chhaava movie telugu version : మరాఠా యోధుడు చత్రపతి శివాజీ తనయుడు శంభాజి మహారాజ్ బయోపిక్ గా రూపొందిన చిత్రం ఛావా విక్కీ కౌశల్ రష్మిక మందన ప్రధాన పాత్రలో నటించారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. దినేష్ విజన్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న హిందీలో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంది. ఈ సినిమాను తెలుగులో గీత ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ నేడు విడుదల చేస్తోంది.
ఛావా తెలుగు ట్రైలర్ దాదాపు 5 మిలియన్స్ వ్యూస్ సాధించింది. తెలుగులో 550 కి పైగా స్క్రీన్ లలో రిలీజ్ చేస్తున్నాం అని మేకర్స్ తెలియజేశారు ఛావా పట్ల తెలుగువారి అద్భుతమైన సపోర్ట్ ప్రేమకు కృతజ్ఞతలు ఈ చిత్రాన్ని తెలుగులో తీసుకు వస్తున్నందుకు మేము గర్విస్తున్నాం. శంభాజి మహారాజ్ కీర్తి ఆయన త్యాగాన్ని చూసే అవకాశం మీకు లభిస్తుంది అలాగే మీ హృదయాలను తాకుతుంది. ఈ చిత్రాన్ని మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను అంటూ విక్కీ కౌశల్ వీడియో విడుదల చేశారు.
chhaava movie telugu version తెలుగు ట్రైలర్ చూస్తే సినిమా పై మరింత పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా చత్రపతి శంభాజి మహారాజ్ జీవిత కథ ఆయన చేసిన వీరోచిత పోరాటాలు తెలుగు ప్రేక్షకులను సైతం ఎంతగానో ఆకట్టుకునేలా ఉన్నాయి. విక్కీ కౌశల్ శంభాజి మహారాజుగా నటించిన తీరును చూస్తుంటే అప్పటి శంభాజి మహారాజు చూసినట్టు అనిపిస్తుంది.
రష్మిక మందన శంభాజి సతీమణిగా నటించారు. దీనిలో ఆమె ఎంతో అద్భుతంగా నటించారు. ప్రేక్షకుల నుంచి మంచి పేరు తెచ్చుకుంది. ఇక ఔరంగాజేబ్ పాత్రలో అక్షయ్ ఖన్నా చాలా అద్భుతంగా నటించారు. ఇది సినిమాకి ఎంతో హైలైట్ గా నిలిచింది. ఈ ట్రైలర్లో చూపించిన ఇద్దరు దృశ్యాలు కుటుంబ బంధాలు వీరత్వం వంటి అంశాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఛావా తెలుగులో చూడాలని ఎంతో మంది ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఈ ట్రైలర్ మరింత హైప్ క్రియేట్ చేసింది.
ఒక సినిమాకు మ్యూజిక్ అందించిన వారు ఏ ఆర్ రెహమాన్. ఈ మూవీ లో ఉండే సాంగ్స్ ని తెలుగులో అద్భుతంగా ప్రజెంట్ చేసినట్లు అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఆ విజువల్స్ ఇంకా ఎలివేట్ చేసింది. ముఖ్యంగా కొన్ని డైలాగులు అద్భుతంగా ఉన్నాయి. తెలుగు డబ్బింగ్ లో కూడా అద్భుతంగా చేశారు. సాధారణంగా ఇలాంటి పిరియాడిక్ సినిమాలకి డబ్బింగ్ సహజంగా ఉండకపోతే ప్రేక్షకులకు అంత కనెక్ట్ కాకపోవచ్చు. కానీ ఛావా కి మాత్రం అద్భుతంగా డబ్బింగ్ చెప్పారు. ఈ డబ్బింగ్ లో సహజత్వాన్ని నింపింది.
తెలుగు ప్రేక్షకులు ఇలాంటి చరిత్ర ఆత్మకథలు ఎంతో ఇష్టపడతారు ఈ మూవీ తెలుగులో అద్భుతమైన విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. చత్రపతి శంభాజి మహారాజ్ గురించి తెలియని వారికి ఈ మూవీలో ఆయన చేసిన పోరాట వైభవాన్ని ఎంతో అద్భుతంగా చూపించారు.