డిజాస్టర్ హీరో తో anil ravipudi నెక్స్ట్ సినిమా?

Written by 24newsway.com

Published on:

టాలీవుడ్‌లో ప్రస్తుతం హాట్ హాట్‌గా వినిపిస్తున్న పేరు Director anil ravipudi వరుస హిట్లతో దూసుకుపోతున్న ఈ దర్శకుడు ఇప్పుడు తీసుకునే తదుపరి నిర్ణయం ఇండస్ట్రీ మొత్తం దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా డిజాస్టర్ బ్యాక్‌ గ్రౌండ్ ఉన్న హీరో, ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న హీరోయిన్‌ తో సినిమా అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వరుస హిట్లతో అనిల్ రావిపూడి బ్రాండ్ వాల్యూ :

చాలామంది దర్శకులు ఒక్క హిట్ కోసమే ఏళ్ల తరబడి ఎదురుచూస్తుంటారు. కానీ anil ravipudi movies మాత్రం ఒకటి కాదు, రెండు కాదు  వరుసగా 9 సినిమాలు హిట్ చేసి టాలీవుడ్‌లో ప్రత్యేక బ్రాండ్‌ను క్రియేట్ చేశాడు. ఆయన సినిమా లంటే ఎంటర్‌టైన్‌మెంట్‌కు గ్యారంటీ అన్న నమ్మకం ప్రేక్షకుల్లో ఏర్పడింది.

మన శంకర వరప్రసాద్ గారు’- మెగాస్టార్‌ తో బ్లాక్‌బస్టర్ :

మెగాస్టార్ చిరంజీవితో అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. విడుదలైన తొలి వారంలోనే రూ. 292 కోట్ల Box Office collections సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్య పరిచింది. ఈ సినిమాతో మరోసారి చిరంజీవి స్టామినా ఏంటో రుజువైంది.

నయనతార, వెంకటేశ్ స్పెషల్ అట్రాక్షన్ :

ఈ మూవీలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటించగా, విక్టరీ వెంకటేశ్ అతిథి పాత్రలో మెరిశారు. సంక్రాం తి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా హౌజ్‌ఫుల్ షోస్‌తో దూసుకెళ్లింది. ప్రస్తుతం రూ. 300 కోట్ల మైలురాయి దిశగా ప్రయాణిస్తోంది.

అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ ఎవరితో?

ఈ భారీ విజయం తర్వాత అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా ఎవరితో అన్నదే ఇప్పుడు టాలీవుడ్‌లో ప్రధాన చర్చ. ఇప్పటికే చిరంజీవి, వెంకటేశ్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసిన అని ల్ఇ ప్పుడు మరో స్టార్‌తో చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

 నాగార్జునతో సినిమా చేయాలన్న ఫ్యాన్స్ డిమాండ్:

అక్కినేని అభిమానులు సోషల్ మీడియాలో అనిల్ రావిపూడిని ట్యాగ్ చేస్తూ నాగార్జునతో సినిమా చేయాలని కోరు తున్నారు. దీనిపై స్పందించిన అనిల్ రావిపూడి, నాగార్జునతో ‘హలో బ్రదర్’ తరహా ఎంటర్‌టైనర్ చేస్తానని చెప్పడం ఆసక్తికరంగా మారింది.

డిజాస్టర్ హీరోతో anil ravipudi సినిమా?

ఇదిలా ఉండగా, అనిల్ రావిపూడి తన తదుపరి సినిమాను Akhil Akkineni తో చేయనున్నారనే వార్త ఇప్పుడు ఇం డ స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అఖిల్ కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఒక్క క్లీన్ హిట్ కూడా లేకపోవడం తెలి సిందే.

‘ఏజెంట్’ డిజాస్టర్ తర్వాత అఖిల్ పరిస్థితి :

అఖిల్ గత చిత్రం ‘Agent’ బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో అఖిల్‌కు సరైన కమర్షియల్ హిట్ అవసరం అని నాగార్జున భావిస్తున్నారని టాక్. అందుకే అనిల్ రావిపూడిని అప్రోచ్ చేసినట్లు సమాచారం.

ఐరన్ లెగ్ హీరోయిన్‌గా ముద్రపడిన శ్రీలీల?

ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా Sreeleela పేరు వినిపించడం మరో చర్చకు దారి తీసింది. శ్రీలీల ఇటీవల నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడంతో సోషల్ మీడియాలో ఆమెకు ‘ఐరన్ లెగ్’ అన్న ట్యాగ్ అంటుకుంది.

శ్రీలీలకు కూడా హిట్ అవసరమే :

ఒకప్పుడు వరుస అవకాశాలతో బిజీగా ఉన్న శ్రీలీలకు ఇటీవలి కాలంలో సరైన హిట్ రాలేదు. దీంతో అఖిల్- శ్రీలీల కాంబినేషన్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

రిస్క్ అయినా అనిల్ స్టైల్ మ్యాజిక్?

డిజాస్టర్ హీరో, ఫ్లాప్ హీరోయిన్… ఈ కాంబినేషన్ రిస్క్ అని అనిపించినా, అనిల్ రావిపూడి స్టైల్ ఎంటర్‌టైన్‌మెంట్ వర్కౌట్ అయితే పరిస్థితి పూర్తిగా మారే అవకాశం ఉంది. గతంలో కూడా ఆయన కంటెంట్‌తో చాలా మంది హీరోలకు సూపర్ హిట్స్ ఇచ్చారు.

సినిమా కథ, జానర్ ఎలా ఉండబోతుంది?

సమాచారం ప్రకారం ఈ సినిమా కూడా పూర్తి స్థాయి family entertainer గా ఉండబోతుందట. కామెడీ, ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్ అన్నీ మిక్స్ చేసి అనిల్ తన మార్క్ చూపించనున్నారని టాక్. ఇదే జరిగితే అఖిల్ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి.

టాలీవుడ్ చూపు మొత్తం ఈ సినిమాపైనే :

మొత్తానికి ఇది కేవలం ఒక సినిమా కాదు అఖిల్‌కు ఇది career survival movie, శ్రీలీలకు comeback chance, అనిల్ రావిపూడికి మాత్రం మరో Movie Update sensation అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడు చూడాలి మరి  డిజాస్టర్ హీరో, ఐరన్ లెగ్ హీరోయిన్‌తో అనిల్ రావిపూడి మరోసారి టాలీవుడ్‌ను షేక్ చేస్తాడా లేదా అన్నది.

Read More

🔴Related Post