హిందీలో రఫ్ఫాడిస్తున్న Devara movie collections : జూనియర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ దేవర .ఈ మూవీ పోయిన నెల 27 తారీఖున పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించింది. తెలుగులో దేవర మూవీ 100 కోట్లు దాటిందని అంచనా. దేవర మూవీ మొదటి రోజు నుంచి ఈ సినిమాపై వ్యతిరేక ప్రచారం జరుగుతున్నప్పటికీ దాన్ని తట్టుకొని మరి ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది మొదటి మూడు రోజులకే ఈ సినిమా 304 కోట్లు కొల్లగొట్టి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలలో కలుపుకొని 350 కోట్ల రూపాయలు రాబట్టిందని తెలుస్తుంది దీనిపై దేవర మూవీ నిర్మాతల నుంచి అధికారికంగా ధ్రువీకరణ రావాల్సి ఉంది . అయితే వచ్చేది దసరా సెలవులు కాబట్టి ఈ సినిమాకు కలెక్షన్ల విషయంలో ఎటువంటి డోకా లేదని తెలుస్తుంది .
హిందీ మార్కెట్లో Devara movie collections దుమ్ము దులుపుతుంది:
జూనియర్ ఎన్టీఆర్ గారు నటించిన త్రిబుల్ ఆర్ మూవీ హిందీలో కూడా భారీ విజయన సాధించింది త్రిబుల్ ఆర్ మూవీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు నటిస్తున్న దేవర మూవీ కూడా హిందీలో విడుదల చేయడం జరిగింది ఎందుకంటే త్రిబుల్ ఆర్ మూవీ ద్వారా హిందీలో ఎన్టీఆర్ కూడా తన మార్కెట్ను ఏర్పరచుకోవడం జరిగింది దానితోపాటు ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన జాన్వి కపూర్ హీరోయిన్గా నటించినది మరియు ఈ సినిమాలో విలన్ గా నటించిన సైఫ్ అలీ ఖాన్ హిందీలో టాప్ హీరోలలో ఒకడు. అయితే హిందీలో దేవర మూవీ శివతాండవం చేస్తుందని తెలుస్తుంది . దేవర మూవీ హిందీలో మొదటి రోజు 9 కోట్ల రూపాయలు వసులు చేయగా. రెండో రోజు దేవర మూవీ 12 కోట్ల రూపాయలు వసూలు చేసింది .అలాగే మూడవరోజు 19 కోట్ల వరకు వసూలు చేసిందని హిందీ వర్గాలు చెప్పడం జరుగుతుంది మొత్తంగా హిందీ వర్షన్ లో ఈ సినిమా 50 కోట్లకు చేరువలో ఉంది హిందీ ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చిందని సినీ విశ్లేషణకులు అభిప్రాయపడుతున్నారు దీనికి తోడు హిందీలో కరణ్ జోహార్ కు చాలా పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఉంది కరణ్ జోహార్ గారి ధర్మా ప్రొడక్షన్ ఈ దేవర సినిమాను హిందీలో డిస్ట్రిబ్యూట్ చేయడం దేవర మూవీకి చాలా కలిసి వచ్చింది అని చెప్పవచ్చు.
తెలుగు రాష్ట్రాలలో 100 కోట్ల దాటేసిన Devara movie collections :
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం లాభాల్లోకి అడుగు పెట్టింది మరికొన్ని ప్రాంతాల్లో రెండు రోజుల్లో లాభాలు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి దేవర మూవీ ఆరు రోజులకు నైజాంలో 42 కోట్ల రూపాయల గుంటూరులో 9:30 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాలలో సుమారు 100 కోట్ల షేర్ను దేవర అందుకుంటుందని టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు చెప్పడం జరుగుతుంది . అలాగే దేవర మూవీ చాలా బాగా ఉన్నప్పటికీ దేవర మూవీ గురించి నెగిటివ్ ప్రచారం మొదటి రోజు నుంచి చేయడం జరుగుతుంది అయితే దీని వెనక ఎవరు ఉన్నారు అనే విషయంపై చిత్ర యూనిట్ తెలుసుకునే పనిలో ఉంది అందుకు కారకులైన వారు ఎవరైనా సరే వదిలేది లేదని దేవర మూవీ నిర్మాతలు తెలియజేయడం జరిగింది.