benefits of cucumber : ఈ వేసవిలో కీరదోస తినండి.. ఆరోగ్యంగా ఉండండి! ఈ ఏడాది ఇప్పటికే ఎండలు మండుతున్నాయి ఈ ఎండాకాలంలో ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎండాకాలంలో శరీరానికి చలువ చేసే ఆహారాన్ని తినడం ఎంతో మంచిది ముఖ్యంగా సమ్మర్ సీజన్లో మనకు వాటర్ కంటెంట్ ఉన్న కూరగాయలను ఎక్కువ తినడం వల్ల మనకు మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అలాంటి కూరగాయలలో ఒకటి కీరదోస.
benefits of cucumber కీరదోస తినడం వల్ల కలిగే లాభాలు
వేసవి కాలంలో కీర దోసకాయలు తీసుకోవడం వల్ల చాలా లాభాలు కలుగుతాయి కీరదోస లో 95 శాతం నీరే ఉంటుంది. ఇది వేసవిలో శరీరాన్ని చల్ల పరచడానికి డి హైడ్రేషన్ సమస్య నుండి కాపాడటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కీరదోశలో ఉండే నీరు వల్ల ఇది మనకు ఎంతో ఆరోగ్య ప్రయోజనాలు చేపిస్తుంది. కీరదోస తినడం వల్ల ఎండాకాలంలో వచ్చే వడదెబ్బ నుండి మనం కాపాడుకోవచ్చు.
కీరదోస ఇచ్చే ఆరోగ్యం.
తీవ్రమైన ఎండ పరిస్థితిలోనూ కీరదోస శరీరానికి చల్లదానాన్ని అందిస్తుంది. వేసవికాలంలో అలసిపోయినట్లుగా అనిపిస్తే కీరదోస తినడం వల్ల ఉపశమనం లభిస్తుంది. కీరదోస మనం ప్రతినిత్యం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది.
డయాబెటిస్ కీరదోస బెస్ట్..
కీరదోస రసాన్ని వాడటం వల్ల చర్మం యవ్వనంగా ఉంటుంది. అలాగే మృదువుగా కూడా ఉంటుంది. కీరదోస రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది. ఇందులో ఉండే పొటాషియం మెగ్నీషియం రక్తపోటును తగ్గించడానికి ఎంతగానో సహాయం చేస్తాయి. మనలో ఉండే కిడ్నీ శుభ్రపరచడంలోనూ కీరదోస ఎంతగానో సహకరిస్తుంది. కీరదోస తినడం వల్ల రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తుంది.కీరదోస మన కంటి ఆరోగ్యానికి దోహదం చేస్తుంది.
బరువు తగ్గేందుకు
కీరదోస ను రోజు తినడం వల్ల బరువు కూడా తగ్గవచ్చు కీరదోసకాయలు ఉన్న విటమిన్ కె రక్తం గడ్డ కట్టడానికి సహాయపడుతుంది కీరదోసకాయని గుజ్జుగా చేసి దాని రసాన్ని తీసి నిమ్మరసం తేనె కలిపి తీసుకుంటే మూత్రం సాఫీగా వస్తుంది. ఈ కీరదోస వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి వీటిని ఈ వేసవి కాలంలో తినడం మంచిది.
గమనిక : ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్న వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.