Chiranjeevi : చిత్ర పరిశ్రమ అందరికీ ఒక్కటే కాంపౌండ్

Written by 24 News Way

Updated on:

Chiranjeevi  చిత్ర పరిశ్రమ అందరికీ ఒక్కటే కాంపౌండ్ మనం ప్రత్యేకంగా విడిగా ఉండటం వల్ల ఇమేజ్ వస్తుంది అనుకోవడం మంచిది కాదు.ఫాన్స్ పెరగాలంటే అది మనం చేసే కంటెంట్ ఉన్న సినిమా ఇస్తుందని తప్ప మనల్ని మనం మరొకరికి దూరం చేసుకుంటే రాదు. మనం ప్రత్యేకంగా విడిగా ఉండటం వల్ల ఇమేజ్ వస్తుంది అనుకోవడం మంచిది కాదు. మనఫాన్స్ పెరగాలంటే అది మనం చేసే కంటెంట్ సినిమా ఇస్తుంది. అందరూ కలివిడిగా ఉండాలి. ఇలా చెప్పుకొచ్చారు కథానాయకుడు చిరంజీవి.

ఇకనుంచైనా ఆ కాంపౌండ్ ఈ కాంపౌండ్ అంటూ హద్దులు తీసుకోకుండా వాటిని మానేయడం మంచిది అని కోరారు ఆయన. ఆదివారం రాత్రి హైదరాబాదులో జరిగిన లైలా చిత్రం ఫ్రీ రిలీజ్ వేడుకకు ముఖ్యఅతిథిగా Chiranjeevi గారు వచ్చారు. విశ్వక్ సేన్ టైటిల్ పాత్రలో రామ్ నారాయణ తెరకెక్కించిన చిత్రం ఇది సాహు గారు నిర్మించారు. ఆకాంక్ష శర్మ కథానాయక ఈ మూవీ నెల 14న థియేటర్లోకి రావడం జరుగుతుంది.

ఈ నేపథంలో హైదరాబాదులో ప్రచార వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా కథానాయకుడు Chiranjeevi మాట్లాడుతూ ఈ మధ్య విశ్వక్ సేన్ మీరు బాలకృష్ణ కాంపౌండ్ కదా మెగా కాంపౌండ్ కు ఎలా వచ్చారని ఓ విలేకరు ప్రశ్నించారు. దానికి విశ్వక్ మా ఇంటికి కాంపౌండ్ ఉంది. గాని సినిమా పరిశ్రమకు లేదని చక్కగా బదులిచ్చారు.దీనికి చిరంజీవి నిజమే అలా ఎవరికి వాళ్లు గీతాలు గీసుకొని ఉన్న రోజులు ఒకప్పుడు లేకపోలేదు. దానివల్ల ఆయా హీరోల మధ్య విభేదాలు ఉంటాయని ఒక రకమైన భ్రమ. అభిమానులు కొట్టుకునేవారు పోస్టర్లు చిప్పుకునే వాళ్ళు నెల్లూరులో ఉండే మా ఇద్దరి కజిన్స్ ఒకరు రామారావును మరొకరు ఏఎన్ఆర్ ను అభిమానించే వాళ్ళు వాళ్ళిద్దరు ఒకసారి రక్తాలు వచ్చేలా కొట్టుకుంటే నాకు కంగారు వచ్చేసింది.అప్పటినుంచి నేను అనుకునేవాన్ని హీరోలు బాగానే ఉంటారు. కానీ అభిమానులు కొట్టుకుంటారు అందుకే నేను నటుడిని అయ్యాక తోటి హీరోల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండాలని నమ్మేవాన్ని.

దీనికోసం మద్రాస్ లో ఉన్నప్పుడు. చిత్ర సీమకు సంబంధించిన ఎన్నో వేడుకలు నిర్వహించుకునే వాళ్లము. దానివల్ల మనసుల మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలు తొలగిపోయి ఎంతో సంతోషంగా గడిపే వాళ్ళం. ఈరోజుకు నేను నాగార్జున వెంకటేష్ బాలకృష్ణ కలిసే ఉండాలి అనుకుంటాం. ఒకరు వేడుకకు మరొకరు వెళ్లడానికి కారణమదే.

ఓ హీరో మరో హీరోను అభిమానించడానికి తప్పుగా చూడకూడదు విశ్వక్ ఫలానా హీరోయిన్ అభిమానిస్తున్నారు. కాబట్టి తన వేడుకలకు మనం వెళ్లాలా అనే ధోరణి ఉండకూడదు. కచ్చితంగా వెళ్లి తీరాలి తను మన చిత్ర పరిశ్రమ లో మనసే మన కుటుంబంలో ఒకడు అంతా ఒకటే అని చిరంజీవి గారు బదులిచ్చారు. దానివల్ల మన ఇమేజ్ ఏం తగ్గదు ఈరోజు ఏపీలో పవన్ కళ్యాణ్ చూస్తే అందరు సంతోషిస్తున్నారు దానికి నేను ఎంతో గర్వపడాలి. పుష్ప-2 పెద్ద బ్లాక్ బస్టర్ అయింది ఇప్పుడు నేను ఎంతో గర్విస్తున్నాను.

Read More>>

🔴Related Post