benefits of sunflower seeds : మనకు ప్రకృతిలో లభించే ఆహారాలలో పొద్దుతిరుగుడు విత్తనాలు కూడా ఒకటి ఇది చూడడానికి మనకు చిన్నగా అనిపించిన ఈ గింజల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటిని సూపర్ ఫుడ్ అని కూడా అంటారు. ఈ పొద్దు తిరుగుడు గింజలు ఉదయాన్నే తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి శరీరం రోజంతా ఉల్లాసంగా శక్తివంతంగా ఆరోగ్యంగా ఉంటుంది.
పొద్దు తిరుగుడు విత్తనాలు ఉండే పోషకాలు ముఖ్యంగా ఈ విత్తనాల్లో విటమిన్ ఈ సినీలియం మెగ్నీషియం ప్రోటీన్లు ఫైబర్ ఇలా అనేక పోషకాలు ఉంటాయి. ఇలాంటి పోషకాలు అన్నీ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
విత్తనాలు తినడం వల్ల శక్తి లభిస్తుంది.
ఉదయం పూట పొద్దు తిరుగుడు విత్తనాలు తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది వీటిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు ప్రోటీన్లు ఫైబర్ పుష్కలంగా ఉండడం వల్ల మనం రోజంతా శక్తివంతంగా ఉండడానికి సహాయం చేస్తాయి ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో వీటిని తీసుకోవడం వల్ల మనం రోజంతా కూడా ఉత్సాహంగా ఉండొచ్చు.
గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది
ఈ విత్తనాల్లో ఉండే లినోలియిక్ ఆమ్లం ఉంటుంది ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెంచడానికి సహాయపడుతుంది అంతేకాకుండా వీటిలో ఉండే మెగ్నీషియం రక్తపోటు నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది దీంతో గుండెజబ్బులు రాకుండా ఈ గింజలు కాపాడతాయి.
రోగ నిరోధక శక్తిని పెంచడం benefits of sunflower seeds
పొద్దు తిరుగుడు విత్తనాలు ఉదయాన్నే తినడం వల్ల వీటిలో ఉండే విటమిన్ ఈ సెలినియం వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తో పోరాడి కణాల నష్టం నుండి రక్షిస్తాయి దీని ద్వారా రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి సహాయపడతాయి.
చర్మ ఆరోగ్యం
ఈ విత్తనాలు తినడం వల్ల వీటిలో ఉండే విటమిన్ ఈ చర్మానికి జుట్టుకు చాలా మంచిది. ఇది చర్మాన్ని తేమగా ఉంచడానికి మృదువుగా ఉంచడానికి సహాయం చేస్తుంది అలాగే జుట్టు పెరుగుదలను పెంచుతుంది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది ఈ విత్తనాలు తినడం వల్ల మీ చర్మం జుట్టు ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
జీర్ణ క్రియను మెరుగుపరచడం.
పొద్దుతిరుగుడు విత్తనాల్లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడానికి మలబద్దకనీ నివారించడానికి సహాయపడుతుంది ఉదయం పూట వీటిని తినడం వల్ల జీర్ణ వ్యవస్థ రోజంతా మంచిగా పని చేస్తుంది.
ఎముకలు బలంగా ఉండడానికి
ఈ విత్తనాల్లో ఉండే మెగ్నీషియం ఫాస్పరస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా చేయడానికి ఎముకల సాంద్రతను పెంచడానికి సహాయపడతాయి వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీన పడకుండా వీటిలో ఉండే పోషకాలు కాపాడతాయి.
గమనిక ఇచ్చిన సమాచారం మీ అవగాహన కోసమే ఇది సోషల్ సమాచారం మాత్రమే కొన్ని అధ్యయనాలు సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు మీకు అందించాం వ్యక్తులు ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. వీటిని పాటించే ముందు సంబంధిత నిపుణుని సంప్రదించడం మంచిది. దీనిని మీరు గమనించగలరు.