Benefits of drinking lemon juice in the morning : ఉదయాన్నే నిమ్మరసం తాగడం వల్ల కలిగే లాభాలు…రోజు నిమ్మరసం తాగితే మీ ఆరోగ్యం మరింత మెరుగు పడుతుంది. బరువు కూడా తగ్గవచ్చు. నిమ్మరసంలో ఉన్న ప్రయోజనాలు తెలిస్తే మనం అస్సలు వదులుకోము.
నిమ్మరసం వల్ల కలిగే లాభం
నిమ్మకాయలో మనకు తెలియని చాలా ప్రయోజనాలు దాగి ఉన్నాయి. నిమ్మరసానికి ఆకలిని తగ్గించే గుణం ఉంటుంది. దానితోపాటు జీర్ణక్రియను మెరుగుపరిచే శక్తి కూడా ఉంది. అలానే బరువు తగ్గడానికి కూడా నిమ్మరసం సహాయపడుతుంది.నిమ్మకాయ అనేది నేరుగా కొవ్వు తగ్గడానికి కారణం కానప్పటికీ అవి వివిధ మార్గాల్లో బరువు తగ్గుదలకి సహాయపడుతుంది. నిమ్మరసంలో కేలరీలు తక్కువగా ఉంటాయి. కానీ విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవన్నీ కూడా జీర్ణ క్రియలు మెరుగుపరచడంలో ముఖ్యపాత్ర వహిస్తాయి.నిమ్మకాయలోని ఆమ్ల స్వభావం మన శరీరానికి పోషకాలు అన్నిటిని పూర్తిగా అందించడంలో సహాయపడుతుంది. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
బరువు తగ్గుదల
నిమ్మకాయలు విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కేలరీలను బర్న్ చేయడానికి సహాయపడుతుంది. ఉదయం పూట గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగటం వల్ల మనలోని మెట్టబాలిజంను తారాస్థాయికి వెళుతుంది. నిమ్మకాయలు కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి.
నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్
నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ మీరు తిన్న ఆహారం త్వరగా జీర్ణం కావడానికి ఉపయోగపడుతుంది మంచి జీర్ణ క్రియ ఉండటానికి సహాయపడుతుంది. నిమ్మకాయలోని యాంటీ ఆక్సిడెంట్లు అలాగే విటమిన్ సి మనలో ఉండే రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. మనలో ఉండే ఉబ్బరాన్ని కూడా తగ్గిస్తుంది.
ఆకలి కోరిక తగ్గుదల
నిమ్మకాయలలో ఉండే పెక్టిన్ ఆకలి కోరికలను నియంత్రించడంలో సహాయపడుతుంది భోజనానికి ముందు నిమ్మరసం తీసుకోవడం వల్ల మనలో కడుపునిండా అనుభూతి వస్తుంది దీనివల్ల మనం తక్కువ తింటాం నిమ్మలోని యాంటీ ఆక్సిడెంట్లు శక్తి కోసం నిల్వచేసిన కొవ్వును ఖర్చు చేసి మన శరీరానికి కావలసిన సామర్థ్యాన్ని ఇస్తుంది.నిమ్మరసం ను రోజు తాగడం వల్ల ఇన్సులిన్ రియాక్షన్ మెరుగుపరుస్తుంది రక్తంలో చక్కెర స్థాయిలను ఇది సులభంగా నియంత్రిస్తుంది.
కొవ్వు నిల్వలు (Benefits of drinking lemon juice in the morning..)
ఆమ్లం గా ఉన్నప్పటికీ నిమ్మకాయల శరీరంపై ఆల్కలైజింగ్ ప్రభావం కలిగి ఉంటాయి. శరీరంలో ఆల్కలీన్ వాతావరణం లో కొవ్వు నిలువలు తగ్గిస్తుంది.బరువు తగ్గడంతో పాటు మన ఆరోగ్య ప్రయోజనాల కోసం ఈ నిమ్మరసం నిత్యం తాగావడం మంచిది.
గమనిక : ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్న వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.