Dil Raju’s sensational comment on gamechanger movie

Written by 24newsway.com

Published on:

Dil Raju’s sensational comment on gamechanger movie : gamechanger మూవీ మీద దిల్ రాజు గారు సంచన కామెంట్ చేయడం జరిగింది. ఈ మూవీ దిల్ రాజు గారిని పాతాళానికి పడేసింది అని కూడా చెప్పవచ్చు. నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అంటే గేమ్ చేంజర్ సినిమా ముందు దిల్ రాజు గారి సినిమాలు దాదాపు అన్ని విజయవంతం అయ్యాయి. కానీ ఈ సినిమా భారీగా నష్టాలను మిగిల్చింది. గేమ్ చేంజర్ మూవీ ఇండియాలో టాప్ డైరెక్టర్ అయిన శంకర్ గారు మరియు రామ్ చరణ్ గారు కాంబోలో భారీ లెవెల్ లో నిర్మించిన సినిమా. శంకర్ గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా అంటేనే భారీ స్థాయిలో బడ్జెట్ అవుతుంది. శంకర్ గారి దెబ్బకి పెద్ద పెద్ద స్టూడియో లే నష్టాలలో కూరుకుపోయాయి. అలా ఉంటది మరి శంకర్ గారి తో.

శంకర్ గారు గత కొంత కాలంగా భారీ సినిమాలో తీస్తూ అపజయాలను మూట కట్టుకుంటున్నారు. శంకర్ గారు రోబో సినిమా తర్వాత తీసిన అన్ని సినిమాలు బాక్సాఫీసు దగ్గర అట్టర్ ప్లాప్ అవుతున్నాయి. రోబో సినిమా తీసిన తర్వాత శంకర్ గారి దర్శకత్వంలో వచ్చిన రోబో 2 మూవీ పర్వాలేదు అనిపించినా గానీ సినిమాకు మాత్రం పెట్టిన బడ్జెట్ కి వచ్చిన లెక్కలకి సంబంధం లేకుండా ఉన్నాయి. ఆ సినిమా తర్వాత కమలాసన్ గారితో భారతీయుడు 2 సినిమా మొదలు పెట్టడం జరిగింది. ఆ సినిమా కొంచెం షూటింగ్ అయిపోయిన తర్వాత లైకా ప్రొడక్షన్ వాళ్లతో గొడవ వచ్చి శంకర్ గారు భారతీయుడు 2 సినిమాను ఆపి వేయడం జరిగింది.

ఆ తర్వాత శంకర్ గారు రామ్ చరణ్ గారికి గేమ్ చేంజర్ మూవీ స్టోరీని చెప్పడం జరిగింది ఆ తర్వాత దానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించడం జరిగింది. గేమ్ చేంజర్ సినిమా మొదలుపెట్టి కొన్ని రోజులు షూటింగ్ జరిగిన తర్వాత శంకర్ గారు భారతీయుడు సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టడం జరిగింది. దీనితో గేమ్ చేంజర్ మూవీస్ షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. దానితో దిల్ రాజు గారికి బడ్జెట్ అనుకున్న దానికంటే డబల్ అయింది. అలాగే శంకర్ గారు గేమ్ చేంజర్ మూవీ మీద అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు. గేమ్ చేంజర్ మూవీ ప్రమోషన్ కూడా సరిగా చేయలేదు దిల్ రాజు గారు. గేమ్ చేంజర్ మూవీ సినిమా మీద ప్రేక్షకులకు కూడా అంతగా ఇంట్రెస్ట్ లేక మార్కెట్ కూడా సరిగా బిజినెస్ జరగలేదు.

ఆ తర్వాత దిల్ రాజు గారు ఈ సినిమాని విడుదల చేసినా గాని పెట్టిన డబ్బులు సగం కూడా వసూలు చేయలేక పోయింది. ఆ దెబ్బతో దిల్ రాజు గారు ఎన్ని రోజులు సంపాదించిన పైసలు అన్ని ఈ సినిమా ద్వారా పోగొట్టుకున్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. రీసెంట్గా దిల్ రాజు గారు ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ గేమ్ చేంజర్ మూవీ గురించి షాకింగ్ కామెంట్ చేయడం జరిగింది.

అది ఏమిటంటే గేమ్ చేంజర్ మూవీ మూవీ శంకర్ గారిని నమ్మి అంత బడ్జెట్ పెట్టడం నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు అని. ఏం చేంజర్ మూవీ వల్ల తనకు చాలా లాస్ వచ్చిందని తన జీవితంలో ఇంతకన్నా పెద్ద తప్పు ఇంతవరకు చేయలేదని దిల్ రాజు గారు చెప్పడం జరిగింది. అలాగే గేమ్ చేంజర్ మూవీ ద్వారా వచ్చిన లాస్ ను సంక్రాంతికి వస్తున్నాము సినిమా నన్ను కాపాడిందని దిల్ రాజు గారు చెప్పడం జరిగింది. అలాగే ఇంకొకసారి శంకర్ గారి తో సినిమా తీయని అని కూడా చెప్పడం జరిగింది.

Read More

🔴Related Post