Benefits of walking : వాకింగ్ బెనిఫిట్స్ నడిస్తే కలిగే 6 బెనిఫిట్స్ ఇవే నడక చాలా మంచిది. దీనివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి రోజుకు 30 నిమిషాలు అంతకంటే ఎక్కువ నడిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది వీటి ద్వారా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అవి ఏంటంటే
కీళ్ల నొప్పులు
కీళ్ల నొప్పులతో చాలామంది బాధపడుతున్నారు కాళ్లలోని జాయింట్ లో జిగురు లాంటి పదార్థం తగ్గడం వల్ల ఈ కీళ్ల నొప్పులు వస్తుంటాయి అయితే వాకింగ్ వల్ల లిక్విడ్ గమ్ పెరిగి కీళ్ల నొప్పులు దూరమవుతాయి. చాలామందిలో చిన్న వయసులోనే కీళ్లనొప్పులతో బాధపడుతున్న వారికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
క్రేవింగ్ ని కంట్రోల్
ఉభయకాయం ఉన్నవారికి సాధారణంగా స్వీట్స్ తినాలని కోరికలు ఎక్కువగా ఉంటాయి తినేటప్పుడు లేదా తిన్నాక అయినా కాస్త స్వీట్ పడితే వీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. దీనివల్లే వీరు బరువు తగ్గుతారు. అయితే రోజు 15 నిమిషాల పాటు నడవడం వల్ల కాస్త ఆ క్రేవింగ్ ని కంట్రోల్ అవుతాయని చెప్తున్నారు. ప్రతిరోజు నడవడం వల్ల మీరు క్రేవింగ్ ని కంట్రోల్ చేసుకోవచ్చు.
అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే
హార్వర్డ్ యూనివర్సిటీ నడకపై కొన్ని పరిశోధన చేసింది. ఇందులో అధిక బరువు ఉన్నవారు నడవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. అన్నట్లుగా తేలింది ముఖ్యంగా రోజు వాకింగ్ చేయడం వల్ల వంశపార్యపరంగా వచ్చిన ఉభయ కాయం దాదాపు 50% తగ్గినట్లుగా పరిశోధకులు గుర్తించినట్లు చెపుతున్నారు. కాబట్టి బరువు తగ్గాలనుకున్నవారు నడవడం వల్ల సమస్యని చాలా వరకు తగ్గించవచ్చని సూచిస్తున్నారు
ఇమ్యూనిటీ
అనుకోని ఆరోగ్య సమస్యలు వైరస్ల కారణంగా చాలామందికి ఇమ్యూనిటీ పై అవగాహన వచ్చింది. అందుకే దీన్ని పెంచుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు అందుకోసం రోజు 20 నిమిషాలు నడిస్తే ఇమ్యూనిటీ దాదాపు 40 శాతం పెరుగుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.
బ్రెస్ట్ క్యాన్సర్ దూరం
40 ఏళ్లు పైబడిన మహిళలందరినీ వేధించే సమస్యల్లో బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ఒకటి ఇది కొంతమంది వంశపారంపర్యంగా వస్తుంది అయితే నడక వల్ల ఆ సమస్య కూడా 15% వరకు తగ్గించవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.
Benefits of walking నడిస్తే లాభాలు
నడవడం వల్ల బరువు తగ్గుతారు
ఒత్తిడి దూరమవుతుంది
డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది
గుండె ఆరోగ్యానికి చాలా మంచిది
ఎముకలని బలంగా చేస్తుంది
శరీరంలోని అదనపుకొని తగ్గిస్తుంది
కండరాలకు చాలా మంచిది.
రోజుకి 30 నిమిషాల పాటు నడిస్తే
ఇన్ని లాభాలు ఉన్నాయని తెలిసాయి. రోజు 30 నిమిషాల పాటు నడవడం వల్ల మీ హెల్త్ ని మీరే కాపాడుకున్న వారు అవుతారు.
గమనిక : ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్న వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

