benefits of turmeric face mask : ఫేస్ మాస్క్ గా పసుపును వాడటం వల్ల కలిగే లాభాలు పసుపు అనేది కేవలం సుగంధ ద్రవ్యము మాత్రమే కాదు. సహజ వైద్యంలో ఒక అద్భుతమైన నిధి. పసుపును వైద్య సౌందర్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారు ముఖానికి పసుపు రాయడం అనేది ఒక సాంప్రదాయ పద్ధతి దీనిలో ఉండే ఆరోగ్య రహస్యాలు తెలుసుకుందాం.
మొటిమలకు రాకుండా చేస్తుంది
పసుపులోని యాంటీబ్యాక్టీరియల్ లక్షణము కలిగి ఉంటుంది ఇది మొటిమలు దానికి సంబంధించిన మచ్చలు తగ్గించడంలో ఉపయోగపడుతుంది ఇది చర్మ రంద్రాలను శుభ్రం చేసి బ్యాక్టీరియా వృద్ధిని నిరోధిస్తుంది దీనివల్ల మొటిమలు రాకుండా ఆపవచ్చు. ఇప్పటికే ఉన్న మొటిమలను త్వరగా తగ్గించుటకు ఇది ఉపయోగపడుతుంది.
చర్మం యవ్వనంగా
పసుపు ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఇది ఫ్రీ రాడికల్స్ ను నివారిస్తుంది. ఫ్రీ రాడికల్స్ చర్మ కణాలను దెబ్బతీస్తుంది పసుపు ఈ ఫ్రీ రాడికల్స్ తో పోరాడి చర్మాని యవ్వనముగా ఉంచుతుంది. అంతేకాకుండా కాంతివంతంగా కూడా చేస్తుంది. చర్మంపై ముడతలు వయసు మచ్చలు వంటి వృద్ధాప్య లక్షణాలను తగ్గించడంలో పసుపు ముఖ్య పాత్ర పోషిస్తుంది.
చర్మవ్యాధులకు ఉపశమనం
పసుపు చర్మ సంబంధిత సమస్యలైనా సొరియాసిస్ వంటి లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది పసుపులోని ఆంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను ఈ వ్యాధుల వల్ల కలిగే దురద వాపు వంటి లక్షణాల నుండి ఉపశమనం కలిగిస్తాయి.
సూర్యరశ్మి నుంచి రక్షణ benefits of turmeric face mask
సూర్యరసంలోని UV కిరణాలు చర్మానికి నష్టం కలిగిస్తాయి పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఈ UV కిరణాల వల్ల కలిగే నష్టం నుండి చర్మాన్ని రక్షించడంలో సహాయపడతాయి ఇది రెండు నల్లబడటం మరియు చర్మ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
చర్మం తేమగా ఉండటం
చర్మం ఎప్పుడు తేమగా ఉండడంలో ఈ పసుపు సహాయపడుతుంది ఇది చర్మ కణాల మధ్య తేమను ఉంచుకోవడానికి సహయపడుతుంది. దీనివల్ల చర్మం పొడి బారకుండా మృదువుగా సాగే గుణంతో ఉంటుంది.
గమనిక ఇచ్చిన సమాచారం మీ అవగాహన కోసమే ఇది సోషల్ సమాచారం మాత్రమే కొన్ని అధ్యయనాలు సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు మీకు అందించాం వ్యక్తులు ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. వీటిని పాటించే ముందు సంబంధిత నిపుణుని సంప్రదించడం మంచిది. దీనిని మీరు గమనించగలరు.