టాలీవుడ్ వ్యాఖ్యల నుంచి యూట్యూబ్ రచ్చ వరకు ఎలా మొదలైంది?
టాలీవుడ్ నటుడు శివాజీ మహిళలపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ “naa anveshana” యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న అన్వేష్ ఒక వీడియో విడుదల చేశారు. అయితే ఆ వీడియోలో ఆయన చేసిన వ్యాఖ్యలు అసలు సమస్యకంటే పెద్ద YouTube controversyకి దారి తీసాయి.
శివాజీ వ్యాఖ్యలను విమర్శించే క్రమంలో అన్వేష్ ఉపయోగించిన మాటలు, ముఖ్యంగా హిందూ దేవతలను కించపరిచేలా ఉన్నాయన్న ఆరోపణలు రావడంతో విషయం ఒక్కసారిగా రాజకీయ, సామాజిక రంగాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
హిందూ సంఘాల ఆగ్రహం పోలీసుల వద్ద వరుస ఫిర్యాదులు :
అన్వేష్ వీడియో విడుదలైన కొద్ది గంటల్లోనే హిందూ సంఘాలు తీవ్రంగా స్పందించాయి. హిందూ దేవతలపై చేసిన వ్యాఖ్యలు తమ Hindu sentiments ను గాయపరిచాయని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదులు అందజేశారు.
ఈ క్రమంలో బీజేపీకి చెందిన పలువురు నాయకులు కూడా రంగంలోకి దిగారు. “వ్యక్తిగత అభిప్రాయాన్ని పక్కన పెట్టి మతాలను అవమానించడం అనర్థకమే” అంటూ విమర్శించారు.
హైదరాబాద్ నుంచి ఖమ్మం వరకు కేసుల వరుస :
ఫిర్యాదులు పెరిగిన నేపథ్యంలో తెలంగాణలో పలు ప్రాంతాల్లో పోలీసులు చర్యలు ప్రారంభించారు. హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో, సామాజిక కార్యకర్త కరాటే కళ్యాణి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు సమాచారం.
అదేవిధంగా ఖమ్మం, ఇతర జిల్లాల్లో కూడా police cases నమోదు అవుతున్నాయని తెలుస్తోంది. ఒక యూట్యూబర్‌పై ఒకేసారి పలు ప్రాంతాల్లో కేసులు నమోదు కావడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
who is naa anveshana :
అన్వేష్ “నా అన్వేషణ” పేరుతో యూట్యూబ్‌లో దేశ, విదేశాల పర్యటనలపై వీడియోలు చేస్తూ naa anveshana in come సంపాదించారు. ట్రావెల్, కల్చర్, ఫుడ్ వంటి అంశాలతో భారీ ఫాలోయింగ్ సంపాదించిన ఆయన ఛానల్‌కు లక్షలాది స బ్ స్క్రైబర్లు ఉన్నారు.
కానీ గత కొంతకాలంగా ట్రావెల్ వీడియోలకంటే వ్యక్తులు, ఆధ్యాత్మిక వేదికలు, సామాజిక అంశాలపై వ్యాఖ్యలు చేస్తూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజా వీడియో ఈ వివాదాలకు పరాకాష్టగా మారింది.
శివాజీ & గరికపాటి వ్యాఖ్యల వీడియో ఎందుకు మంటపుట్టించింది?
నటుడు శివాజీతో పాటు గరికపాటి నరసింహారావుపై వ్యాఖ్యలు చేస్తూ చేసిన వీడియోలో అన్వేష్ ఉపయోగించిన భాష తీవ్ర విమర్శలకు గురైంది. విమర్శ అనేది ఒక హద్దు వరకు సమంజసం అయినప్పటికీ, ఆధ్యాత్మిక భావాలను దెబ్బ తీసేలా మాట్లాడడం తగదని పలువురు అభిప్రాయపడ్డారు.
ఈ వీడియో విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో social media backlash మొదలైంది. ఒకవైపు తీవ్ర విమర్శలు, మరో వైపు కేసుల భయం అన్వేష్‌ను ఇరకాటంలో పడేసింది.
సబ్‌స్క్రైబర్ల షాక్ – అన్‌సబ్‌స్క్రైబ్ ట్రెండ్ :
వివాదం పెరిగిన కొద్దీ అన్వేష్ ఛానల్‌పై ప్రభావం పడింది. భారీగా సబ్‌స్క్రైబర్లు అన్‌సబ్‌స్క్రైబ్ చేయడం ప్రారంభించారు.
“కంటెంట్ కోసం మతాలను, వ్యక్తులను అవమానించకూడదు” అంటూ యూజర్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
ఇది ఒక యూట్యూబర్‌కు అత్యంత పెద్ద దెబ్బగా మారింది.
సారీ వీడియో చేసినా తగ్గని విమర్శలు :
వివాదం ముదిరిన తర్వాత అన్వేష్ మరో వీడియో చేసి క్షమాపణలు చెప్పారు. తన మాటల వల్ల ఎవరికైనా బాధ కలిగితే సారీ అంటూ వివరణ ఇచ్చారు. అయితే నెటిజన్లు మాత్రం వెనక్కి తగ్గడం లేదు.
“సారీ చెప్పడం సరిపోదు, బాధ్యత ఉండాలి” అంటూ విమర్శలు కొనసాగుతున్నాయి. ఇక్కడే freedom of speech మరియు బాధ్యత మధ్య సరిహద్దుపై చర్చ మొదలైంది.
చట్టపరంగా ముందుంది ఏంటి?
పోలీసులు కేసులు నమోదు చేయడంతో ఇప్పుడు తదుపరి చర్యలపై ఉత్కంఠ నెలకొంది. విచారణలో భాగంగా అ న్వేష్ ను నోటీసు లు జారీ చేసే అవకాశం ఉంది. అవసరమైతే ప్రశ్నించడం, డిజిటల్ ఆధారాలు సేకరించడం వంటి చర్యలు తీసుకునే అవకాశముంది.
ఈ కేసులు ఎంతవరకు వెళ్తాయి? అరెస్ట్ వరకు వెళ్లే పరిస్థితి వస్తుందా? లేక కౌన్సిలింగ్, హెచ్చరికలతో సరిపెడతారా? అన్నది ఇప్పుడు అందరిలో ఆసక్తిగా మారింది.
సోషల్ మీడియా సెలబ్రిటీలకు ఇది ఒక హెచ్చరిక?
ఈ మొత్తం ఘటన యూట్యూబర్లు, ఇన్‌ఫ్లూయెన్సర్లకు ఒక స్పష్టమైన సందేశం ఇస్తోంది. వ్యూస్, వైరాలిటీ కోసం హద్దులు దాటితే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో అన్వేష్ ఉదాహరణగా మారుతున్నారు.
సోషల్ మీడియాలో మాట్లాడే ప్రతి మాటకు బాధ్యత తప్పనిసరి అనే విషయం మరోసారి రుజువైంది.
అన్వేష్ భవితవ్యం ఏ దిశగా?
ఒకప్పుడు ట్రావెల్ వీడియోలతో అభిమానులను ఆకట్టుకున్న అన్వేష్, ఇప్పుడు వివాదాల మధ్య నిలిచిపోయారు. కేసు లు, రాజకీయ ఒత్తిళ్లు, సబ్‌స్క్రైబర్ల నష్టం ఇవన్నీ కలిసి ఆయన కెరీర్‌ను ఏ దిశగా తీసుకెళ్తాయన్నది వేచి చూడాల్సిం దే.
ఈ ఘటన తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా డిజిటల్ మీడియా బాధ్యతపై పెద్ద చర్చకు దారి తీసింది.

