మనం తాగే పాలల్లో ఏ MILK మంచివి ఆవు పాలు బర్రె పాలు. ఈ రెండిటిలో ఏ పాలు మంచివో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆవు పాలు మరియు గేదె పాలు రెండు తమ దైన ప్రత్యేకతలను కలిగి ఉంటాయి ఈ రెండు పాలల్లో ఏది మంచిది అనే ప్రశ్నకు సమాధానం చెప్పడం కొంచెం కష్టమైన విషయమే ఎందుకంటే వ్యక్తిగత అవసరాలు ఆరోగ్య పరిస్థితి మరియు ఇష్టాలపై ఇది ఆధారపడి ఉంటుంది. మొదటగా ఆవు పాలు గురించి తెలుసుకుందాం. వాటి లాభాలు ఏమిటో చూద్దాం.
ఆవు పాల వలన కలిగే లాభాలు:
ఆవుపాల వల్ల ఎముకలు మరియు దంతాల ఆరోగ్యానికి కావలసిన క్యాల్షియం ఆవుపాల ద్వారా మనకు దొరుకుతుంది . ఆవుపాలు క్యాల్షియం యొక్క అద్భుతమైన మూలం లాంటిది .అలాగే ఆవు పాల ద్వారా మన శరీరానికి కావాల్సిన కానాల మరమ్మతులకు కావలసిన కావలసిన ప్రోటీన్లను కూడా అందిస్తుంది. అలాగే ఆవు పాలు ప్రోటీన్ యొక్క మూలం అని చాలా అధ్యయనాలలో తెలిసింది .ఈ ఆవుపాల ద్వారా విటమిన్-డి మరియు బీ 12 వీటితోపాటు పొటాషియం వంటి అనేక ముఖ్యమైన విటమిన్లు మరియు ఖనిజాలు ఆవుపాలలో లభించడం జరుగుతుంది. కొన్ని అధ్యయనాల ద్వారా ఆవు పాలు తాగడం బరువు తగ్గడానికి ఎంతగానో సహాయపడుతుందని తెలిసింది. అలాగే ఆవుపాలలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో చాలా బాగా సహాయపడుతుందని కూడా అధ్యయనంలో నిరూపితమైనది.
ఆవు పాల వల్ల కలిగే నష్టాలు:
కొంతమందిలో లాక్టోస్ అనే చెక్కరను జీర్ణించుకోవడంలో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటివారికి ఆవు పాలు తాగడం వల్ల అజీర్తి మరియు అతిసారం వంటి సమస్యలు వస్తాయి. అలాగే ఆవు పాలలో ఉండే పూర్తి కొవ్వు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది .ఇది హృదయానికి సంబంధించిన వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే కొన్ని ఆవు పాలలో గర్భధారణ హార్మోన్లు కూడా ఉంటాయి. ఇవి కొన్ని ఆరోగ్య సమస్యలకు కారణం కూడా కావచ్చు. కొంతమందికి ఆవుపాల ప్రోటీన్ల వలన అలర్జీ కూడా వస్తుంది.
గేదె పాల వల్ల కలిగే లాభాలు:
గేదె పాలలో క్యాల్షియం మరియు ప్రోటీన్ మరియు విటమిన్లు మరియు ఖనిజాలు చాలా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి మరియు కాండరాల అభివృద్ధికి మరియు మొత్తం శారీర పని తీరుకు అవసరమైన విటమిన్ లను అందిస్తుంది. గేదె పాలలో ఉండే యాంటీ బాడీ లు రోగ నిరోధక శక్తిని చాలా బలోపేతం చేయడంలో ఎంతగానో సహాయపడతాయి అలాగే గేద పాలలోని ప్రోభాయో టిక్స్ జీర్ణ క్రియను చాలా మెరుగు పరుస్తాయి మరియు కడుపు సంబంధిత సమస్యలను చాలావరకు తగ్గిస్తాయి గేదె పాలలోని ప్రోటీన్ అధికంగా ఉండడం వలన శరీరానికి కావలసిన ప్రోటీన్స్ అన్నీ అందడం జరుగుతుంది.
గేదె పాల వలన కలిగే నష్టాలు:
గేదెపాలలో ఆవు పాల కంటే కొవ్వు శాతం చాలా ఎక్కువగా ఉంటుంది .ఇది హృదయానికి సంబంధించిన సమస్యలను మరియు బరువు పెరుగుదలకు చాలా వరకు దారి తీయవచ్చు లాక్టోస్ ఉన్నవారికి గేదెపాలు, జీర్ణం కావు. వీళ్లు గేదె పాలు తీసుకోవడం వలన ఉబ్బరం మరియు అతిసారం వంటి వాటికి దారితీస్తుంది. కొంతమంది వ్యక్తులకు గేదె పాలు వలన వచ్చే ప్రోటీన్ల వలన అలర్జీ కూడా రావడం జరుగుతుంది. గేదపాలలో ఉండే కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పలు సమస్యలకు దారి తీయవచ్చు.
ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాలు:
పిల్లలు: పిల్లలకు క్యాల్షియం అవసరం చాలా ఎక్కువగా కాబట్టి ఆవుపాలు తీసుకోవడం మంచిది.
పెద్దలు: పెద్దలు ఎముకల ఆరోగ్యం కోసం గేదె పాలు తీసుకోవడం చాలా మంచిది. అలాగే బరువు తగ్గాలనుకునేవారు ఆవుపాలను తీసుకోవడం చాలా మంచిది.
ఇంకో ముఖ్యమైన విషయము ఏమిటంటే. ఆవులు గేదెలు అవి తినే ఆహారం బట్టి మనకు వచ్చే పాలు కూడా ఆరోగ్యవంతంగా ఉంటేనే మన శరీరానికి కావలసిన ప్రోటీన్లు అన్ని అందడం జరుగుతుంది. ఇప్పుడు చాలావరకు పాలల్లో కూడా కల్తీ స్టార్ట్ అయింది. దయచేసి ప్యాకెట్ లో వచ్చే పాలకన్నా మీరు ఉండే ఏరియా దగ్గర పట్ల పశువులు పెంచుకునే వాళ్ళ దగ్గర నుంచి పాలు తీసుకోవడం శ్రేయస్కరం. అలాగే వాళ్ళు పశువులకు పెట్టే ఆహారాన్ని కూడా చెక్ చేసుకోవడం ఇంకా మంచిది. ఈ వార్త ద్వారా కొంతమంది అయినా స్వచ్ఛమైన పాలను తీసుకొని ఆరోగ్య వంతులుగా ఉండాలనేదే మా కోరిక. ఈ వార్తను మీ వాళ్ళ కు సెండ్ చేయడం మీ బాధ్యత.