విపరీతంగా ( hairloss ) జుట్టు రాలుతుందా అయితే మీకోసమే ఈ వార్త. మనిషిని అందంగా చూపించడంలో జుట్టు కూడా ముఖ్య పాత్ర వహిస్తుందని మనకు ఆల్రెడీ తెలుసు. మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా జుట్టు ఎంత ఎక్కువగా ఉంటే అంత లుక్ వస్తుంది. అందుకే మనము జుట్టు ఊడినచో తెగ బాధ పడుతూ ఉంటాము వాటికి నివారణ మార్గాలు ఏమిటనేది తెలుసుకుంటాము. hairloss జుట్టు రాలకుండా ఉండడానికి నేను మీకు ఒక చిట్కా చెప్తా అదేమిటంటే
ముందు hairloss జుట్టు ఎందుకు రాలుతుందో తెలుసుకుందాం:
జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉంటాయి. అందులో ప్రధానమైనది ఒత్తిడికి గురి కావడం. ఒత్తిడి అధికంగా ఉన్న వాళ్లకి జుట్టు ఎక్కువగా రాలుతుంది. మరియు ఇంకా వేరే ఆరోగ్య సమస్యలు ఉన్న హార్మోన్ల లోపం ఉన్న థైరాయిడ్ సమస్యలు ఉన్న విటమిన్ లోపం ఉన్న మరియు ఐరన్ లోపం ఉన్న గాని జుట్టు ఎక్కువగా రాలుతుంది. అలాగే మనకు ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు వాడే టాబ్లెట్లు వలన కూడా జుట్టు రాలడం అధికంగా ఉంటుంది.
hairloss జుట్టు రాలడాన్ని నివారించడం :
జుట్టు రాలడాని నివారించడానికి చాలామంది రకరకాల నూనెలు వాడుతూ ఉంటారు అది చాలాసార్లు చాలా మంది దగ్గర చూస్తూ ఉంటాము. కొంతమంది మాత్రం టీవీలో న్యూస్ పేపర్ లో యూట్యూబ్లో వీడియోలు చూసి రకరకాల నూనె నెత్తికి రాసి ఉన్న జుట్టు కూడా పోయేలాగా చేసుకుంటారు. జుట్టు రాలుతున్నప్పుడు నూనెలో ఒక్కటి రాస్తే సరిపోదు జుట్టుకు కావలసిన పోషకాలు అందించే ఆహారాలను కూడా తీసుకోవాలి. ప్రోటీన్లు విటమిన్లు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం వలన జుట్టు దాని సమస్య తగ్గుతుంది. స్వచ్ఛమైన కొబ్బరినూనె స్వచ్ఛమైన బాదం నూనె తో తలను మర్దన చేయడం వల్ల తలలో రక్త ప్రసరణ పెరిగి జుట్టు రాలడం తగ్గిస్తుంది. అలాగే వీటితోపాటు సహజ చిత్తమైన ఉల్లి రసాన్ని జుట్టుకి రాసి బాగా మర్దన చేసి 15 నిమిషాల తర్వాత తలంటు స్థానం చేస్తే జుట్టు రాలడం తగ్గించవచ్చు. అలాగే బియ్యం కడిగిన నీళ్లను జుట్టుకు పట్టించి 15 నిమిషాల తర్వాత తలంటు స్థానం చేస్తే జుట్టు ఊడడం తగ్గుతుంది. వీటితోపాటు ఆర్గానిక్ గా దొరికే కుంకుడు కాయలతో వారానికి రెండు సార్లు తలంటు స్థానం చేసిన జుట్టు ఆరోగ్యంగా ఉండి జుట్టు ఊడడం తగ్గుతుంది. ఇలా మీరు ఆర్గానిక్ గా దొరికే వాటితో జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.