apple health benefits : ఆపిల్ హెల్త్ బెనిఫిట్స్ ఆపిల్ మనందరికీ తెలిసిన రుచికరమైన పండు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఆపిల్ ను పండిస్తారు. ఇవి చాలా రకాలుగా పండుతాయి. అంతేకాకుండా ఇందులో బోలెడు ఆరోగ్య లాభాలు కూడా ఉన్నాయి. దీని ప్రతిరోజ తీసుకోవండం వల్ల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఆపిల్ ల్లో విటమిన్లు ఖనిజాలు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. దీని నేరుగా తినడమే కాకుండా జ్యూస్ జామ్ కేకులుగా తయారు చేసుకోవచ్చు. ఆపిల్ తినడం వల్ల కలిగే ఆరోగ్య లాభాలు మనం తెలుసుకుందాం.
apple health benefits ఆపిల్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు.
గుండె ఆరోగ్యం. ఆపిల్ లో ఉండే ఫైబర్ పొటాషియం విటమిన్ సి ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రక్తపోటును నియంత్రిస్తాయి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి.
బరువు నియంత్రణ. ఆపిల్లో ఫైబర్ ఎక్కువగా ఉండటంవల్ల వేగంగా తృప్తి కలిగిస్తుంది. దీని అతిగా తినడం నిరుత్సాహపరుస్తుంది. తక్కువ కేలరీలు ఉండడంతో బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
జీర్ణ వ్యవస్థ. ఆపిల్ లో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మల్ల బద్ధకం ఆ జీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది.
క్యాన్సర్ నిరోధకం. ఆపిల్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి రక్షణ కలిగిస్తాయి. ముఖ్యంగా కొల్లన్ క్యాన్సర్ కు ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
చర్మ ఆరోగ్యం. యాపిల్ లో ఉండే ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది.
దంతాలు ఆరోగ్యంగా ఉంచడం. ఆపిల్ తినడం వల్ల దంతాలను శుభ్రపరచడానికి సహాయపడుతుంది దంతాల ఎనామిలును బలపరుస్తుంది.
గమనిక. రోజు ఆపిల్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ అన్ని పండ్ల లాగే ఆపిల్ మితంగా తీసుకోవడం మంచిది. ఎక్కువగా తింటే అజీర్ణం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. గమనించగలరు.
గమనిక : ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్న వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

