Best fruits for heart health

Written by 24 News Way

Published on:

Best fruits for heart health : గుండె ఆరోగ్యానికి కాపాడే బెస్ట్ ఫ్రూట్స్  గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంచి ఆహారపు అలవాట్లు మనకు చాలా అవసరం ఇందులో పండ్లు కీలక పాత్ర పోషిస్తాయి అందులో ఉండే పోషకాలు యాంటీ ఆక్సిడెంట్లు ఇలా చాలా గుండెను పదిలంగా ఉంచుతాయి ఇప్పుడు గుండె ఆరోగ్యానికి సంబంధించి మెరుగుపరిచే ముఖ్యమైన పండ్లు గురించి తెలుసుకుందాం.
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం మనం ఆహారపు అలవాట్లు అత్యంత ముఖ్యమైనవి రోజు పండ్లను తినడం వల్ల గుండెపోటు రక్తపోటు కొలెస్ట్రాల్ సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. ముఖ్యంగా కొన్ని పండ్ల లో ఉండే విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు ఫైబర్ ఇవన్నీ కూడా గుండెను బలంగా ఉంచడంలో సహాయపడతాయి ఈ పండ్ల గురించి తెలుసుకుందాం.
బ్లూబెర్రీలు
బ్లూ బెర్రీలు చిన్న పరిణామం లో ఉంటాయి ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ముఖ్యంగా యాంటో సైనిన్స్ అధికంగా ఉంటాయి ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తీసేసి రక్తనాళాల్లో రక్త ప్రసరణ మంచిగా జరిగేలా సహాయపడుతుంది. దీంతో గుండెపోటు అధిక రక్తపోటు వంటి సమస్యలను దూరం చేస్తుంది.
ఆపిల్
మనం రోజు ఒక ఆపిల్ తింటే డాక్టర్ అవసరం లేదని మాటకు కారణం ఇందులో పోషకాల సమ్మేళనం ఆపిల్ లో ఉండే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి గుండె జబ్బును నివారిస్తుంది అలాగే ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందించే సహజ పండు.
దాన్నిమ్మ పండు
దానిమ్మ పండు లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఉన్న పోలీ ఫెనాల్స్ గుండె ధమనుల్లో కొవ్వు చేరకుండా నివారిస్తుంది అలాగే గుండెపై ఏర్పడే వర్తించిన తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో ఇది సహాయపడుతుంది.
అవకాడో
ఈ పండులో ఉండే మోనో సచ్యురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా ఉండటం వల్ల ఇవి చెడు కొలెస్ట్రాంగ్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది అలాగే ఇందులో ఉండే పొటాషియం బీపీని కంట్రోల్ చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది దీని వల్ల గుండె ఆరోగ్యానికి ఈ పండు పవర్ఫుల్గా పనిచేస్తుందని చెప్పవచ్చు.
నారింజ
నారింజ మనకు తినడానికి రుచి తో పాటు ఆరోగ్యానికి మంచిది ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది గుండెకు హానికరమైన ఫ్రీ రాడికల్స్ ను తొలగించి వాటి నుండి గుండెను రక్షించడంలో ఇది సహాయపడుతుంది నారింజలో ఉండే పీచు పదార్థం చెడు కొలెస్ట్రాలను దూరం చేస్తుంది.
పుచ్చకాయ
పుచ్చకాయ ఈ పండు ఎండాకాలంలో అధికంగా దొరుకుతుంది దీనిలో ఉండే లైకోపిన్ అనే శక్తివంతమైన ఉండడం వల్ల గుండెకు చాలా మేలు చేస్తుంది ఇది రక్తనాళాల్లో దృఢత్వాన్ని కలిగించడంలో బీపిని తగ్గించడంలో సహాయపడుతుంది అలాగే ఇది హైడ్రేషన్ గురుపరచడం వల్ల గుండె పనితీరును సమతుల్యం చేస్తుంది.
బొప్పాయి
బొప్పాయిలో విటమిన్ ఏ సి ఫైబర్ పొటాషియం పుష్కలంగా ఉంటాయి ఇవి గుండెపై ఒత్తిడిని తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడంతో జీర్ణ సమస్యలు దూరం అవుతాయి మెరుగైన జీర్ణక్రియ వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి గుండె ఆరోగ్యం పై కూడా అనుకూల ప్రభావం ఉంటుంది.
గమనిక. ఇందులోని అంశాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేశాము ఆరోగ్యం సంబంధించి ఎలాంటి సమస్యలున్నా వైద్యులను కలవడం ఉత్తమం.

గమనిక ఇచ్చిన సమాచారం మీ అవగాహన కోసమే ఇది సోషల్ సమాచారం మాత్రమే కొన్ని అధ్యయనాలు సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు మీకు అందించాం వ్యక్తులు ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. వీటిని పాటించే ముందు సంబంధిత నిపుణుని సంప్రదించడం మంచిది. దీనిని మీరు గమనించగలరు.

Read More>>

🔴Related Post