benefits of eating bottle gourd : సొరకాయ తింటే కలిగే ప్రయోజనాలు చూద్దాం.కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎందుకంటే వాటిలో వందలాది పోషకాలు ఉంటాయి. వీటిలో ఉండే పోషకాలు మన శరీర పనితీరును మెరుగుపరచడంలో వ్యాధులను నివారించడంలో సహకరిస్తాయి. అలాంటి కూరగాయల్లో ఒకటి సొరకాయ ప్రతి సీజన్లోనూ సొరకాయను మంచి ఫుడ్ గా పరిగణిస్తారు. ఎందుకంటే సొరకాయను పోషకాలు నిధిగా పిలుస్తారు. ఇది అనేక వ్యాధులు నివారించడంలో సహాయపడుతుంది. అందుకే దీన్ని ఏడాది పొడవునా తినవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు చర్మం నుండి గుండె వరకు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఈ సొరకాయ ప్రభావంతంగా పనిచేస్తుంది. ఆయుర్వేదంలో కూడా సొరకాయను ఔషధంగా వినియోగిస్తారు.
డైటీషియన్ల ప్రకారం సొరకాయలో ఫైబర్ నీరు విటమిన్ సి విటమిన్ బి కాల్షియం ఐరన్ సోడియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయని చెప్పవచ్చు. సొరకాయలో ఉండే ఫైబర్ మన మన శరీరంలో ఉండే జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్ధకం వంటి సమస్యను తొలగిస్తుంది. సొరకాయలో ఉండే విటమిన్ సి మన శరీర రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఇనుము హిమోగ్లోబిన్ లోపాన్ని అధిగమించడంలో సహాయపడుతుంది. సొరకాయలో ఉన్న కాల్షియం ఎముకలను దంతాలను బలపరుస్తుంది కేలరీలు తక్కువగా ఉంటాయి దీంతో బరువు నియంత్రించడంలో సహాయపడుతుంది.
benefits of eating bottle gourd సొరకాయలో లభించేపోషకాలు డయాబెటిస్ కొలెస్ట్రాల్ ను నియంత్రించడంలో సహాయపడుతుంది ప్రతిరోజు సొరకాయ తినడం వల్ల రక్తంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇది దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తగ్గించవచ్చు. సొరకాయలో ఉండే ఫైబర్ మన రక్తంలోని చక్కర నియంత్రించడంలో సహాయపడుతుంది. సొరకాయ మధుమేహ రోగులకు రసం చేసి ఇవ్వడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. గుండె కాలేయ ఆరోగ్యానికి సొరకాయ చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు తెలిపారు. సొరకాయలో అధిక మొత్తంలో నీరు ఫైబర్ ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది దానిద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఇది రక్తపోటు ను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది దీంతో గుండె జబ్బుల ప్రమాదం తగ్గించవచ్చు. మన శరీరంలో ఉండే విష వ్యర్థాలను తొలగించడంలో ఈ సొరకాయ ఎంతగానో సహాయపడుతుంది దానిద్వారా కాలేయం పనితీరు మెరుగు పడుతుంది.
గమనిక : ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్న వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.