దర్శన్ అరెస్ట్ : హత్య కేసు లో కన్నడ మాస్ హీరో

Written by 24newsway.com

Published on:

దర్శన్ అరెస్ట్: దర్శన్ హత్య కేసు అరెస్ట్ లో కన్నడ మాస్ హీరో దర్శన్ అరెస్ట్ ఇప్పుడు చాలా సంచలనగా మారింది. హీరో దర్శన్ ని ఇవాళ మార్నింగ్ మైసూర్ లో అరెస్టు చేయడం జరిగింది. కన్నడ సూపర్ స్టార్ దర్శన్ అరెస్టు తో కన్నడ సినిమా పరిశ్రమ ఒక్కసారిగా షాక్ గురించి కావడం జరిగింది. ఈ వార్త కర్ణాటకలో ఒక సంచలనగా మారింది.

హీరో దర్శన్ హత్య కేసు అరెస్ట్ ఆరోపణలు రావడం ఆ తర్వాత వెంటనే దర్శన్ మీద కేసు నమోదు కావడం జరిగింది . ఆ తర్వాత వెంటనే అరెస్ట్ చేయడాo కూడా చక చకా జరిగిపోయాయి. అసలు ఈ కేసు ఏమిటి? అసలు ఆ హత్య కేసు దర్శన్ మీద ఎందుకు మోపబడిందో ఇప్పుడు మనం తెలుసుకుందాము.

కన్నడ హీరో దర్శన్ కొంతకాలంగా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడం జరుగుతుంది. హీరో దర్శన్ కొంతకాలంగా దాంపత్య జీవితం కూడా వివాదాస్పదంగా మారింది. అదే కాకుండా హీరో దర్శన్ కి కొంతకాలం నుండి హీరోగా నటించిన సినిమాలో కూడా ప్లాప్ అవుతూ వస్తున్నాయి . కానీ రీసెంట్గా హీరో దర్శన్ నటించిన కటేరా మూవీ మాత్రం కన్నడ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది . ఈ మూవీ ఒక కన్నడ ఇండస్ట్రీ లోనే వంద కోటకు పైగా వాసులు సాధించింది. ఈ మూవీ తెలుగులో కూడా విడుదలై బాగానే వసూలు చేయడం జరిగింది.

హీరో దర్శన్ పర్సనల్ లైవ్ విషయానికి వస్తే గత కొంతకాలంగా తన భార్య విజయలక్ష్మి తో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఆ గొడవలు ఎందుకు చేతనంటే హీరో దర్శన్ గత కొంతకాలంగా నటి పవిత్ర గౌడ్ తో రిలేషన్ లో ఉండడం. దానివల్ల దర్శన్ భార్య విజయలక్ష్మి దర్శన్ తో తరచు గొడవ పడుతూ వార్తల్లో నిలుస్తుంది. దీనివలన హీరో దర్శన్ కూడా వార్తల్లో నిలవడం జరుగుతుంది.

అయితే హీరో దర్శన్ నటి పవిత్ర గౌడ్ తో రిలేషన్ లో ఉండడం వల్ల వీళ్ళ గురించి కన్నడ ఇండస్ట్రీలో రకరకాల పుకార్లు వస్తున్నాయి దానివల్ల భార్యాభర్తలు కూడా తరచుగా గొడవలు పడుతూ ఉన్నారు. అలాగే రీసెంట్గా నటి పవిత్ర గౌడ్ కొడుకు బర్త్ డే లో దర్శన్ హాజరు కావడం ఒక సంచలనంగా మారింది. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీనితో మళ్లీ దర్శన్ భార్య విజయలక్ష్మి హీరో దర్శన్ తో గొడవపడి వార్తల్లో నిలిచింది. ఇలా ఎప్పుడు హీరో దర్శన్ వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు.

హీరో దర్శన్ కు ఇండస్ట్రీలో కూడా అంతగా మంచి పేరు అయితే లేదు. ఎందుకు చేతన అంటే హీరో దర్శన్ తన తోటి హీరోల తోని ఎవరితోని అంతగా రిలేషన్ మైంటైన్ చేయడు . దానివల్ల ఏ హీరో సపోర్ట్ కూడా హీరో దర్శన్ కి ఇప్పుడు అంతగా లేదు.

ఈ మర్డర్ కేసు విషయానికి వస్తే

మర్డర్ జరిగిన వ్యక్తి పేరు రేణుక స్వామి. ఈ రేణుక స్వామి హీరో దర్శన్ కు వీరాభిమాని. అయితే తన అభిమాన హీరో తన భార్యకు అన్యాయం చేయడం పై రేణుక స్వామి బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది అంతే కాకుండా దర్శన్ పవిత్ర గౌడ తీరు ను కూడా తప్పుపట్టడం జరిగింది. పవిత్ర గౌడపై రేణుక స్వామి బహిరంగ వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది దాంతో దర్శన్ ఒక దశలో దశలో తీవ్రంగా ఆగ్రహానికి గురైనట్లు అప్పట్లో వార్తలు రావడం జరిగింది. అయితే పవిత్ర గౌడ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొద్ది రోజులకే రేణుక స్వామి అనుమాదాస్పదంగా మరణించడం జరిగింది రేణుక స్వామిని కామాక్షి పాల్య స్టేషన్ పరిధిలో ఒక షెడ్డులో హత్య చేయడం జరిగింది . సున్నాహళ్లి బ్రిడ్జి వద్ద రేణుక స్వామి బాడీని గుర్తించడం జరిగింది. ఈ ఘటనపై కామాక్షి పాల్య పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది ఈ హత్య కేసులో హీరో దర్శన్ ప్రధాన నిందితుడిగా హీరో దర్శన్ కి ఈ హత్యతో సంబంధం ఉందని ఆరోపణలు కూడా రావడం జరిగింది .దాంతోహీరో దర్శన్ ను అక్కడ పోలీసులు అరెస్టు చేయడం కూడా జరిగింది.

కన్నడ హీరో దర్శన్ హత్య కేసులో అరెస్ట్ కావడంతో కన్నడ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కన్నడ చిత్ర పరిశ్రమతో పాటు దక్షిణాది సినిమా పరిశ్రమ కూడా ఒక్కసారిగా షాక్ కి గురయ్యింది. చూడాలి ఈ కేస్ ఏమవుతుందో ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో.

Read More

Leave a Comment