Don’t drink e-drinks if you don’t want to get old soon

Written by 24newsway.com

Published on:

Don’t drink e-drinks if you don’t want to get old soon :త్వరగా ముసలి వాళ్లు కాకూడదు అనుకుంటే ఈ డ్రింక్స్ తాగొద్దు మనిషి జీవితంలో ముసలితనం అనేది ఒక సహజమైన ప్రక్రియ కానీ మనము తీసుకునే ఆహారం ఒక్కొక్కసారి మన వయసును పెంచి మనల్ని ముసలి వాళ్ళను అయ్యేలా చేస్తుంది. అదేంటి ఆహారాలతో కూడా వయసు పెరుగుతుందా అంటే కచ్చితంగా అవునని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. కొన్నిరకాల ఆహార పదార్థాలు తింటే కొన్ని రకాల పానీయాలు తాగితే ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఉన్న వయసు కంటే పదేళ్లు ఎక్కువ వయసున్న వారిలాగా కనిపిస్తారు అని కొన్ని పరిశోధనల వల్ల తెలిసింది.

ఎప్పుడు యవ్వనంగా కనిపించాలంటే ఏమి చేయాలి:

ఎప్పుడు యవ్వనంగా కనిపించాలి అని చాలామందిలో ఉండే సహజమైన కోరిక. ఇప్పుడు నేను చెప్పే వాటిని మీరు పాటిస్తే ఎప్పుడూ యవ్వనంగా ఉంటారని మాత్రం చెప్పలేను గానీ ముసలితనం తొందరగా రాదు అని మాత్రం చెప్పగలను.. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యవ్వనంగా కనిపించడానికి తాగకూడని కొన్ని పానీయాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం చాలామంది కాపీని ఎక్కువగా తాగుతూ ఉంటారు మార్నింగ్ సమయంలో కప్పు తాగితే పర్వాలేదు కానీ రోజంతా ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ కాపీని తాగుతూ ఉంటారు కొంతమంది . మనం కాఫీ ఎక్కువగా తాగడం వల్ల ఇది మూత్ర విసర్జన ఎక్కువగా చేస్తుంది ఫలితంగా మన శరీరం డి ఐ డ్రేషన్ గురి అయ్యి మన చర్మం పాడవుతుంది. అందుకే కాఫీ రోజుకి ఒకటి లేదా రెండు కప్పులు తాగితే పర్వాలేదు గాని కొంత మంది కనీసం ఐదు నుంచి పది కప్పులు కాఫీ తాగుతూ ఉంటారు. వాళ్లు తొందరగా కాఫీ మానేయడం మంచిది. కాఫీ తాగడం మానకపోతే మీ చర్మానం మీరే పాడు చేసుకోవడం జరుగుతుంది దానివల్ల మీరు ముసలి వాళ్ళ లాగా కనిపించడం జరుగుతుంది.

మందు ఎక్కువగా తాగే వాళ్ళు కూడా డి హైడ్రేషన్ గురి కావడం జరుగుతుంది ఫలితంగా చర్మం కాంతిని కోల్పోవడమే కాకుండా చర్మం పైన ముడతలు ఏర్పడి ఇప్పుడు మీకు ఉన్న వయసు కంటే ఐదు నుంచి పది సంవత్సరాలు ఎక్కువ వయసు ఉన్న వారిగా కనిపించడం జరుగుతుంది.. అందుకే . ఆల్కహాల్ కూడా దాదాపు మానేయడం మంచిది.

అలాగే చాలామంది కూల్ డ్రింకులు ఎక్కువగా తాగడం మనం చూస్తూ ఉంటాము ఇలా ఎక్కువగా కూల్ డ్రింకులు తాగడం వల్ల మన శరీరం మీద చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. కూల్ డ్రింకు లో చక్కెర శాతం అధికంగా ఉండడం వలన అది చర్మంలోని కోలార్జెన్ ను దెబ్బతీస్తుంది ఫలితంగా చర్మం ముడతలు పడి ముసలివాడి లాగా కనిపించడం జరుగుతుంది ఈ ప్రాబ్లం అనేది వస్తుంది.

వీటితోపాటు మనం ఎక్కువగా రసాలను తీసుకోవడం శరీరానికి చాలా మంచిది అలాగే మనము రోజుకి నాలుగు లీటర్ల నీళ్లు తాగడం మన శరీరాన్ని మరియు మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటితోపాటు జంక్ ఫుడ్ ను కూడా మానేయడం చాలా మంచిది. ఇలా మన శరీరాన్ని తొందరగా ముసలితనం బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు.

READ MORE

Leave a Comment