kalki movie కి షాక్ ఇచ్చిన ఏపీ సీఎం

Written by 24newsway.com

Published on:

kalki movie కి షాక్ ఇచ్చిన ఏపీ సీఎం . పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారు రీసెంట్ గా నటించిన కల్కి మూవీ ఈనెల 27వ తేదీన ఇండియాలో ఉన్నాయా కాకుండా ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కాబోతుంది. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయిన మన డార్లింగ్ ప్రభాస్ గారు kalki movie తో అంతర్జాతీయ హీరోగా కూడా మారిపోతాడు అన్న నమ్మకాన్ని అభిమానులు వ్యక్తం చేయడం జరుగుతుంది అమితాబచ్చన్ కమలహాసన్ దీపికా పదుకొనే తదితరులు భారీ తారాగణం ఈ చిత్రంలో నటించడం జరిగింది. ఈ సినిమా బడ్జెట్ సుమారు 600 కోట్లు అయింది. వైజయంతి మూవీస్ అశ్విని దత్ నిర్మించారు.

ఈ చిత్రానికి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను 25 వ తేదీన ఏపీ లో చాలా పెద్ద ఎత్తున గా చేయాలనుకున్నారు. దీనికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు మరియు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు మొదలుగు వారు అతిధులుగా నిర్మాత అశ్వినీత ఆహ్వానించడం జరిగింది .ముఖ్యమంత్రి గా బిజీగా ఉండడంతో చంద్రబాబు నాయుడు గారు వస్తారా రారా అనే సందేహం కూడా చాలామందిలో వ్యక్తం అయింది. దీంతో దర్శకుడు నాగ అశ్విన్ ఈవెంట్ ను రద్దు చేశారు. 25న కాకుండా 26 వ తేదీన కొంచెం వెసులుబాటు కొంచెం చంద్రబాబు నాయుడు గారికి ఖాళీగా ఉండడంతో ఆరోజు చంద్రబాబు నాయుడు గారు హాజరయ్యే అవకాశం ఉందంటున్నారు అందరూ .దీంతో ఈవెంట్ను 26 వ తేదీన చేయాలని కల్కి మూవీ టీం భావిస్తుంది.

ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అసలు ఉందా లేదా అనే సందేహానికి సమాధానం:

కల్కి మూవీ విడుదల తేదీ 27వ తారీకు దీనికి ఒకరోజు ముందు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడం వల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదని అభిప్రాయం సినీ ఇండస్ట్రీ వర్గాల్లో వ్యక్తం అవుతుంది .27న రిలీజ్ రోజు కాబట్టి 26 వ తేదీన చాలా పనులు ఉంటాయి ఆ పనులన్నీ చూసుకొని ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడం అనేది సాధ్యపడదు అంటున్నారు ఇండస్ట్రీ పెద్దలు దీంతో ఈవెంట్ జరుగుతుందా లేదా అనే టెన్షన్ అభిమానుల్లో చాలా ఉన్నది ఇండియాలో ఈ సినిమాకు లభించే ఆదరణను బట్టి ప్రపంచవ్యాప్తంగా మిగతా భాషల్లో విడుదల చేయాలని నిర్ణయాన్ని చిత్ర యూనిట్ భావిస్తుంది .హాలీవుడ్ సినిమా స్థాయిలో దీన్ని విడుదల చేయాలని అందుకు తగ్గ కథ ఇందులో ఉందని దర్శకుడు నాగ్ అశ్విన్ భావించడం జరిగింది.

కల్కి మూవీ విషయానికి వస్తే ఈ సినిమా ఇండియా సినిమా హిస్టరీలోనే అత్యధిక బడ్జెట్ తో నిర్మించడం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా మన ఇండియా మరియు మన తెలుగు వాడి సత్తా ఏంటో వరల్డ్ వైడ్ గా తెలిసేలా చేయాలని దర్శకుడు నాగ్ అశ్విన్ గారు పట్టుదలతో ఉన్నారు. చూడాలి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని రికార్డులను బద్దలు కొడుతుందో. ఈ మూవీ విజువల్స్ చూసి ఆల్ ఓవర్ ఇండియా ఆశ్చర్యపడుతుంది. విడుదలైన ప్రచార చిత్రాలు మరియు విడుదలైన రెండు ట్రైలర్లు ఈ సినిమాని ఆకాశాన్ని ఎత్తేశాయి. చూడాలి కలికి మూవీ 27 తారీకు ఫస్ట్ రోజు ఎంత వసూలు చేస్తుందో.

READ MORE

Leave a Comment