benefits of avocado fruit

Written by 24 News Way

Updated on:

benefits of avocado fruit : ఆవకాడో అనేది పెర్సియా అమెరికానా అనే చెట్టు నుండి వచ్చే పండు ఇది మధ్య మెక్సికో ప్రాంతానికి చెందినది. అవకాడో అనేది పోషకలు అధికంగా ఉండే పండు ఆవకాడలో ఆరోగ్యకరమైన కొవ్వులు విటమిన్లు ఖనిజాలు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది ముదురు ఆకుపచ్చ రంగులో మెత్తటి గుజ్జుతో ఉంటుంది. దీనిలో ఒక పెద్ద విత్తనం ఉంటుంది.

ఆవకాడో వల్ల కలిగే లాభాలు.benefits of avocado fruit

ఆవకాడో లో మోనోశరేటెడ్ కొవ్వులూ అధికంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి. మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి ఇందులో పొటాషియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అవకాడోలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

అవకాడోలో ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మల్ల బద్దకాన్నివారిస్తుంది అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కడుపు నిండిన భావనను కలిగిస్తాయి దీనివల్ల ఆహారం తక్కువగా తీసుకుంటాం. ఈ పండులో ఉండే పోలేట్ ఇది గర్భాధారణ సమయంలో శిశువు ఆభివృద్ధికి ఎంతో అవసరం పడుతుంది. ఇందులో విటమిన్ కె విటమిన్ ఈ విటమిన్ సి బి విటమిన్లు మరియు పొటాషియంతో సహా దాదాపు 20 విటమిన్లు ఖనిజాలు ఉంటాయి.

అవకాడో వల్ల నష్టాలు.

అవకాడో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అనడంలో సందేహం లేదు. కానీ దీని అతిగా తీసుకోవడం వల్ల నష్టాలు కూడా ఉన్నాయి కొంతమందికి అవకాడో వల్ల అలర్జీలు వస్తాయి. దురద వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అవకాడోలో కేలరీలు కొవ్వులు అధికంగా ఉంటాయి అధికంగా తింటే బరువు పెరిగే అవకాశం ఉంది. కొంతమందికి అవకాడో వల్ల కడుపు నొప్పి విరోచనాలు వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. అవకాడోను మితంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజ నాలు ఉన్నాయి. ఆరోగ్య సమస్యలు ఉంటే అవకాడో ను తినే ముందు డాక్టర్ ను సంప్రదించడం మంచిది.

గమనిక : ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్న వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Read More>>

🔴Related Post