benefits of fenugreek water : మెంతులతో పొట్టను తగ్గించుకోవచ్చు ఇప్పుడున్న కాలంలో బెల్లీ ఫ్యాట్ చాలామందిని ఇబ్బంది పెట్టే పెద్ద సమస్య పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరగడానికి చాలా సమయం పడుతుంది. శరీరంలో మీతో భాగాల కన్నా ఈ పొట్ట చుట్టూ ఉండే కొవ్వు చాలా నిదానంగా కరుగుతుంది బెల్లీ ఫ్యాట్ ని కలిగించుకోవాలంటే మనం చాలా కష్టపడాల్సి వస్తుంది.
ఇప్పుడున్న కాలంలో జీవనశైలి అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు కారణంగా చాలామందికి ఇలాంటి సమస్యలు వస్తున్నాయి ఇందులో బెల్లీ ఫ్యాట్ పెద్ద సమస్యగా మారుతుంది ఎక్కువ మందిలో బెల్లీ ఫ్యాట్ తో బాధపడుతున్న వారు ఉన్నారు. బెల్లీ ఫ్యాట్ కారణంగా బిపి గుండె షుగర్ వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంతేకాకుండా పొట్ట చుట్టూ ఉండే కొవ్వు శరీర ఆకృతిని మార్చివేస్తుంది దీంతో నలుగురితో తిరగాలంటే ఇబ్బందిగా ఉంటుంది.
అందుకే బెల్లీ ఫ్యాట్ ని కరిగించుకోవాలి అయితే బెల్లీ ఫ్యాట్ ను కరిగించడం పెద్ద సవాల్ గా మారుతుంది. దీనిని కరిగించడానికి ఆరోగ్యకరమైన ఆహారం వ్యాయామంతో పాటు కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే ఈ కొవ్వును తగ్గించుకోవచ్చు వంట గదిలో దొరికే మెంతులతో ఈ పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును కరిగించుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు. మెంతులతో ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం.
మెంతుల్లో ఉండే పోషకాలు
benefits of fenugreek water మెంతులు అనేక పోషకాలు ఉన్నాయి అవి పొటాషియం విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ కె పోలిక్ యాసిడ్ కాపర్ వంటి ఇలా ఎన్నో పోషకాలు ఉన్నాయి మెంతుల్లో ఉండే పొటాషియం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది మెంతుల్లో గెలాక్లోమన్నన్ అనే సమ్మేళనం ఉంటుంది ఇది చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో పనిచేస్తుంది ఇంతే కాకుండా గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది మెంతుల్లో ఉండే విటమిన్ కె ఎముకలు బలంగా ఉండడానికి సహాయపడుతుంది. ఇలాంటి మెంతులు బరువు తగ్గడం కోసం ఎలా వాడాలో తెలుసుకుందాం.
మెంతుల నీరు
బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవడానికి మెంతులు నీరు మంచిగా ఉపయోగపడుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు ఇందుకోసం ఒక చెంచా మెంతులను తీసుకోండి వాటిని ఒక గ్లాస్ నీటిలో రాత్రంతా నానబెట్టాలి తరువాత రోజు ఉదయం నీటిని కొద్దిగా వేడి చేసి తాగవచ్చు. మెంతుల నీరు కొవ్వును బర్ను చేయడంలో ప్రభావంతంగా పనిచేస్తుంది దీన్ని రోజు తాగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
మెంతుల టీ
మెంతులతో చేసుకున్న టీ తాగడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గించడానికి సహాయపడుతుంది. ఇందుకోసం ఒక రెండు టీ స్పూన్ల మెంతుల్ని తీసుకోండి వాటిని ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించండి నీరు సగం వచ్చేంతవరకు మరిగించాలి ఆ తర్వాత చల్లార్చి గోరువెచ్చగా తాగండి మీరు కావాలనుకుంటే రుచి కోసం నిమ్మరసం గాని తేనె కలిపి దీనిని తాగవచ్చు ఇలా రోజు తాగడం వల్ల పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరిగిపోతుంది.
మెంతుల పొడి
మెంతుల్ని బాగా వేయించి పొడిలా చేసుకోవాలి ఈ మెంతులు పొడిని కూరల్లో లేదా వంటకాలలో వాడుకోవచ్చు దీనిని గోధుమపిండిలో కలిపి రొట్టెలు కూడా చేసుకోవచ్చు మెంతుల పొడిని సాలాడ్లు లో వాడుకోవచ్చు.
గమనిక ఇచ్చిన సమాచారం మీ అవగాహన కోసమే ఇది సోషల్ సమాచారం మాత్రమే కొన్ని అధ్యయనాలు సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు మీకు అందించాం వ్యక్తులు ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. వీటిని పాటించే ముందు సంబంధిత నిపుణుని సంప్రదించడం మంచిది. దీనిని మీరు గమనించగలరు.