Ayurvedic tips: మతిమరుపును తగ్గించడానికి ఆయుర్వేదంలో చాలా మార్గాలు ఉన్నాయి. వయసుతో సంబంధం లేకుండా వచ్చే ఒక పెద్ద సమస్య కానీ సరైన ఆహారం జీవనశైలి ద్వారా దీనిని నియంత్రించవచ్చు అని ఆయుర్వేదం చెబుతుంది మరి ముఖ్యంగా కొన్ని ప్రత్యేక మూలికలు మేధస్సును పనితీరును మెరుగుపరచడంలో చాలా ఉపయోగపడతాయి ఈ మూలికలు మెదడు ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి అలాగే నరాలు మరియు నాడీ వ్యవస్థను కూడా చాలా చురుకుగా పనిచేసేలా చేస్తాయి.. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
Ayurvedic tips:
1. బ్రహ్మీ: బ్రహ్మీ అనేది ప్రాచీన ఆయుర్వేద మూలిక. ఇది మెదడు ను శక్తివంతం చేయడంలో చాలా ప్రసిద్ధి పొందింది. దీనిని తరచూ తీసుకోవడం వల్ల మెమొరీ చాలా వరకు పెరుగుతుందని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది. అలాగే మానసిక ఒత్తిడిని తగ్గించి మేధాశక్తిని పెంచుతుంది .రోజువారి కషాయంక రూపంలో దీనిని తీసుకోవచ్చు .ఈ మూలిక మెదడుకు రక్త ప్రవాహాన్ని కూడా పెంచడం జరుగుతుంది. అలాగే ఈ మూలిక ను ప్రతి రోజు వాడడం వలన మెదడులోని నరాల ను ఈ మూలికా రక్షిస్తుంది. అలాగే మెదడు యొక్క కణాల ను రక్షిస్తుంది.
2. శంకపుప్పి: ఈ మూలిక మెదడులోని నరాల యొక్క కానాలకు పోషణను ఇస్తుంది. అలాగే ఈ మూలిక ద్వారా మనము మతిమరుపును కూడా తగ్గించుకోవచ్చు. ఈ మూలిక ద్వారా ఒత్తిడి ని తగ్గించడానికి కూడా చాలా సహాయపడుతుంది. దీనిని ఉదయాన్నే టీ రూపంలో కూడా తీసుకోవచ్చు. అలాగే ఇది నారాల శక్తిని పెంచి మానసిక ఒత్తిడి ని తగ్గించడం జరుగుతుంది. అలాగే ఈ మౌలిక జ్ఞానం ఏకాగ్రతను కూడా పెంచుతుంది.
3. అశ్వగంధ: అశ్వగంధ మూలిక మెదడులోని ఆక్సి డేటిన్ తగ్గించి జ్ఞాపకశక్తిని చాలా మెరుగుపరుస్తుంది. అలాగే అశ్వగంధ మెదడులోని నరాల కానాలను కూడా చాలా బాగా రక్షించడం జరుగుతుంది. అశ్వగంధ ద్వారా అల్టిమార్ వంటి వ్యాధులు వల్ల వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గించుకోవచ్చు .అశ్వగంధ ని రోజు వాడడం వలన మన శరీరంలో ఒత్తిడిని కూడా తగ్గించుకోవచ్చు. దీనితోపాటు అశ్వగంధ ఉపయోగించి నిద్రలేమి కారణంగా వచ్చే మతిమరుపును కూడా మనము నియంత్రించవచ్చు. అశ్వగంధ ద్వారా మనము నిద్రలేమి సమస్యను కూడా చాలా వరకు తగ్గించుకోవచ్చు.
4. తులసి: మనము రోజు చూసే తులసి మొక్క లో చాలా ఆయుర్వేదం ఉందని చెప్పవచ్చు. తులసి మొక్కలు లాలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి ఇవి మెదడులోని నరాల యొక్క కానాలను చాలా బాగా రక్షిస్తాయి .అలాగే తులసి ని ఉపయోగించి మెదడు లోని నాడీ వ్యవస్థ ను సమతుల్యం చేయడంలో తులసి అనేది చాలా కీలకపాత్ర పోషించడం జరుగుతుంది. తులసి మొక్క యొక్క ఆకులు కూడా మన శరీరానికి చాలా బాగా ఉపయోగ పడతాయి. తులసి ఆకుల రసాన్ని తాగడం వలన మతిమరుపు తగ్గుతుంది. అలాగే తులసి మొక్క ను మన ఇంటిలో ఉంచుకోవడం వలన సర్వరోగాలు నివారణ చేయవచ్చు . అలాగే తులసి చెట్టు వలన మన శరీరానికి మాత్రమే కాకుండా తులసి చెట్టు నుంచి వచ్చే గాలి కూడా చాలా మంచిది అని చెప్పవచ్చు. ఎందుకంటే తులసి చెట్టు వల్ల వచ్చిన గాలి గాలిలో ఉన్న మలినాలను శుభ్రం చేస్తుంది. మనకు స్వచ్ఛమైన గాలిని ఇస్తుంది. అందుకే పూర్వకాలంలో ప్రతి ఇంటిలో తులసి మొక్కను పెంచేవారు.
Read More
Like this:
Like Loading...