Benefits of eating guava fruit : జామ పండు తినడం వల్ల కలిగే లాభాలు…మనకు సాధారణంగా కనిపించే పండ్లల చెట్లలో జామ చెట్టు ఒకటి ఇది ఇండ్లలో పెరిగే చెట్టు జామ పండ్లు కొన్ని తెల్లగా ఉంటాయి. కొన్ని ఎర్రగా ఉంటాయి. జామ పండ్లను పేదవాడి ఆపిల్ అని కూడా అంటారు. ఒకప్పుడు సీజన్లో మాత్రమే జామపండ్లు లభించేది కానీ ఇప్పుడు ఏడాది పొడవునా అందుబాటులో ఉంటున్నాయి. రోజు జామ పండు తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.
జామపండు వల్ల ఉపయోగాలు
వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా ఉపయోగపడుతుంది కణజాలం పొరను రక్షిస్తుంది కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది జామ ఏడాది పొడవును మనకు అందుబాటులో ఉంటుంది.
ప్రపంచంలో అన్ని దేశాలలో లభిస్తుంది ఈ పండులో విటమిన్ సి ఉంటుంది ఇది కమల పండులో కంటే ఐదు రెట్లు ఎక్కువగా ఉంటుంది ఆకూరలో లభించే పీచ్ కంటే రెండింతలు పీచ్ జామకాయలు ఉంటుంది.
చర్మ ఆరోగ్యంగా ఉంచేందుకు అవసరమయ్యే కోలాజన్ ఉత్పత్తికి కీలక పాత్ర పోషిస్తుంది. కొవ్వు మెటబాలిజాన్ని ప్రభావితం చేసే పెక్టిన్ జామ పండ్లు లభిస్తుంది. ఇది కొలెస్ట్రాలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.పేగులో ప్రోటీన్ పరిశుభ్రతను పరిరక్షించడంలో సహకరిస్తుంది.
Benefits of eating guava fruit జామలో కొవ్వు క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కావున బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి పండు జామకాయలు పోషకాలు విటమిన్లు పీచు పదార్థం వంటి గుణాల వల్ల చక్కెర వ్యాధిగ్రస్తులు సైతం దీన్ని తినవచ్చు.
నీటిలో కరిగే బి సి విటమిన్లు కొవ్వులో కరిగే విటమిన్లు జామకాయలు ముఖ్యంగా లభించే పోషకాలు ఇక జామ పండులో ఉండే విటమిన్ సి చర్మ ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
గమనిక : ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్న వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.