మంచి ఆరోగ్యానికి మనం పాటించాల్సిన Ayurvedic Tips :
మనిషి అనే వాడు శారీరకంగాను మానసికంగానూ దృఢంగా ఉండాలి . తను ఉన్న పరిసరాలలో హాయిగా జీవించడానికి ఆరోగ్యమనేది ఎంతైనా ఉపయోగపడుతుంది. ఆరోగ్యం మనిషి యొక్క ప్రాథమిక హక్కు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నించాలి. మంచి ఆరోగ్య పరిసరాలను కల్పించుకోవాలి ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చూప వద్దు. ఆరోగ్యంగా ఉండాలి అంటే మనము పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి.
మన శరీరం సరైన టైంలో మంచి పౌష్టికరమైన ఆహారాన్ని అలాగే నేచురల్ గా దొరికే ఆహారాన్ని ఎప్పటికప్పుడు తీసుకోవడం వల్ల ఆరోగ్యం ఎప్పుడు చాలా మంచిగా ఉంటుంది. అయితే ఈ కాలంలో స్వచ్ఛమైన ఎటువంటి కెమికల్స్ లేని ఆహారం దొరకడం అంటే చాలా కష్టమని మనందరికీ తెలిసిన విషయమే. అనేక రసాయనాలు కలిసిన ఆహారాన్ని తినడం వల్ల శరీరంలో చాలా మార్పులు రావడమే కాకుండా చిన్న వయసులోనే రకరకాల జబ్బుల బారిన పడి జనాలు మరణించడం జరుగుతుంది. పూర్వకాలంలో రసాయనాలు లేని ఆహారాన్ని తినడం వలన మన పూర్వికులు సుమారు వంద సంవత్సరాలు బతికేవారు. కానీ ఈ కాలంలో రసాయనాలతో కూడిన కల్తీ ఆహారాన్ని కిరణం వల్ల మనిషి ఆయుషు వంద సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు పడిపోయిందని అధ్యయనాలు తెలియజేయడం జరుగుతుంది. అందుచేత పూర్వకాలంలో పాటించిన కొన్ని Ayurvedic Tips లను ఇప్పుడు మీకు తెలియజేయడం జరుగుతుంది . అవి ఏంటో ఇప్పుడు మనము చూద్దాం. వాటిని మీరు కూడా పాటించండి
పూర్వకాలంలో పాటించే ఆయుర్వేద సూత్రాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం
1. పాతకాలంలో నిద్రలేచిన వెంటనే గోరువెచ్చటి నీటిని తాగేవారు దీనివలన మలమూత్రాలు సాఫీగా జరుగుతాయని అప్పటి వాళ్ళ నమ్మకం.
2. నిద్ర లేచిన వెంటనే మాల మూత్ర విసర్జన చేయవలెను మలమూత్రాలను ఆపుకోవటం వలన రోగాలు వస్తాయి.
3. పళ్ళు తోముకునే ముందు నాలుకను దంతాలను శుభ్రపరుచుకోవలెను ఆ తర్వాత నల్ల తుమ్మ చెట్టు బెరడు మరియు కషాయం తో నోటిలోని క్రిములను తొలగించు కోవలెను.
4. దంతముల పాచిని తొలగించుట కొరకు వనమూలికలతో చేసినటువంటి దంత చూర్ణం వాడవలెను .చిగుళ్లలో వ్యాధులు కానీ చిక్కుళ లో ఏమైనా ప్రాబ్లం ఉంటే చిగుళ్ళకు నువ్వుల నూనె రాయడం చాలా మంచిది.
5. స్థానానికి ముందు గోరువెచ్చగా కాచిన నువ్వుల నూనెతో శరీరాన్ని బాగా మర్దన చేసుకొని కొంతసేపు ఉదయాన్నే వచ్చే సూర్యకిరణాలు శరీరానికి తగిలే విధంగా ఉండవలెను .అలాగే నువ్వుల నూనెకు బదులు కొబ్బరి నూనె లేదా ఆవాల నూనె కూడా మన శరీరానికి మర్దన చేసుకోవడానికి వాడుకోవచ్చు . ఆవాల నూనె చాలా శ్రేష్టమైనదని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. అలాగే ఔషధ తైలాలు కూడా మనం వాడుకోవచ్చు.
6. శరీరానికి నూనె మర్దన చేసుకోవడం వలన చర్మం చాలా మృదువుగా తయారవుతుంది. కీళ్లు కండరాలు కదలికలు మంచిగా ఉండును .అలాగే రక్త ప్రసరణ మంచిగా జరుగును. చర్మం ద్వారా మాల పదార్థాలు త్వరగా తొలగించబడును. రోజు వాకింగ్ మరియు ప్రాణాయామం , యోగాసనాలు చేయవలెను . స్నానం గోరువెచ్చని నీటితోనే చేయవలెను. గోరువెచ్చటి నీటితో స్నానం చేయడం వలన శ్వేతా రంద్రములు తెరుచుకొని చర్మం శుభ్రపరచబడుతుంది అలాగే శరీరం చాలా నిర్మలంగా ఉంటుంది.
7. మనము తీసుకునే ఆహారంలో తీపి ,పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు, అను ఆరు రుచులు కలిగి ఉండు ఆహారముని తీసుకుంటే చాలా మంచిది. జీర్ణశక్తికి అనుకూలంగా ఉండు ఆహారం తీసుకోవడం చాలా మంచిది అలాగే భోజనం చేయుటకు పది నుంచి పదిహేను నిమిషాల్లో ముందు పచ్చి అల్లం ముక్కలను కొద్దిగా ఉప్పుతో కలిపి తినవలెను.
8. నిద్ర పోయేటప్పుడు దక్షిణ మరియు తూర్పు దిశ వైపు తలపెట్టి పండుకోవలెను .నిదురించే గది అత్యంత స్వచ్ఛముగా గాలి వీచే విధంగా ఉండవలెను. నిద్రించే మంచం ఎత్తు వంపులు లేకుండా స్థిరంగా ఉండవలెను. నిదురించే గది చాలా నీటుగా ఉండేలాగా చూసుకుంటే మనకు ప్రశాంతమైన నిద్ర పడుతుంది. పండుకునే ఉగాది చాలా శుభ్రంగా ఉంచుకోవడం చాలా మంచిది.
9. ఈ కాలంలో కాఫీలు టీలు తాగడం చాలా కామన్ గా జరుగుతుంది. అయితే ఇవి తాగిన తర్వాత వెంటనే పండుకోరాదు. ఎందుకంటే ఇవి తాగిన తర్వాత నిద్ర పట్టడం చాలా కష్టం అవుతుంది. అలాగే మనము రోజుకి ఎనిమిది గంటలు ప్రశాంతమైన నిద్రను పోవాలి. అలాగే ఎక్కువసేపు మేల్కొనడం మరియు పండుకునే ముందు ఫోన్లు కంప్యూటర్ చూడడం కూడా మానుకోవాలి. వీటితోపాటు నిద్రపోవడానికి గంట ముందు ఇవి చూడడం ఆపేయాలి. ఈ కాలంలో చాలామంది ఫోన్లు చూస్తూనే పండుకోవడం జరుగుతుంది. అలా చేయడంవల్ల నిద్ర సరిగా పట్టక చాలామంది అనారోగ్య పాలు కావడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే పగటిపూట నిద్ర మంచిది కాదు . ఎండాకాలంలో మాత్రమే పగటి నిద్ర మంచిదని మన పూర్వీకులు ఏనాడో మనకు చెప్పడం జరిగింది .
వీటితోపాటు ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాలు:
10. మూత్రం ఆపుకోవటం వలన మూత్రంలో రాళ్లు ఏర్పడును మూత్రాశయం యొక్క కండరాలు పట్టత్వం కోల్పోవును మూత్ర మార్గంలో వాపు మంట కలుగును అందువలన బలవంతంగా మూత్రాన్ని ఆపరాదు.
11. మలవిసర్జన ఆపడం వలన కడుపులో నొప్పి మరియు కడుపు ఉబ్బరం మరియు అజీర్ణం మరియు తలనొప్పి ఇంకా కడుపులో పుండ్లు వంటి సమస్యలు మొదలవుతాయి కావున మలవిసర్జన అస్సలు ఆపొద్దు.
12. వాంతులను ఆపుకోవడం వలన తల తిరగడం, రక్తహీనత, కడుపులో మంట, చర్మ రోగాలు, మరియు జ్వరం మొదలైనవి వస్తాయి.
13. ఆవలింతలు ఆపుకోవడం వలన కళ్ళు, గొంతు, చెవి, ముక్కు, సంబంధించిన వ్యాధులు రావడం జరుగుతుంది.
14. ఆకలి దప్పిక వంటివి శరీరం కు కావలసిన పోషకాలను మరియు నీటి అవసరాలను తెలియజేస్తాయి. వీటిని అతిగా ఆపుట వలన శరీరమునకు అందవలసిన పోషకాలు అందకా శరీరం క్షీణించి పోతుంది. శరీరానికి కావలసిన రోగ నిరోధక శక్తి తగ్గి రకరకాల వ్యాధులు సంభవిస్తాయి . అలాగే ఇవి లోపించడం వల్ల శరీరం పొడిగా మారును.
15. కన్నీటిని ఆపుకోవడం వలన మానసిక వ్యాధులు , ఛాతిలో నొప్పి, తల తిరగడం మరియు జీర్ణకోశ వ్యాధులు సంభవిస్తాయి.
16. నిద్ర ఆపుకోవడం వలన నిద్రలేమి సమస్య మరియు మానసిక వ్యాధులు మరియు జీర్ణకోశ వ్యాధులు మరియు జ్ఞానేంద్రియాల వ్యాధులు సంభవించడం జరుగుతుంది.