కమిట్మెంట్ గురించి షాకింగ్ కామెంట్ చేసిన అనసూయ

Written by 24newsway.com

Published on:

షాకింగ్ కామెంట్ చేసిన అనసూయ:  సిరి ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఎప్పటికీ తీరని సమస్య. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇది అనుభవంలోకి వస్తుంది సెలబ్రిటీలు హీరోలు హీరోయిన్లు కూడా తాము ఎదుర్కొన్న అనుభవాల గురించి సోషల్ మీడియాలో చాలాసార్లు తెలియజేయడం జరిగింది. కొన్ని సందర్భాల్లో హీరోయిన్లు కూడా పలు ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి బహిరంగంగానే చెప్పారు.

ఈ క్యాస్టింగ్ కౌచ్ అనేది సినిమా ఇండస్ట్రీ లే కాకుండా ప్రతి దానిలో ఉందని మనందరికీ తెలిసిన విషయమే. కానీ క్యాస్టింగ్తో విషయంలో సినిమా ఇండస్ట్రీ నే హైలెట్ చేసి చూపించడం జరుగుతుంది. దీనివల్ల మన తెలుగు పరిశ్రమలలో తెలుగువారు ఇండస్ట్రీలోకి పెళ్ళాలనుకునే వాళ్ళు చాలా భయపడుతున్నారు. దీని గురించి అనసూయ భరద్వాజ్ ఒక కామెంట్ రీసెంట్ గా చేసింది. ఆ కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బుల్లితెరపై యాంకర్ గా మెరిసిన అనసూయ ప్రస్తుతం సినిమాల్లో కూడా నటిస్తూ చాలా బిజీగా ఉంటుంది ఇటీవల అనసూయ భరద్వాజ్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్యాస్టింగ్ కౌచ్ పై అనసూయ స్పందించడం జరిగింది. తనకు ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు తాను ఎలా ప్రవర్తిస్తానో తెలియజేసింది.

అనసూయ భరద్వాజ్ కాస్టింగ్ కోచ్ తనకు ఎదురైనప్పుడు తాను ఎలా ప్రవర్తిస్తుందో ఈ విధంగా తెలియజేసింది. ఒక సినిమా గురించి చర్చించడానికి వెళ్ళినప్పుడు ఎదుటివారి ఉద్దేశం మొదట్లోనే మనకు అర్థమవుతుంది. మన నుంచి వారు ఏదైనా ఆశిస్తున్నారని అర్థమైనప్పుడు తన వరకైతే తన కుటుంబం పిల్లలు గురించి మరియు భర్త గురించి వారి ముందు మాట్లాడతానని అప్పుడు వాళ్ళు ఈ టాపిక్ తన ముందుకు తీసుకురారంటూ చెప్పింది. పరిశ్రమలో ఉండాలి అంటే ఎవరితోనూ వివాదాలు పెట్టుకోకుండా లౌక్యంగా మాట్లాడాలని అనసూయ ఈ సందర్భంగా తెలియజేసింది భవిష్యత్తులో వారు మనకు ఎదురైనా గానీ ఇబ్బంది పడే పరిస్థితి ఉండకూడదని వివరించింది. కమిట్మెంట్ విషయంలో కర్ర విరగకుండా పాము చావకుండా వ్యవహరించాలని అనసూయ తెలియజేసింది.

అనసూయ కు ఇండస్ట్రీలో ఫైర్ బ్రాండ్ గా మరియు ముక్కుసూటిగా మాట్లాడే అనసూయ తనపై ఎవరన్నా కామెంట్ చేశానా ట్రోల్స్ చేసినా గాని ఫైర్ అవుతూ ఉంటుంది. అలాంటి అనసూయ కంబైట్మెంట్ అడిగే వాళ్ళ నుంచి తెలివిగా తప్పుకోవాలని సూచించింది గొడవలు పడడం సరికాదని చెప్పింది. సినిమాల్లో వరుస ఆఫర్లను అందుకుంటుంది. అనసూయని కూడా అనుభవం అయినట్టుంది. ఇండస్ట్రీలో సరిగా మాట్లాడకపోయినా గొడవలు పెట్టుకోవడం వల్ల ఆఫర్స్ తగ్గుతాయని అనసూయ గుర్తించింది. అందుకే ఈ మధ్యన అనసూయ నీతులు చెప్పడం స్టార్ట్ చేసింది.

అనసూయ ఈమధ్య వలస ఆఫర్ల తో దూసుకెళ్తుంది. అనసూయ ఒక్క తెలుగు ఇండస్ట్రీ నే కాకుండా వేరే ఇండస్ట్రీలో కూడా సినిమాలలో మంచి పాత్రలు పోషిస్తూ బిజీగా ఉంటుంది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి గారితో కూడా అనసూయ ఒక సినిమాలో నటించింది ఆ సినిమా మలయాళ ఇండస్ట్రీలో బ్లాక్ బాస్టర్ గా నిలవడం వల్ల మలయాళ ఇండస్ట్రీ నుంచి కూడా అనసూయకు ఆఫర్లు వెతుక్కుంటూ వస్తున్నాయి. వీటితోపాటు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పుష్ప టు సినిమాలో కూడా అనసూయ కీలక పాత్రలో నటించింది. పుష్ప 1 కన్నా పుష్ప 2 లో అనసూయ పాత్ర చాలా ఎక్కువగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారo దీని ద్వారా అనసూయ ఇండస్ట్రీలో ఒక రేంజ్ కి వెళుతుందని ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు.

Leave a Comment