Deepika Padukone Latest Updates: సినిమాలకు బ్రేక్ ఇస్తున్న దీపికా పదుకొనే .ఇప్పుడు ఈ న్యూస్ చాలా వైరల్ గా మారింది. ఏంటి ఆ మేటర్ ఇప్పుడు తెలుసుకుందాం. భారతీయా నటిగా నిర్మాతగా భారత దేశంలో అత్యధిక రెవెన్యూ రేషన్ తీసుకునే నటి నటలలో ఒకరిగా చెప్పుకోవచ్చు బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన స్థానం దీపికా పదుకొనే కు ఉంది దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నటి నటుల ల్లో దీపికా పదుకొనే కూడా ఒకరు. దీపిక పదుకొనే బ్రాండ్ వ్యాల్యూ లోను దేశంలోనే ఆరో స్థానంలో ఉన్నారు బాలీవుడ్ సినిమాలలోనే కాకుండా హాలీవుడ్ సినిమాలలోనూ నటించిన దీపిక పదుకొనే 2018లో ప్రపంచంలోని అత్యంత ప్రతిభావంతమైన 100 మంది నటీనటులలో ఒకరిగా నిలిచారని మనకు తెలుసు..
దీపికా పదుకొనే యొక్క రికార్డ్స్ గురించి:
తాజాగా కల్కి సినిమాతో అరుదైన రికార్డులను సృష్టించిన దీపికా పదుకొనే కల్కి సినిమాతో రెండవసారి 1000 కోట్ల క్లబ్బులో చేరారు అంతకుముందు షారుక్ ఖాన్ తో నటించిన పటాన్ సినిమాతో దీపికా పదుకొనే మొదటిసారిగా 1000 కోట్లు వసూలు చేసిన సినిమాలో హీరోయిన్గా నటించినది రెండోసారి ప్రభాస్ తో నటించిన కల్కి సినిమాతో వెయ్యి కోట్ల వసూలు చేసిన సినిమాలో హీరోయిన్గా నటించింది ఇలా రెండు సినిమాలకు 2000 కోట్ల రూపాయల వసూలు చేసిన సినిమాలో దీపిక పదుకొనే నటించి ఒక రికార్డును సృష్టించింది ఇది ఇలా ఉంటే ప్రస్తుతం దీపికా పదుకొనే ప్రెగ్నెంట్గా ఉన్న విషయం మన అందరికీ తెలిసిన విషయమే. కల్కి మూవీ ప్రమోషన్ లో కూడా దీపికా పదుకొనే పాల్గొనేటప్పుడు దీపికా పదుకొనే ప్రెగ్నెంట్ తో ఉందని అందరికీ కన్ఫామ్ అయ్యింది.
Deepika Padukone Latest Updates
పుట్టబోయే బిడ్డ కోసం కీలక నిర్ణయం తీసుకున్న దీపికా పదుకొనే:
ప్రెగ్నెంట్గా ఉన్న దీపికా పదుకొనే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారని విషయం మనందరికీ తెలిసిన విషయమే దీపిక పదుకొనే తన బేబీ జంప్ ఫోటోలను షేర్ కూడా చేశారు తాజాగా తనకి పుట్టబోయే బిడ్డ విషయంలో దీపికా పదుకొనే కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం లేటు వయసులో బిడ్డకు తలవుతున్న దీపికా పదుకొనే తన బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఎక్కువ సమయం తనకు పుట్టిన బిడ్డతోనే గడపాలని నిర్ణయం తీసుకున్నట్లు బాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలు సరోగసి ద్వారా ఎక్కువ మంది సెలబ్రిటీలు పిల్లల్ని కనడానికి ఇంపార్టెంట్ ఇస్తున్నారు.. అలా సరోగసి ద్వారా పిల్లలను కన్నా హీరోయిన్లు తమిళ్ ఇండస్ట్రీలో నయనతార తెలుగు ఇండస్ట్రీలో మంచు లక్ష్మి గారు సరోగసి ద్వారా పిల్లల్ని కనడం జరిగింది. దీపికా పదుకొనే అందరూ సెలబ్రిటీ లాగా తమకు పుట్టిన పిల్లలను కేర్ టేకర్స్ ఇచ్చి పెంచమని చెప్పడం తనకు నచ్చదని దీపికా పదుకొనే గారు తెలియజేశారు. అందుచేత తనకు పుట్టిన పిల్లలను తానే చూసుకుంటానని తన బిడ్డల పాలన పాలనా మొత్తం స్వయంగా తానే చూసుకుంటానని చెప్పినట్టు సమాచారం.