court movie collection : కంటెంట్ ఉన్న సినిమాలలో ఏరుకోరి నటించి భారీ హిట్లను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. నటుడు ప్రియదర్శి బలగం మల్లేశం జాతిరత్నం లాంటి సినిమాల్లో నటించి హిట్టు కొడుతున్నాడు. దీంతో చిన్న నిర్మాతలకు ఆయన కల్పవృక్షంలా మారారు. ప్రియదర్శి నటించిన మూవీ కోర్ట్ సామాజిక కథాంశంతో తెరకెక్కిన మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన రెండు రోజుల్లోనే 15 కోట్ల పైగా వసూలు రాబట్టింది.
రామ్ జగదీష్ దర్శకత్వంలో వచ్చిన కోర్ట్ మూవీ హర్స్ రోషన్ సాయికుమార్ శివాజీ హర్షవర్ధన్ రోహిణి రాజశేఖర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. విజయ్ బుల్గానియన్ సంగీత దర్శకత్వం వహించారు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ప్రశాంతి సినిమాను దాదాపు 10 కోట్లతో ఈ మూవీని నిర్మించారు. నేచురల్ స్టార్ నాని సమర్పకుడిగా వ్యవహరించారు.వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ నుంచి వస్తున్న బొమ్మ కావడంతో పాటు ప్రియదర్శి ఈ మూవీలో నటించారు కాబట్టి రిలీజ్ బిజినెస్ బాగానే జరిగింది.
court movie collection ప్రపంచవ్యాప్తంగా దాదాపు 650 థియేటర్లో విడుదలైన కోర్ట్ మూవీ మార్నింగ్ సో నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. మొదటి రెండు రోజుల్లో 10 కోట్లు టార్గెట్ చేసింది మూడో రోజు 6 కోట్లు గ్రాస్ వాసులతో దూసుకెళుతోంది. మొత్తంగా మూడో రోజులోని 24 కోట్లు కలెక్ట్ చేసింది. మూవీ తెలుగు రాష్ట్రాల్లో 14 కోట్లు కర్ణాటకలో రెండు కోట్లు తమిళంలో 37 లక్షలు ఇలా ఈ మూవీ మంచి వసూలను రాబడుతుంది.
ఇక కథ విషయానికొస్తే ఈ కథ విశాఖపట్నంలో నేపథ్యంగా కొనసాగుతుంది. కథ నాయకుడు మట్టు చంద్రశేఖర్ అలియాస్ చందు రోజువారి జీవితంలో అనేక ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగిస్తాడు. చందు ప్రభావశీల కుటుంబానికి చెందిన జాబిల్లి అనే అమ్మాయిని స్నేహంగా కలుపుకుంటాడు. వారి మిత్రత్వాన్ని అర్థం చేసుకోలేకపోయినా జాబిల్లి మామ మంగపతి తన కుటుంబ గౌరవం కాపాడుకోవడానికి చందు తప్పుడు కేసు పెట్టిస్తాడు. ఇలా పెట్టిన కేసు నుండి చందు ఎలా బయటపడతాడు న్యాయవ్యవస్థలో ఎలాంటి సమస్యలు వస్తాయి అనేది ఈ సినిమా సారాంశం.