best foods thyroid health ఇప్పుడున్న కాలంలో చాలామంది థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారు థైరాయిడ్ గ్రంథిలో అసమతుల్యత కారణంగా హార్మోన్లు అవసరమైన దానికంటే ఎక్కువ లేదా తక్కువ ఉత్పత్తి చేస్తుంది. కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల థైరాయిడ్ గ్రంధి పనితీరును మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది అవి ఏంటో తెలుసుకోదాం. మన మెడ భాగంలో సీతాకోకచిలుక ఆకారాన్ని కలిగి ఉండే ఈ గ్రంధి శరీరం శక్తిని వినియోగించుకునేందుకు మెదడు గుండె కండరాలు సక్రమంగా పనిచేసేందుకు అవసరమైన హార్మోన్లను ఇది విడుదల చేస్తుంది. థైరాయిడ్ గ్రంథి అసమతుల్యత కారణంగా హార్మోన్ అవసరమైన దానికంటే ఎక్కువ లేదు తక్కువ ఉత్పత్తి చేస్తుంది.
హైపర్ థైరాయిడిజం
హైపర్ థైరాయిడిజంలో థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా విడుదల చేయడం వల్ల టీ-3 టీ 4 హార్మోన్ ఎక్కువగా విడుదల అవుతాయి. దీనివల్ల జీవక్రియ పనితీరు వేగం పెరుగుతుంది బరువు తగ్గిపోవడం అ కారణంగా చెమటలు పట్టడం. విరోచనాలు కావడం వంటి సమస్యలు ఎదురవుతాయి నిద్ర పట్టకపోవడం మానసిక ఒత్తిడి ఎక్కువసార్లు మలవిసర్జనకు వచ్చినట్టు అనిపించడం.
హైపోథైరాయిడ్
హైపో థైరాయిజం ఇది హార్మోన్ ను తక్కువ విడుదల చేస్తుంది. టీ 3 టీ 4 హార్మోన్లు తగ్గుతాయి. ఈ సమస్య వంశపార్యపరంగా రావచ్చు ఈ మార్పులతో జీవక్రియ పనితీరు మందగిస్తుంది. వీలు బలహీనంగా ఉంటారు. ఈ సమస్య ఉన్నవారికి విపరితమైన ఒళ్ళు నొప్పులు. డిప్రెషన్ రక్తహీనత సమస్యలు ఉంటాయి.ఇలాంటి థైరాయిడ్ సమస్యలను దూరం చేసుకోవడం కోసం కొన్ని రకాల ఆహారాలు వ్యాయామాలు చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది అందులో కొన్ని ఆహారాలు తెలుసుకుందాం.
ఉసిరి
ఉసిరికాయలో ఉండే విటమిన్ సి థైరాయిడ్ గ్రంధి అతిగా క్రియాశీలంగా పనిచేస్తుంటే ఈ ఉసిరి థైరాయిడ్ హార్మోన్లు ఉత్పత్తిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఉసిరిని నేరుగా తినలేము కాబట్టి ఉడికించి పచ్చడి చేసుకొని తినడం మంచిది.
గుమ్మడి గింజలు గుమ్మడి గింజలో ఉండే మెగ్నీషియం జింకు పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఇందులో ఉండే విటమిన్లు మినరలు గ్రహించడంలో సహాయపడుతుంది జింక్ శరీరంలో ఉండే థైరాయిడ్ హార్మోన్ ని నియంత్రించడానికి సహాయపడుతుంది.
కొబ్బరి
పచ్చి కొబ్బరి రోజు తీసుకోవడం వల్ల ఇది జీవ క్రియను మెరుగుపరుస్తుంది. కొబ్బరిలో ఉండే ఫ్యాట్ యాసిడ్స్ ఇందులో సమృద్ధిగా ఉంటాయి దీని వల్ల జీవ క్రియ మెరుగుపరచడంలో ముఖ్యపాత్రలో పోషిస్తున్నారు.
పెసరలు best foods thyroid health
ఇందులో ఉండే ప్రోటీన్లు యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు పుష్కలంగా ఉంటాయి ఇందులో ఉండే ఐయోడిన్ థైరాయిడ్ గ్రంథిని మెరుగుపరచడంలో దాని పనితీరును నియంత్రించడంలో అయోడిన్ ముఖ్యపాత్ర పోషిస్తుంది థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నవారు పెసరాలు తినడం ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
గమనిక ఇచ్చిన సమాచారం మీ అవగాహన కోసమే ఇది సోషల్ సమాచారం మాత్రమే కొన్ని అధ్యయనాలు సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు మీకు అందించాం వ్యక్తులు ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. వీటిని పాటించే ముందు సంబంధిత నిపుణుని సంప్రదించడం మంచిది. దీనిని మీరు గమనించగలరు.