారు సుకుమార్ భార్య నిర్మాతగా వ్యవహరించిన మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్ గారు హాజరు కావడం జరిగింది ఆ ఫంక్షన్ లో అల్లు అర్జున్ గారు మాట్లాడుతూ మై డియర్ ఫాన్స్ మీరేనా ఆర్మీ నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి హీరోని చూసి చాలా మంది ఫ్యాన్స్ అవుతారు కానీ నేను నా ఫ్యాన్స్ ని చూసి హీరోనయ్యా నా నుంచి కొత్త సినిమా వచ్చి మూడేళ్లయిన మీరు చూపే ప్రేమ అసలు తగ్గలేదు నన్ను ప్రేమించే వాళ్ళ కోసం నిలబడగలగాలి మన అనుకున్న వాళ్లకోసం ఎంతవరకైనా వెళ్తా అంటూ కామెంట్ చేయడం జరిగింది ఎన్నికలు ముగిసిన తర్వాత మొదటిసారి బన్నీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారాయి ఇది కచ్చితంగా మెగా ఫ్యామిలీని ఉద్దేశించి ఇచ్చిన కౌంటర్ గా అందరూ అభిప్రాయపడుతున్నారు. ఇంకా ఎంతకాలం మెగా అల్లు వారి గొడవలు కొనసాగుతాయో తెలవడం లేదు ఫ్యాన్స్ కూడా చాలా ఆందోళన పడుతున్నారు. ఇప్పుడు తెలుగు సినిమా ప్రపంచాన్ని మన వైపు చూసేలా చేస్తుంది.. ఈ టైంలో టాప్ హీరోగా ఉన్నా అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారు రామ్ చరణ్ గారు ఇలా గొడవలకు పోయి ఫాన్స్ ని ఇబ్బంది పెట్టొద్దు అని ఫాన్స్ ఉద్దేశం. తెలుగు ఇండస్ట్రీ ఒక మెట్టు పైకి ఎక్కించడానికి అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారు రామ్చరణ్ గారు చిరంజీవి గారు తమ వంతు కృషి చేసి మంచి సినిమాలను ఫ్యాన్స్ కి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఒక మెగా అల్లు అభిమాని.