Kubera Movie Update కు డేట్ ఫిక్స్ చేయడం జరిగింది. టాలీవుడ్లో ఫీల్ గుడ్ మూవీస్ని తీయగల దర్శకుడు లో మొదటగా గుర్తొచ్చే పేరు శేఖర్ కమ్ముల. ఈ శేఖర్ కమ్ముల ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ కుబేర పై ఎప్పటినుంచో ప్రేక్షకులకు మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున తో పాటు తమిళ సూపర్ స్టార్ ధనుష్ మరియు రష్మిక మందన ముఖ్యపాత్రలో నటించడం జరుగుతుంది. ఈ సినిమా మీద తెలుగులో ఎంత అంచనాలు ఉన్నాయో తమిళ్లో కూడా ఈ సినిమా మీద భారీ అంతనాలు నెలకొన్నాయి. అలాగే ఈ సినిమాలో నాగార్జున క్యారెక్టర్ ఏమిటన్నది మరియు ధనుష్ గారి క్యారెక్టర్ ఏమిటి అన్నది ఇప్పటివరకు సస్పెన్స్ గానే ఉన్నది. కానీ Kubera Movie మాత్రం డబ్బు అనే కాన్సెప్ట్ మీద నడుస్తుందని సమాచారం .
Kubera Movie లో ధనుష్ లుక్ చాలా మాస్ లెవల్లో ఉంది. అలాగే హీరో నాగార్జున గారి లుక్ క్లాస్ గా ఉంది. అలాగే ఈ సినిమాలో నాగార్జున గారు నెగిటివ్ క్యారెక్టర్ లో నటిస్తున్నారని ప్రచారం కూడా జరిగింది. అది ఎంతవరకు నిజమో తెలవదు కానీ ఈ సినిమాలో నాగార్జున గారి లుక్కు చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన హీరోల లుక్ మరియు ఈ సినిమా సంబంధించి టీజర్స్ కూడా విడుదలై ఈ సినిమా మీద మంచి అంచనాలను పెంచాయి.
ఇక ఈ సినిమా విషయానికి వస్తే తాజాగా ఈ సినిమా నుండి ఓ సాలిడ్ అప్డేట్ అయితే మేకర్స్ ఇవ్వడం జరిగింది ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ నవంబర్ 15వ తారీఖున రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర బృందం తాజాగా వెల్లడించడం జరిగింది. దీనితోపాటు ఒక సరి కొత్త పోస్టర్తో ఈ మూవీ అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది పోస్టర్లో అక్కినేని నాగార్జున చాలా కూల్ గా కనిపించడం జరుగుతుంది. దీంతో ఈ సినిమాలో ఆయన పాత్ర పై అభిమానులు అంచనాలు భారీగా పెరిగాయి.
ఇక ఈ సినిమాకు తెలుగు టాప్ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ గారు సంగీతం అందిస్తుండగా ఏషియన్ సునీల్ ఈ చిత్రాన్ని భారీ లెవల్లో తెరకెక్కించడం జరుగుతుంది.