ration card update:
తెలంగాణ Cm Revanth ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను జారీ చేసే దిశగా అడుగులు వేస్తుంది. సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన రాష్ట్ర ప్రజలందరికీ ఒక శుభవార్తను తెలియజేయడం జరిగింది.
తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులను జారీ చేయడానికి సూచించబడిన విధి విధానాలు మరియు మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. రేవంత్ రెడ్డి సర్కార్ దీనికి సంబంధించిన అన్ని ఉత్తర్వులు తెలుగులో విడుదల చేయడం చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది .వీటిని పౌర సరఫరాల శాఖ కమిషనర్ విడుదల చేయడం జరిగింది.
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారిపై చాలా కాలంగా చర్చ జరుగుతుంది. అలాగే ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులను పరిష్కరించే దిశగా తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసింది. అలాగే అర్హత ప్రమాణాలు మరియు వీటికి సంబంధించిన విధి విధానాలు పరిశీలించడానికి అలాగే దీనికి సంబంధించిన సిఫార్సులను అందజేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మంత్రి వర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసిన విషయం మన అందరికీ తెలిసిందే.
ఈ ఉప సంఘం ఇచ్చిన సిఫార్సులను ఈ నెల 4 వ తేదీన ఏర్పాటైన మంత్రి వర్గ సమావేశం లో ఆమోదించబడింది . సంక్రాంతి పండుగ ను పురస్కరించుకొని తాజాగా దీన్నీ తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది.
telangana new ration card details:
1. కుల గణన సర్వే ఆధారంగా తయారు చేసిన రేషన్ కార్డులు లేని కుటుంబాల యొక్క జాబితాను క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి జిల్లా కలెక్టర్లు మరియు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కు పంపించడం జరుగుతుంది.
2. మండల స్థాయిలో ఎంపీడీవో మరియు పట్టణ స్థాయిలో మున్సిపల్ కమిషనర్ కు ఈ జాబితాను క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సి ఉంటుంది.
3. జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్ మరియు జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి పర్యవేక్షించడం జరుగుతుంది.
4. ముసాయిదా జాబితాను గ్రామ సభ వార్డు సభల్లో ప్రదర్శించడం జరుగుతుంది/ మరియు అందులో పొందుపరిచిన వివరాలను చదివి వినిపించడం జరుగుతుంది .దీనిపై చర్చించిన తర్వాత ఆమోదించడం జరుగుతుంది.
5. గ్రామ లేదా వార్డు సభల్లో ఆమోదం పొందిన లబ్ధిదారుల అరకత జాబితాను మండలం మరియు మునిసిపల్ స్థాయిలో ఇచ్చిన లాగిన్ లో నమోదు చేయాల్సి ఉంటుంది. అలాగే జిల్లా కలెక్టర్ మరియు ఎం సి కమిషనర్ లాగిన్ కు పంపించాల్సి ఉంటుంది.
6. ఈ మొత్తం జాబితా పట్ల జిల్లా కలెక్టర్ మరియు జిహెచ్ఎంసి కమిషనర్ సంతృప్తి వ్యక్తం చేస్తే పౌర సరపరార శాఖ కమిషనర్ లాగిన్ కు పంపించడం జరుగుతుంది.
7. ఇది తుది జాబితా అవుతుంది దీని ఆధారంగా నే పౌర సరపరాల శాఖ కమిషనర్ కొత్త రేషన్ కార్డులను జారీ చేయడం జరుగుతుంది .అలాగే అర్హత కలిగిన వ్యక్తికి ఒకే ఒక్క రేషన్ కార్డు ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
telangana new ration card release date:
అర్హత ఉన్నవారికి ఈనెల 26 వ తేదీ నుండి కొత్త రేషన్ కార్డులు అందించడం జరుగుతుంది.