Benefits of daytime sleep.. పగటి నిద్ర వల్ల కలిగే ప్రయోజనాలు..నిద్ర అనేది మనుషులకు చాలా అవసరమైన విశ్రాంతి స్థితి ఇది మన శరీరక మానసిక ఆరోగ్యానికి చాలా ముఖ్యం. నిద్రలో మన శరీరం మెదడు పునర్జీవనం పొందుతాయి. ఇది మన జ్ఞాపకశక్తిని ఏకాగ్రతను రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. కానీ వైద్యులు మాత్రం పగటిపూట నిద్ర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది అని చెబుతున్నారు. పగటిపూట నిద్రించడం వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.
ప్రయోజనాలు Benefits of daytime sleep..
మెదడు పనితీరు మెరుగుపడుతుంది. పగటి పూట కొద్దిసేపు నిద్రపోతే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. పగటి పూట నిద్రపోవడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. మధ్యాహ్నం కాసేపు నిద్రపోతే శరీరం మనసు రిఫ్రెష్ అవుతాయి కడుపు ఉబ్బరం మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు తగ్గుతాయి.
నష్టాలు
పగటిపూట ఎక్కువసేపు నిద్రపోతే రాత్రి నిద్ర పట్టకపోవచ్చు పగటిపూట అతిగా నిద్రపోవటం వల్ల మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది పగటిపూడి నిద్ర పోవడం వల్ల పనిపై శ్రద్ధ తగ్గుతుంది.
మధుమేహం వచ్చే ప్రమాదం…నిత్యం పగటిపూట నిద్ర పోవటం వల్ల మధుమేహం వచ్చే అవకాశం ఉంది.
ఎంతసేపు నిద్రించాలి?
పగటిపూట 20 – 30 నిమిషాలు నిద్రపోవడం మంచిది ఎక్కువసేపు నిద్రపోతే రాత్రి నిద్ర కు ఆటంకం కలుగుతుంది.
ఎప్పుడు నిద్ర పోవాలి?
మధ్యాహ్నం ఒకటి – మూడు గంటల మధ్య నిద్రపోవడం మంచిది.
ఎవరు నిద్రపోకూడదు?
రాత్రిపూట నిద్రలేమి సమస్య ఉన్నవారు
నిద్రలేమి సమస్య ఉన్నవారు
రాత్రిపూట షిఫ్ట్ లో పనిచేసేవారు.
గమనిక పగటిపూట నిద్ర గురించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించడం మంచిది.
గమనిక : ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్న వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

