chhaava movie collection : చరిత్ర సృష్టించిన ఛావా..బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ నేషనల్ క్రష్ జంటగా నటించిన వార్ యాక్షన్ చిత్రం చావా బాలీవుడ్ లో బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డు క్రియేట్ చేస్తూ దూసుకెళ్తుంది. బాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత దినేష్ విజన్ నిర్మాణ సారధ్యంలో మాడోక్ ఫిలిం బ్యానర్ పై రూపొందిన. చావా చిత్రం భారీ వసూళ్లను రాబడుతుంది. ఈ చిత్రం రెండో వారంతారంలో అరుదైన రికార్డును సొంతం చేసుకుంటూ సంచలనం రేపుతున్న ఈ మూవీ బాలీవుడ్ లో అరుదైన చరిత్ర సృష్టించింది ఆ రికార్డు వివరాల్లోకి వెళ్తే.
ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలైన ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ నటుడు అక్షయ్ కన్నా దివ్య దత్త కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు దేశభక్తిని రగిలించే ఈ సినిమాల్లో సౌరబ్ గోస్వామి సినిమాటోగ్రఫీ మనీ ష్ ఎడిటింగ్ బాధ్యతలు. నిర్వహించారు 125 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించినట్టు తెలుస్తుంది.
ఛావా సినిమా రిలీజ్ తర్వాత తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ తో బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్లను మొదలు పెట్టింది. తొలి వారాంతరంలోని ఇండియాలో 116 కోట్లు వసూలు చేసింది ఆ తర్వాత అదే జోరుతో దూసుకుపోయింది తొలి వారం ముగిసేసరికి 220 కోట్లు వసూలు చేసింది. అలాగే రెండో వారంలో కూడా వసూలు రాబట్టింది. ఈ రెండు వారంలో కలెక్షన్ 170 కోట్లు మొత్తంగా ఈ సినిమా 390 కోట్లు వసూలు రాబట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
chhaava movie collection : అయితే ఇప్పటి వరకు నమోదు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే ఈ సినిమా హిందీ సినీ రంగంలో అత్యధిక వసూలు సాధించిన తొమ్మిదవ సినిమాగా రికార్డ్ సాధించింది. దీనిని ట్రేడ్ వర్గాలు ధ్రువీకరించాయి. గతంలో అమీర్ ఖాన్ నటించిన దంగల్ మూవీ ని రణవీర్ నటించిన సంజు మూవీ ని వీటి రికార్డులను అధిగమించింది.
తాజాగా కేజిఎఫ్ 2 యానిమల్ సినిమా కలెక్షన్ల రికార్డులపై చావా గురి పెట్టింది. కే జి ఎఫ్ 2 సినిమా సాధించిన 435 కోట్లు రణబీర్ కపూర్ నటించిన యానిమల్ చిత్రం సాధించిన 503 కోట్లు. వీటిని క్రాస్ చేయాలని చూస్తున్నది. ఈ రికార్డులను చావా మూవీ అధికమి స్తుందా లేదా అని వేచి చూడాలి.
ఇదిలా ఉండగా చావా చిత్రం 14వ రోజున కూడా బాక్సాఫీస్ వద్ద బలంగా కనిపిస్తున్నది. ఈ సినిమా సుమారుగా 10 కోట్ల రూపాయలు వసూళ్లు చేయవచ్చని ట్రేడ్ వర్గాల అంచనా వేస్తున్నాయి. ఇప్పటివరకు సినిమా ఓవర్సీస్ లో 78 కోట్ల రూపాయలు ఇండియాలో 432 కోట్ల రూపాయలు గ్రాస్ 390 కోట్ల నెట్ వసూళ్లను నమో చేసింది దీంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 540 కోట్లకు పైగానే కలెక్ట్ చేసింది