anushka shetty movies : హీరోయిన్ అనుష్క శెట్టి సినిమాలో కనిపించి చాలా కాలం అయింది అయినప్పటికీ కూడా అభిమానుల్లో ఆమె క్రేజ్ ఏ మాత్రం చెక్కుచెదరలేదు. అతి తక్కువ కాలంలోనే అనుష్క తన కంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. తెలుగు స్టార్ హీరోలు అందరి తోను ఈ నటి నటించింది. లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది ముఖ్యంగా అరుంధతి సినిమాతో ఒక రేంజ్ లోకి వెళ్ళిపోయింది.
అయితే గత కొంతకాలంగా అనుష్క సినిమాలు చేయడం తగ్గించేసింది అని చెప్పాలి జీరో సైజ్ సినిమాతో లావు పెరిగిన అనుష్క తర్వాత బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేసింది దాదాపు 100 కేజీలకు పైగా బరువు పెరిగి ఆ మూవీని చేసింది. తర్వాత సినిమా కోసం ఆ బరువునంత తగ్గి మామూలు స్థితిలోకి వచ్చి ఆ మూవీని చేసింది రెండేళ్ల క్రితం యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి తో కలిసి మిస్ శెట్టి పోలిశెట్టి సినిమాతో అనుష్క ప్రేక్షకులకు ముందుకు వచ్చింది.
anushka shetty movies : ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు కథ నచ్చితే తప్పిస్తే అనుష్క సినిమా చేయదు అని తెలిసిందే. అనుష్క ప్రస్తుతం కథనర్ అనే మలయాళ సినిమాలో నటిస్తున్నారు దీంతోపాటు ఘాటి అనే తెలుగు సినిమాలో కూడా అనుష్క నటిస్తుంది. ఈ సినిమా టీజర్ అందరిని ఆకట్టుకుంది. ఇది ఇలా ఉంటే అనుష్క తాజాగా తన సోషల్ మీడియాలో తన ఫోటోలు షేర్ చేసింది. అనుష్క క్యూట్ లుక్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది ప్రభాస్ కనుక అనుష్క ఇలా చూస్తే ఫిదా అవడం పక్క అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ని అప్పట్లో యాక్టివ్ గా ఉండే బ్యూటీ ఇటీవల పెద్దగా పోస్టులు ఏమి పెట్టలేదు తాజాగా ఓ పోస్ట్ పెట్టడంతో అభిమానులు సంతోషపడుతున్నారు.
ఏలు గడుస్తున్న తనకు ఎంత వయసొచ్చినా తను ఎప్పుడు క్యూట్ గానే ఉంటుందని అభిమానులు వారి అభిప్రాయం వ్యక్తం చేశారు.

