తక్కువ నిద్ర దుష్ప్రభావాలు ;
ఇప్పుడున్న కాలంలో రోజు మీరు ఎన్ని గంటలు నిద్రపోతున్నారు. కనీసం ప్రతిరోజు రాత్రి 6 గంటల లన్న నిద్ర పోతున్నారా లేదంటే ఒకవేళ మీరు 6 గంటలు నిద్ర పోకపోతే మీ హెల్త్ చాలా డేంజర్ లో ఉన్నట్టే అర్థం. అవును ఇది నిజమే నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఒక అధ్యాయం వెల్లడించింది ఈ విధంగా
తక్కువ నిద్ర దుష్ప్రభావాలు :
అలసట: నిద్ర తక్కువగా పోవడం వల్ల శరీరం చాలా అలసిపోయినట్లు ఉంటుంది శక్తి లేకపోవడం ఏకాగ్రత మందగించడం నిర్ణయాలు తీసుకోవడంలో చాలా ఇబ్బందులు పడడం వంటి సమస్యలు చాలా వస్తాయి.
బరువు పెరగడం: నిద్ర తక్కువగా పోవడం వలన శరీరంలోని హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది దీని వల్ల బరువు పెరగడం జీవట్రియ మందగించడం వంటి సమస్యలు పునరావృతం అవుతాయి.
రోదనిరోధక శక్తి తగ్గడం:
నిద్ర చాలా తక్కువగా పోవడం వలన శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా తగ్గడం స్టార్ట్ అవుతుంది దీనివలన జలుబు వంటి అంటువ్యాధులు సులభంగా మన శరీరానికి సోకుతాయి రోజనిర్వక శక్తి శరీరానికి ఉన్నంతకాలం ఏ రోగాలు మన దరి చేరవు రోగనిరోధక శక్తి ఎప్పుడైతే తగ్గడం ప్రారంభిస్తుందో చిన్న చిన్న జలుబు లాంటివి కూడా మన శరీరానికి తొందరగా అంటుకుంటాయి దానివల్ల చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. రోదనీరోధక శక్తి తగ్గడం వలన శరీరం చాలా సులభంగా రోగాల బారిన పడుతుంది. అందుకే మొన్న కరోనా టైం లో కూడా రోజనిరోధక శక్తిని పెంచుకోమని వైద్యులు కూడా సూచించడం జరిగింది.
గుండె జబ్బులు: నిద్ర తక్కువగా పోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది నిదుర సరిగా లేకపోవడం వల్ల గుండె ఆరోగ్యం కూడా క్రమంగా తగ్గుతుంది. దాని వలన మనం గుండె జబ్బు బారిన పడడం జరుగుతుంది. ఈమధ్య వయసుతో సంబంధం లేకుండా . హార్ట్ ఎటాక్ లు వస్తున్నాయి. ఇలా హార్ట్ ఎటాక్ వైస్ తో సంబంధం లేకుండా రావడంలో నిద్ర కూడా ముఖ్యపాత్ర వహిస్తుంది.
మధుమేహం: నిద్ర తక్కువగా పోవడం వలన మధుమేహం వచ్చే ప్రమాదం కూడా ఉన్నది.
అధిక రక్తపోటు: నిద్ర తక్కువగా పోవడం వలన అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.
పుట్టుకతో వచ్చే లోపాలు: గర్భిణి స్త్రీలు నిద్ర తక్కువగా పోతే పుట్టుకతో వచ్చే లోపాలు కలిగిన పిల్లలను కనడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుచేత గర్భిణీ స్త్రీలు ఎప్పుడు చాలా ప్రశాంతమైన నిద్ర నీ ఎక్కువగా పోతే మంచిది. పుట్టే పిల్లలు కూడా చాలా ఆరోగ్యవంతంగా పుడతారు.
మానసిక నష్టాలు:
ఆందోళన: నిద్ర తక్కువగా పోవడం వలన ఆందోళన ఒత్తిడి కూడా మనకు చాలా పెరగడం జరుగుతుంది. తగినంత నిద్ర మనకు ఉన్నట్లయితే శరీరంలో ఆందోళన ఒత్తిడి కూడా క్రమంగా తగ్గుతుంది ఆందోళన ఒత్తిడి శరీరంలో ఉన్నట్లయితే వాళ్లు తగినంత నిద్ర పోవాల్సి ఉంటుందని కొన్ని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి.
విచారం: విచారం నిరాశ వంటి మానసిక సమస్యలు కూడా చాలా వస్తాయి. దానివల్ల మనకు ఎప్పుడు ఏదో రకంగా నిరాశగా ఉన్నట్లు మనకు అనిపిస్తుంది.
జ్ఞాపకశక్తి లోపం: నిద్ర తక్కువగా పోవడం వల్ల రోజురోజుకీ జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతుంది. జ్ఞాపకాశక్తితో పాటు ఏకాగ్రత కూడా క్రమంగా తగ్గడం జరుగుతుంది. దానివలన జ్ఞాపకశక్తి తగడం వలన మనకి ఏది గుర్తుండడం జరగదు. అలాగే ఏకాగ్రత తగ్గడం వలన మనకు ఏ పని చేయాలని అనిపించదు మరియు మనం ఏ పనైనా మొదలుపెట్టిన అది పూర్తి కావడానికి చాలా టైం పట్టడం జరుగుతుంది. ఇవి రెండు మంచి చానా అవసరం. ఇలా మీకు ఒకదానిమీద ఏకాగ్రత లేకపోయినా మతిమరుపు వచ్చినా గాని మీరు తగినంత నిద్రలో లేరు అని మన శరీరం మనకు సూచిస్తుందని అర్థం. ఈ ప్రాబ్లం ఉన్నవాళ్లు కనీసం రోజుకి 8 గంటలు అన్న పండుకుంటే ఈ ప్రాబ్లం తొందరగా సెట్ అవుతుంది.
కోపం చిరాకు రావడం: నిద్ర సరిగా పోకపోవడం వల్ల మనకు శరీరంలో రకరకాల మార్పులు చోటు చేసుకుంటాయి అలాగే ఎప్పుడు ఏదో కిరాక్ గా అనిపించడం జరుగుతుంది.. దీనితో మనం పక్క వాళ్ళ మీద కోపం చిరాకు పడడం కూడా జరుగుతుంది దానివల్ల చాలా ప్రాబ్లంస్ రావడం కూడా జరుగుతుంది. మన సంబంధాలు కూడా దెబ్బతింటాయి .ఇలాంటి ప్రాబ్లంస్ ఉన్నవాళ్లు కూడా తగినంత నిద్ర తమ శరీరానికి అందట్లేదని శరీరం మనకు సూచిస్తుంది. వీలు కూడా కనీసం రోజుకి 8 గంటల ప్రశాంతమైన నిద్ర పోవడం వలన ఈ సమస్య తగ్గుముఖం పడుతుంది.
ప్రమాదాలు: తగినంత నిద్ర మనకు లేకపోయినట్లయితే ప్రమాదాలు కూడా అధికంగా జరుగుతాయి ఎందుకంటే నిదుర సరిగా లేకపోవడం వల్ల కళ్ళు మూతలు పడడం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కళ్ళు మూతలు పడటం వంటి జరిగినట్లయితే నిమిషంలోనే పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం కూడా జరుగుతుంది.