benefits of eating Horse gram

Written by 24 News Way

Published on:

benefits of eating Horse gram : ఉలవలు తింటే గుర్రానికి ఉన్నంత బలం వస్తుందని. మన పెద్దలు చెప్పేవారు మొదట్లో  ఉలవలు గుర్రాలు పశువుల మేతగా ఉపయోగించేవారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పేదవారి ఆహారంగా కూడా ఉండేది. తర్వాత కాలంలో ఇది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఉలువల్ని ఇంగ్లీషులో హార్స్ గ్రామ్ అని పిలుస్తారు. అంతే కాదు అమెరికా నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ ప్రకారం ఉలవలు భవిష్యత్తులో మంచి ఆహార వనరుగా మారుతుంది.

చాలా పోషకాలతో నిండిన ఉలవల్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. వీటిలో తెల్లవి నల్లవి రెండు రకాలుగా ఉంటాయి ఐరన్ ఫాస్ఫరస్ ఫైబర్ కాల్షియం ఇలాంటి ఎన్నో పోషకాలు వీటిలో పుష్కలంగా ఉంటాయి. బి 1 బి 6 విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. మాంసారానికి సమానమైన ప్రోటీన్ కూడా లభిస్తుంది.

ఉలవలు ఆరోగ్య ప్రయోజనాలు benefits of eating Horse gram 
బరువు తగ్గడంలో సహాయపడుతుంది
ఉలవలోని ఫైబర్ రక్తంలో గుండె ఆరోగ్యానికి మంచిది
కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది
ఉలవలో యాంటీ ఆక్సిడెంట్లు చర్మ సమస్యలకు మంచి ఉపకారిని.
అతిమూత్ర వ్యాధికి చక్కటి ఔషధం
కాలేయ పనితీరును ఇది రక్షిస్తుంది
ఎముకలను బలంగా మారుస్తుంది
రక్తహీనతను నివారించడానికి ఈ ఉలువలు ఎంతగానో సహాయపడతాయి
మూత్రపిండాల్లో రాళ్లను ఇచ్చిన చేయడంలో సహాయపడుతుంది
కొన్ని ప్రాంతాల్లో ఉలవలను పాలుగా మార్చి పిల్లలకు పోషకాహారంగా ఇస్తారు.

గమనిక సాధారణంగా గింజలు పప్పు ధాన్యాలను నానబెట్టి తినడం మంచిది. ముఖ్యంగా ఉలవల్ని నానబెట్టి ఉడికించడం వల్ల జీర్ణం సులభంగా అవుతుంది. అధికంగా తినడం వల్ల కడుపు ఉబ్బరం అజీర్ణం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది దీని గమనించుకోవాలి అలాగే హైపర్ ఎసిడిటీ సమస్య ఉన్నవారు అధిక ఆమ్లత్వం ఉన్నవారు ఈ ఉలవలను తినకపోవడం మంచిది.

గమనిక : ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్న వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

 

🔴Related Post