అదరగొడుతున్న దేవర మూవీ అడ్వాన్స్ బుకింగ్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంభోలో వస్తున్న దేవర చిత్రం ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కాబోతుంది అంటే ఇవాళ నైట్ నుంచే షోలు వేస్తున్నారు ఒంటిగంటకు దేవర మూవీ షోలు ప్రారంభం కానున్నాయి సినిమా విడుదలకు ముందే దేవర సృష్టిస్తున్న రికార్డులు చూస్తుంటే అందరికీ మతిపోతుంది .అలాగే అమెరికాలో ప్రీమియర్ షోస్ అమ్మకాల ద్వారా అమెరికాలో రెండు మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది ఈ విషయాన్ని దేవర నిర్మాతలు అధికారికంగా ప్రకటించడం జరిగింది.
దేవర సినిమా విడుదలకు ఇంకా ఒకరోజు మాత్రమే సమయం ఉన్నది ఆ సమయానికి నాలుగు మిలియన్ డాలర్లకు చేరుకున్న మనం ఆశ్చర్యపోనవసరం లేదు అని సినిమా ఇండస్ట్రీ పెద్దలు అంటున్నారు ఇప్పటికే ఈ సినిమా రెండు మిలియన్ డాలర్ల క్లబ్బులో చేరగా త్వరలోనే నాలుగు మిలియన్ డాలర్ల క్లబ్బులో చేరనుంది ఒక రకంగా ఇది సంచలనం అని సినీ పెద్దలు అభిప్రాయపడుతున్నారు దేవర మూవీ విడుదలకు ముందే 50 కోట్లు అడ్వాన్స్ రూపంలో రావడం అంటే మామూలు విషయం కాదని తారక్ సంచన రికార్డుల దిశగా పయనిస్తున్నారని తెలుగు ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
గతంలో రామ్ చరణ్ తో కలిసి నటించిన త్రిబుల్ ఆర్ మూవీ సినిమా 2 మిలియన్ డాలర్ క్లబ్ లో చేరింది తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా వస్తున్న దేవర కూడా ఈ క్లబ్లో అడుగుపెట్టింది దేవర సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో మనకు అర్థమవుతుంది ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల టికెట్ల ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వాలు కూడా అనుమతిని ఇచ్చాయి దీంతో వసూళ్లు ఏ స్థాయిలో వస్తాయనేది చూడాలి హిందీలో కరణ్ జోహార్ విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి మంచి థియేటర్లో దేవర మూవీ కి దొరుకుతాయి దేవరా సినిమా కు మంచి టాక్ వచ్చిందంటే చాలు దుమ్ము దులపడం ఖాయమని తారక అభిమానులు నమ్మకంగా చెప్పడం జరుగుతుంది వారి నమ్మకం నిజం అవుతుందో లేదో చూడాలంటే ఒక్కరోజు ఆగాల్సిందే.దేవర మూవీ అడ్వాన్స్ బుకింగ్.
ఎన్టీఆర్ ఆరు సంవత్సరాల తర్వాత సోలో హీరోగా వస్తున్న మూవీ దేవర. ఈ మూవీలో హిందీ లో టాప్ హీరోయిన్ జాన్వి కపూర్ తొలిసారిగా సౌత్ సినిమా ఇండస్ట్రీ లో కి అడుగుపెడుతుంది. అలాగే సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. సైఫ్ అలీ ఖాన్ కి కూడా ఇది మొదటి సౌత్ ఇండియా సినిమా. ఈ మూవీని కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే ఈ మూవీ ని నందమూరి కళ్యాణ్ రామ్ 300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించడం జరుగుతుంది. ఈ మూవీ ఎలా ఉందో తెలుసు కోవాలంటే ఇంకా 24 గంటలు ఆగితే సరిపోతుంది.. చూడాలి జూనియర్ ఎన్టీఆర్ గారు ఎన్ని రికార్డులను బద్దలు కొడతాడో.