daily eating curd benefits : పెరుగు మన ఆరోగ్యానికి చాలా మంచిది. దీని రోజు తినడం వల్ల మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకుందాం.చాలామందికి పెరుగుతో అన్నం తినడం ఇష్టం ఉంటుంది. కొందరికి పెరుగు అనేది ఇష్టం ఉండదు. మరి కొందరికి మొత్తం అన్నం తిన్నాక ఒక ముద్ద పెరుగన్నం తింటేనే తృప్తి అనిపిస్తుంది. నిజానికి పెరుగు తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అవి ఏంటో తెలుసుకుందాం.
పెరుగులోని పోషకాలు
రోజు పెరుగు తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పెరుగులో ప్రోటీన్స్ కాల్షియం విటమిన్లు మినరల్స్ ఇలా శరీరానికి అవసరమైన పోషకాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా మన మన శరీరంలో ఉండే ఎముకలకు చాలా మంచిది.
గుండె ఆరోగ్యం
పెరుగు లో కొవ్వు తక్కువగా ఉంటుంది. గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. పెరుగులో ఉండే కొవ్వు మన గుండెకు చాలా మంచిది. పెరుగులో ప్రోటీన్స్ అతిగా తినడం తగ్గిస్తుంది. దీని ద్వారా కూడా బరువు తగ్గవచ్చు. ఇందులో ఉండే కాల్షియం తలనొప్పిని తగ్గిస్తుంది.
ఎముకలకు బలాన్ని ఇస్తుంది.
పెరుగులో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఈ పెరుగు తిన్నప్పుడు ఈ కాల్షియం మనలో ఉండే ఎముకలకు దంతాలకు చాలా మంచిది. అదేవిధంగా ఈ పెరుగు మనలో ఇమ్యూనిటీ పెంచడంలో సహాయపడుతుంది. పెరుగులోని ప్రోటీన్లు విటమిన్స్ మినరల్స్ మనలో ఇమ్యూనిటీని బలంగా ఉండడానికి సహకరిస్తాయి.
జీర్ణ సమస్యలు
మనలో చాలామందికి అసిడిటీ కడుపు ఉబ్బరం వంట సమస్యలు ఉంటాయి. వీటి కారణంగా చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటివారు రోజు పెరుగు తినడం వల్ల ఈ సమస్యను తగ్గించుకోవచ్చు .పెరుగులో ఉండే ప్రోబయేటిక్స్ జీర్ణక్రియను మెరూపరచడానికి సహకరిస్తుంది ఇది అసిడిటీ గ్యాస్ మల్లబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది.
చర్మ ఆరోగ్యం (daily eating curd benefits)
మనం పెరుగు తినడం వల్ల శరీర ఆరోగ్యమే కాదు గాని చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఈ పెరుగులో ఉండే ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ మన చర్మ ఆరోగ్యానికి సహకరిస్తాయి. చర్మం మెరిసేలా చేస్తుంది. కాబట్టి రోజు పెరుగు తినడం మంచిది.
గమనిక : ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్న వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.