Chiranjeevi : బ్రహ్మానందం సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ. నేను సినిమా బాగుందని చెప్తే కొంతమంది ప్రేక్షకులు నమ్ముతారు ఈ ఇమేజ్ గుడ్ విల్ ని నేను సంపాదించా.అది ఒకరు భవిష్యత్ కు ఒక సినిమాకు ఉపయోగపడుతుందంటే కచ్చితంగా ఖర్చు పెడతాను ఈ మధ్య ఏ వేడుకలో చూసిన చిరంజీవి కనిపిస్తున్నారని అలా తరుచు కనిపిస్తే గ్లామర్ తగ్గించేస్తుంది. అని చెప్తుంటారు నా పైన ఉండే అభిమానం గుప్పెట్లో ఉండేది కాదు గుండెల్లో ఉంటుంది.అది అంత తేలిగ్గా తగ్గదు అన్నారు ప్రముఖ కథానాయకుడు చిరంజీవి.
ఆయన మంగళవారం రాత్రి హైదరాబాదులో జరిగిన బ్రహ్మానందం సినిమా ముందస్తు విడుదల వేడుకకి ముఖ్య అతిథిగా Chiranjeevi హాజరయ్యారు. తండ్రి తనయులు బ్రహ్మానందం రాజా గౌతమ్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం దర్శకుడు రాహుల్ యాదవ్ నక్కా నిర్మాత. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
ఈ సందర్భంగా జరిగిన వేడుకకు Chiranjeevi తోపాటు నాగ్ అస్విన్ అనిల్ రావిపూడి హాజరయ్యారు చిరంజీవి మాట్లాడుతూ కన్నా బిడ్డల అభివృద్ధిలోకి వస్తే అది ఆనందం అంత ఇంత కాదు నేను ఎంతగా పుత్రోత్సాహం అనుభవిస్తున్నాను.బ్రహ్మానందం కూడా అదే ఆనందాన్ని తృప్తిని పొందుతాడు. తన బిడ్డల బుద్ధులు బంగారం వాళ్ళ భవిష్యత్ కూడా అలాగే ఉండాలని. కోరుకుంటున్న కథ ఇప్పుడు సినిమాలకి కథ ఎంత ముఖ్యమో వాటి విడుదల సమయం కూడా అంతే ముఖ్యం.
బ్రహ్మానందం వేడుక కోసం ఇద్దరు హీరోల కోసం ప్రయత్నించారని వాళ్లు రాలేని పరిస్థితి ఉందని తెలిసినప్పుడు నేనే బ్రహ్మానందంకి ఫోన్ చేసి ఒక బిడ్డకు భుజం కాయడం కోసం వస్తానని చెప్పాను.
బ్రహ్మానందం సెట్లో చూసా తన ప్రతిభను చూసి తనకి ఏజెంట్ లాగా మారి చిత్ర పరిశ్రమలో అందరికీ తెలిసేలా చేశా అంత ప్రతిభ ఉన్న వ్యక్తి పరిశ్రమ నుంచి వెళ్ళిపోకూడదన్న ఆ ప్రోత్సాహంతో ఇంత గొప్ప రంగంలో తన తను ఇంతగా రాణించాడు.
తను తన బిడ్డ నటించిన సినిమా గురించి పదిమందికి తేలేసాల చేస్తే చాలు అని ఈ వేడుకకువచ్చా. కొత్త తరం దర్శకుడు నిఖిల్ వాళ్ళ ఆలోచనలు కూడా కొత్తగా ఉంటాయి కాబట్టి చిత్రం తప్పకుండ అలరిస్తుందని నమ్ముతున్న. అనిల్ రావిపూడి నా కథ చెప్పినప్పటి నుంచి ఎపుడెపుడు సెట్ కి వెళ్దామా కామిడి చేద్దామా అని ఉత్సాహంగా ఉంది.
ఈ మధ్య రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు రోజు ఒత్తిడిగా ఉండేది నన్ను అన్నన్నివాలను కూడా తిట్టాల్సి వచ్చేది మీరు దేనికి నవ్వడం లేదు అనేది మా ఆవిడ. హాస్య గ్రంధులు పనిచేయడం మానేశావేమో అనిపించింది 150వ సినిమా తర్వాత నేను మళ్ళీ నవ్వడం మొదలైంది అనిల్ రావు సినిమాతో నాలో హాస్య గ్రంధులు తారాస్థాయికి వెళ్తాయని ఆశిస్తున్నా మా కలయికల్లో మళ్ళి హిట్ కొడతాం. నాగ్ అశ్విన్ ని కూడా తొందరగా సినిమాలు చేయమని చెప్పా తర్వాత అవకాశం నాకు వస్తుంది కదా అని యువతరంతో కలిసి పనిచేస్తే ఆ ఉత్సహము వేరే ఉంటుందన్నారు