రైతులకు శుభవార్త చెప్పిన సీఎం రేవంత్

Written by 24newsway.com

Published on:

CM Revanth gave good news to farmers : తెలంగాణ రైతులకు శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రైతులకు ఒక శుభవార్త చెప్పడానికి సిద్ధమవుతుంది. అదేమిటంటే తెలంగాణ రైతులకు రైతు భరోసా సాయం అందించబోతుందని రేవంత్ సర్కార్ తెలియజేయడం జరిగింది. తెలంగాణ సర్కార్ రైతులకు పెట్టుబడి సహాయంగా రైతు భరోసా నిధులు 10 నుండి 15 రోజులలో రైతుల ఖాతాలోకి డబ్బును పంపిస్తుందని తెలంగాణ సర్కార్ తెలియజేయడం జరిగింది.

కొందరు మాత్రం రైతు భరోసా సహాయం ఇప్పుడు ఇవ్వడం వల్ల రెండు రెండు రకాలుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేలు జరుగుతుందని చెప్పుకోవడం గమనార్ధం.

రేవంత్ రెడ్డి సర్కార్ రైతు భరోసా నిధుల కోసం వేట ముమ్మరం చేసింది.

అందుతున్న సమాచారం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి సర్కార్ త్వరగా తెలంగాణ రైతు లకు రైతు భరోసా అందించాలని ముంబరంగా పనులు ప్రారంభించడం జరిగింది. వానాకాలం అయిపోయియే లోపు రైతులకు పెట్టుబడి సహాయాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకొని పని చేయడం జరుగుతుంది. వీటితోపాటు నిధుల సమీకరణను కూడా ముమ్మరం చేసింది.

రీసెంట్ గా రిజర్వు బ్యాంకు నుంచి 3000 కోట్ల అప్పు తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఇంకా 4000 కోట్లు అప్పు తీసుకోవాలని చూస్తుంది. ఈ నిధులను తొందరగా సమీకరించుకుని రైతులకు వాన కాలమైపోయే లోపు పెట్టుబడి సహాయాన్ని అందించి తర్వాత ఎన్నికలకు వెళదామని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తుంది.

కేసీఆర్ ప్రభుత్వం రైతు బందు పేరిట తెలంగాణ రైతులకు ఎకరానికి 5000 చొప్పున పెట్టుబడి సహాయాన్ని ఇచ్చేది. ఇలా ఇవ్వడం వల్ల కేసీఆర్ ప్రభుత్వం సంవత్సరానికి 7500 కోట్ల రూపాయలు అవసరమయ్యేవి. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుబంధు పదహానికి రైతు భరోసా అని పేరు మార్చడం జరిగింది. అలాగే అప్పటి కేసీఆర్ ప్రభుత్వం రైతుకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల వారికి రైతుబంధు సహాయాన్ని అందించేది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 5 ఎకరాలు లోపున ఉన్న రైతుకు మాత్రమే పెట్టుబడి సహాయాన్ని అందిస్తుంది. పోయినసారి ఇలాగే అందించడం జరిగింది.

ఇప్పుడు రైతు భరోసా సహాయం ఎవరికి అందుతుంది:

రైతు భరోసా పైసలు గవర్నమెంట్ ఇస్తుంది అనే విషయం రైతులకు తెలిసిన కానుంచి ఈసారి ప్రభుత్వం 5 ఎకరాల లోపల ఉన్న చిన్న రైతులకు ఇస్తుందా లేకపోతే పెద్ద రైతులకు కూడా రైతు భరోసా ఇస్తుందా అని తీవ్రమైన చర్చ ఇప్పుడు రైతులలో నడుస్తుంది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం నిదుర సమీకరణ అంతా పూర్తి అయిన తర్వాతనే రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. బాణాకాలం పూర్తి అయిన తర్వాత ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాబట్టి రైతులకు ఎంతో ఉపయోగపడే రైతు భరోసా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసి ఎన్నికలకు వెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. తొందరలోనే నిధులు సమకూరిన తర్వాత రైతు భరోసా చిన్న కారు రైతులకు తెలంగాణ ప్రభుత్వం లేక అందరి రైతులకి రైతు భరోసా సహాయం అందుతుందో చూడాలి

Read More

🔴Related Post