chiranjeevi latest news : మెగాస్టార్ చిరంజీవి తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా ఎదిగారు ఎదుగుతున్నారు. కూడా ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి నెంబర్ వన్ హీరోగా చిరంజీవి నిలిచా రు. ఇండస్ట్రీకి చెందిన హీరోల కొడుకులు వారసులుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ వారిని దాటుకొని ఆయన నెంబర్ వన్ స్థానానికి వచ్చి ఉన్నారు. దాదాపు 30 ఏళ్లు పాటు తెలుగులో టాప్ హీరోగా చిరంజీవి నిలిచారు. దీని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆయన స్టామినా ఎంత ఉంది అన్నది. ఒకానొక సమయంలో దేశంలోని అత్యధిక రెమినేషన్ తీసుకున్న హీరోగా చిరంజీవి నిలిచారు.
సినిమాల్లో వచ్చిన క్రేజ్ తో చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఆప్పటికే చాలామంది హీరోలు రాజకీయాల్లోకి వచ్చి ఫెయిల్ అయ్యారు వాటన్నిటిని కళ్లారా చూసి కూడా చిరంజీవి గారు ఎంట్రీ ఇచ్చారు 2009 సంవత్సరంలో ఎన్నికలకు ముందు ఆయన ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. ఎన్నో అంచనాల మధ్య పోటీ చేసిన ప్రజారాజ్యం కేవలం 18 సీట్లు మాత్రమే విజయం సాధించి.
ఆ ఎన్నికలలో రెండు చోట్ల పోటీ చేసిన చిరంజీవి ఒకచోట ఓడిపోయి మరో స్థానంలో ఎమ్మెల్యేగా విజయం సాధించాడు చిరంజీవి తన సొంత నియోజకవర్గం పాలకొల్లు చిరంజీవి ఓడిపోవడం ఆయనకు బాధ అనిపించింది. ఇదంతా ఇప్పుడు ఎందుకని అనుకుంటున్నారా..? ఏం లేదండి తాజాగా దుబాయ్ వేదిక జరిగిన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కు చిరంజీవి సైతం హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
chiranjeevi latest news చిరంజీవి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కు వచ్చారని ఒక స్పోర్ట్స్ అనలిస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే దీనిపై ఓ నెటిజన్ ఎవరతను అని అడిగారు. దీనికి మరో నెటిజన్ రామ్ చరణ్ తండ్రి అంటూ రిప్లై ఇచ్చారు. అసలు రామ్ చరణ్ ఎవరూ అంటూ మరో నెటిజన్ ప్రశ్నించారు. అయితే దీనిపై మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చిరంజీవి తెలియకపోవడమేంటని మెగా అభిమానులు ప్రశ్నిస్తున్నారు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నేటింట వైరల్ గా మారింది.