Drink water after having food : భోజనం చేయగానే నీళ్లు తాగుతున్నారా.. తిన్న వెంటనే నీళ్ళు తాగితే ఏం జరుగుతుంది భోజనం చేసిన తర్వాత పండు తినవచ్చా. మనలో చాలామంది భోజనం చేసిన వెంటనే కాఫీ గాని టీ గాని నీటిని ఎక్కువగా తాగటం లాంటి అలవాట్లు ఉన్నాయి. మీరు కూడా ఇలానే చేస్తున్నారు అయితే అలవాట్లు ఎంత త్వరగా మానుకుంటే ఆరోగ్యానికి అంత మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు. తెలుసో తెలియకో చాలామంది చేసే పొరపాట్ల కారణంగా జీర్ణవ్యవస్థ పనితీరుపై ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు ఫలితంగా కొంతమందిలో లేనిపోని అనారోగ్యాలకు దారి తీస్తుంది అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే భోజనం చేసిన వెంటనే కొన్ని పనులు చేయకూడదు. అవి ఏంటో తెలుసుకుందాం.
స్నానం చేస్తున్నారా?
కొంతమంది తిన్న వెంటనే స్నానం చేస్తుంటారు అలాంటి వారు ఈ అలవాటు మానుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా తీసుకున్న ఆహారం జీర్ణం కావడానికి తగిన శక్తి పొట్టకు సరైన రక్త ప్రసరణ అవసరం ఉంటుంది. అయితే స్నానం రక్తప్రసరణ పై ప్రభావం చూపి శరీర ఉష్ణోగ్రత అదుపు చేస్తుందని అంటున్నారు. ఫలితంగా ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీంతో అజీర్ణ వంటి సమస్యలు వస్తాయని తెలుపుతున్నాను. మనం భోజనం చేసిన తర్వాత గంట వరకు స్నానం చేయకుండా ఉండటం మంచిది.
Drink water after having food టీ కాఫీ తాగటం
ఇంకా కొంతమంది భోజనం చేసిన వెంటనే టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. అయితే దీని వల్ల మనం తీసుకున్న ఆహారంలోని పోషకాలు ఐరన్ వంటివి శరీరం గ్రహించే శక్తి క్షీణిస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు. కాబట్టి తిన్న వెంటనే కాకుండా గంట తర్వాత తక్కువ మోతాదు టీ గాని కాఫీ గాని తీసుకోవటం మంచిది. దానివల్ల ఎలాంటి సమస్య ఉండదని నిపుణులు సలహా ఇస్తున్నారు. కొంతమంది తిన్న వెంటనే గడగడ నీళ్లు తాగేసి అలవాటు ఉన్నవారు ఉంటారు ఇలా చేయడం వల్ల మనం తీసుకున్న ఆహారం జీర్ణం కావడానికి మన శరీరంలో సహకరించే ఎంజైమ్స్ జీర్ణ రసాలు వంటివి తక్కువ ఉత్పత్తి అవుతాయి. దీనివల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాదని నిపుణులు తెలియజేస్తున్నారు. కాబట్టి భోజనం చేసిన వెంటనే గంట తర్వాత గ్లాస్ నీళ్లు తాగడం మంచిది.
పండ్లు తినటం
ముఖ్యంగా భోజనం చేసిన వెంటనే ఏదో పండు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇది నిజమే అయినా భోజనం చేశాక తీసుకునే కంటే అల్పహారబిసమయంలో తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయటం వల్ల ఆ పండ్లలో ఉండే పోషకాలను శరీరం పూర్తిగా గ్రహిస్తుందని వివరించారు. భోజనంతో పాటు తీసుకోవడం వల్ల మన శరీరానికి పూర్తిగా పోషకాలు అందవని అందుకని అల్పాహారం లో తీసుకోవడం వల్ల లేదంటే సాయంత్రం స్నాక్స్ రూపంలో తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని సలహా ఇస్తున్నారు.
గమనిక ఈ సమాచారం కొన్ని అధ్యయనాలు సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వీటిని పాటించే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం.